ETV Bharat / business

సూచీలకు 'ఫెడ్‌' జోష్‌- భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు- మదుపరుల సంపద రూ.4లక్షల కోట్లు జంప్‌! - Stock Market Today 14th December 2023

Stock Market Today 14th December 2023 : అమెరికా ఫెడ్‌ తీసుకున్న నిర్ణయం సూచీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 929 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Sensex and Nifty Sets New Record Today Stock Markets 2023 14th December
Stock Market Today 14th December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 12:21 PM IST

Updated : Dec 14, 2023, 4:34 PM IST

  • 04.24PM
    Stock Market Today 14th December 2023 : దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్‌ తీసుకున్న నిర్ణయం సూచీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 900 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 21,150 పాయింట్ల ఎగువస్థాయిలో నిలిచింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ దాదాపు రూ.4లక్షల కోట్లు పెరిగి రూ.355 లక్షల కోట్లకు చేరింది.

ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో గురువారం ఉదయం సెన్సెక్స్‌ 70,146 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. అలా రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 70,110.75- 70,602.89 మధ్య కదలాడింది. చివరకు 929.60 పాయింట్ల లాభంతో 70,514.20 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 256.35 పాయింట్ల లాభంతో 21,182.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.33గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధర 75.63 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా బంగారం ఔన్సు 2049 డాలర్లకు ఎగబాకింది.

సెన్సెక్స్‌ 30లో టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ సుజుకీ, టైటాన్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

  • 10.00AM
    Stock Market Today 14th December 2023 : దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ఆల్​టైమ్​ రికార్డు స్థాయులను తాకాయి. సెన్సెక్స్​ సూచీ 70,540 పాయింట్లను తాకి ఆల్​టైమ్​ హై రికార్డును నమోదు చేసింది. నిఫ్టీ సూచీ కూడా 21,190 పాయింట్లకు చేరి జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకింది. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని అమెరికా ఫెడరల్​ బ్యాంక్​ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. అంతకుముందు సెన్సెక్స్‌ దాదాపు 650 పాయింట్లకు పైగా లాభంతో 70,245 వద్ద, నిఫ్టీ 220 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 21,110 వద్ద ట్రేడింగ్​ను ప్రారంభించాయి.

తాజా ర్యాలీతో బీఎస్​ఈలో-లిస్టెడ్​ సంస్థల Mcap రికార్డు స్థాయిలో రూ.354.41 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో మదుపర్ల సంపద రూ.3 లక్షల కోట్ల మేర పెరిగింది.
మరోవైపు యూఎస్​ ఫెడ్​ నిర్ణయం ఆసియా-పసిఫిక్‌లోని మార్కెట్​ సూచీలపైనా సానుకూల ప్రభావం చూపాయి. ఒక్క జపాన్‌ సూచీ మినహా మిగిలిన ప్రధాన సూచీలు మొత్తం భారీ లాభాల్లోనే ట్రేడింగ్​ను కొనసాగిస్తున్నాయి.

స్టాక్​ మార్కెట్​..
సెన్సెక్స్​ సూచీల్లో​ హెచ్​సీఎల్​ టెక్నాలజీస్, బజాజ్​ఫినాన్స్​, ఇన్ఫోసిస్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, విప్రో, టెక్​ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​, కోటక్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, రిలయన్స్​, టాటాస్టీల్​, హెచ్​డీఎప్​సీ బ్యాంక్, ఎం అండ్​ ఎం, ఎస్​బీఐ, ఎల్​ అండ్​ టీ, భారతీ ఎయిర్​టెల్​, ఎన్టీపీసీ, ఏషియన్​ పెయింట్స్​, టాటా మోటార్స్ ​సంస్థల షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతుండగా- సన్​ఫార్మా, ఐటీసీ, హెచ్​యూఎల్, టైటాన్​, మారుతీ, పవర్​ గ్రిడ్​, నెస్లే ఇండియా కంపెనీల స్టాక్స్ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.27గా ఉంది.

ఫెడ్‌ రేట్లలో మార్పుల్లేవ్​..
యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్​ తన కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచింది. రెండు రోజుల పాటు జరిగిన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) సమావేశ నిర్ణయం భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక వెలువడంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి అమెరికా ఫెడ్​​ చీఫ్​ నుంచి ఏమైనా ప్రకటన వస్తుందని అంతా భావించినా అటువంటేది ఏమీ జరగలేదు. ఈ కారణంతో భారత స్టాక్ మార్కెట్​లు అనూహ్యంగా దూసుకుపోతున్నాయని స్టాక్​ మార్కెట్​ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అమెరికా ద్రవ్యోల్బణం ఇంకా 2 శాతం లక్ష్యం కంటే ఎగువనే ఉన్నందున, కఠిన వైఖరిని కొనసాగిస్తూ.. విధాన రేట్లను ప్రస్తుత 5.25-5.50 శాతం శ్రేణిలోనే ఉంచుతున్నట్లు తెలిపింది ఫెడ్​ రిజర్వ్​ బ్యాంక్​. వరుసగా మూడో సారి కూడా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడం విశేషం.

డెబిట్ కార్డ్​తో ఫ్రీగా ఇన్సూరెన్స్​ కవరేజ్​! ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే?

పెళ్లిళ్ల సీజన్​ ఎఫెక్ట్​- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు- ఎంతంటే?

Last Updated : Dec 14, 2023, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.