ETV Bharat / business

మాంద్యం భయాలు.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 950 డౌన్ - indian stock markets

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 311 పాయింట్లు కోల్పోయింది. రూపాయి జీవితకాల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది.

STOCK MARKET
STOCK MARKET
author img

By

Published : Sep 26, 2022, 3:42 PM IST

అంతర్జాతీయ బలహీన పవనాల మధ్య వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఉదయం 816 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఓ దశలో 57,708 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసిన సూచీ.. చివరకు 953 పాయింట్ల నష్టంతో 57,145 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోని షేర్లు..
30 షేర్ల ఇండెక్స్​లో ఏషియన్​పేంట్స్, హెచ్​సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. మారుతీ, టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. అటు, నిఫ్టీ సైతం ఆద్యంతం నష్టాల్లోనే పయనించింది. 311 పాయింట్ల నష్టంతో 17,016 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

అంతర్జాతీయ మార్కెట్లు..
శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ ప్రభావంతో సోమవారం ఆసియా మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సియోల్, టోక్యో, షాంఘై మార్కెట్లు డీలా పడగా.. హాంకాంగ్ మార్కెట్లు రాణించాయి.

మాద్యం భయాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా బాండ్లపై రాబడి అధికంగా ఉన్న నేపథ్యంలో.. పెట్టుబడులు అటువైపు మళ్లే అవకాశం ఉందని తెలిపారు. 'ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ మందగమనంలో భారత్ ఓ ఆశాకిరణంలా ఉన్నా.. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశీయ మార్కెట్లు పూర్తి రక్షణ పొందలేకపోతున్నాయి' అని విశ్లేషకులు చెబుతున్నారు.

క్రూడ్ ఆయిల్ ధర
అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త పడిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 85.64 డాలర్లకు చేరింది.|
రూపాయి విలువ
రూపాయి విలువ మరోసారి పడిపోయింది. సోమవారం ఉదయం సరికొత్త కనిష్ఠ స్థాయికి చేరింది. 43 పైసలు పడిపోయిన రూపాయి.. 81.52కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.