Smart TV Shipments : స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వృద్ధి క్షీణించినప్పటికీ.. దేశంలో స్మార్ట్ టీవీల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. గతేడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్‌టీవీల అమ్మకాలు 38 శాతం మేర పెరిగాయని కౌంటర్‌పాయింట్ నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా వరుస పండగలు, ఆఫర్లు, కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడం, డిస్కౌంట్లు వంటివి విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్ నివేదిక పేర్కొంది. టీవీ విక్రయాల్లో 93 శాతం స్మార్ట్ టీవీలే ఉంటున్నాయని తెలిపింది. రూ.20,000 ధరలో సామాన్యులను స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించింది. అందువల్ల ఈ మరింత విక్రయాలు పెరిగే అవకాశాలున్నాయని నివేదిక తెలిపింది. ఓటీటీ కంటెంట్‌ను వీక్షకులు ఎక్కువ ఆసక్తి చూపడం వల్ల స్మార్ట్ టీవీల అమ్మకాలు పెరిగాయని వెల్లడించింది.
"నాన్ స్మార్ట్ టీవీ వాడుతున్నవారు కూడా స్మార్ట్ టీవీవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ త్రైమాసికంలో 93 శాతానికి స్మార్ట్ టీవీలు అమ్మకాలు పెరిగాయి. రూ.25,000 ధరకే గూగుల్ టీవీ కూడా సామాన్యులకు అందుబాటులో వచ్చేసింది. మరిన్ని కొత్త మోడళ్లు కూడా రూ.20,000 ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది."
-- అన్షిక జైన్, కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్