Small Saving Schemes Revised Interest Rates : ప్రస్తుత కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్న చాలామంది.. ఏదో ఒక పొదుపు పథకంలో ఎంతో కొంత పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా.. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో(Small Saving Schemes) ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు సవరిస్తోంది. అయితే.. ఇటీవల సవరించిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Post Office Savings Schemes Interest Rates 2023 : ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించి కొన్ని ఎంపిక చేసిన పథకాలపై గరిష్ఠంగా 0.3 శాతం మేర కేంద్రం వడ్డీ రేట్లను సవరించింది. అయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ (SSY) వంటి పాపులర్ పథకాల వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం ఏ ఏ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో వడ్డీరేట్లు ఎంత మేర పెరిగాయి. వేటిల్లో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచారో ఇప్పుడు చూద్దాం. కేంద్రం పోస్టాఫీసుల్లో అందించే సంవత్సరం కాలావధి కలిగిన టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును(Saving Schemes Interest Rates) 0.1 శాతం పెంచింది. దీంతో అందులో వడ్డీ రేటు 6.9 శాతానికి చేరింది. అలాగే రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పైనా 0.1 శాతం వడ్డీ పెంచడంతో దాంట్లో వడ్డీ రేటు 7 శాతానికి పెరిగింది. అయితే మూడేళ్లు, ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేట్లలో మార్పు చేయలేదు. అదేవిధంగా ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 6.2 శాతం నుంచి 6.5 శాతానికి కేంద్ర సర్కార్ పెంచింది.
గుడ్‌న్యూస్.. 'చిన్న మొత్తాల' వడ్డీ రేట్లు పెంపు.. ఈ స్కీమ్‌లపైనే..
Post Office Savings Schemes Revised Interest Rates : అయితే ఇతర పొదుపు పథకాలపై మాత్రం ఈ త్రైమాసికానికి వడ్డీ రేట్లనూ కేంద్రం యథాతథంగా కొనసాగిస్తోంది. అవేమిటంటే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)పై 7.1%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7%, సేవింగ్స్ డిపాజిట్‌పై 4.0%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2%, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4%, కిసాన్ వికాస్ పత్రపై 7.5%, సుకన్య సమృద్ధి యోజన(Sukanya Samriddhi Yojana) 8% చొప్పున లబ్ధిదారులకు వడ్డీరేట్లు లభించనున్నాయి.
పొదుపు పథకాలపై కేంద్ర సవరించిన వడ్డీ రేట్లు ఇలా..
పెట్టుబడి | వడ్డీ రేటు (ఏప్రిల్ నుంచి జూన్ 2023 వరకు) | సవరించిన వడ్డీరేటు(జులై నుంచి సెప్టెంబర్ 2023 వరకు) |
సేవింగ్స్ డిపాజిట్ | 4.0% | 4.0% |
1 Year Time Deposit | 6.8% | 6.9% |
2 Year Time Deposit | 6.9% | 7.0% |
3 Year Time Deposit | 7.0% | 7.0% |
5 Year Time Deposit | 7.5% | 7.5% |
5 Year Recurring Deposit | 6.2% | 6.5% |
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) | 8.2.% | 8.2% |
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ | 7.4% | 7.4% |
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్(NSC) | 7.7% | 7.7% |
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) | 7.1% | 7.1% |
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ (KVP) | 7.5%(will mature in 115 months) | 7.5%(will mature in 115 months) |
సుకన్య సమృద్ధి యోజన | 8.0% | 8.0% |
Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?
పోస్ట్ ఆఫీస్ X స్టేట్ బ్యాంక్.. ఫిక్స్డ్ డిపాజిట్‌కు ఏది బెస్ట్? అధిక వడ్డీ ఎవరిస్తారు?
రూ.1000 పెట్టుబడితో కోటీశ్వరులు కావచ్చు! కానీ.. ఓ ట్విస్ట్!!