Simple Tips for Electric Scooter Charger Run Out: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారడంతో వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కర్బన ఉద్గారాలను నియంత్రించడం కోసం కూడా ఈవీల వినియోగం పెరుగుతోందని చెప్పవచ్చు. ఈవీలు నడపడానికి తేలికగా ఉండటం కూడా మరో కారణం.
అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా క్రేజ్ ఉన్నా.. చాలా మంది కొనుగోలు చేయడానికి వెనుకాడతారు. ఎందుకంటే మార్గమధ్యలో ఛార్జింగ్ అయిపోతే దగ్గర్లో ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే ఇబ్బంది పడాల్సివస్తుందని. ఈ సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జింగ్ పాయింట్‌కి తీసుకెళ్లినా అది ఛార్జ్ కావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకూ ఎదురుచూడాల్సి వస్తుంది.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు అన్ని చోట్లా ఛార్జింగ్ స్టేషన్లు లేవు. పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. మీరు మీ వాహనాన్ని ఛార్జింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఛార్జ్ చేయవచ్చు. ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా ఛార్జింగ్ అయిపోతే ఆందోళన చెందకుండా ఈ చిట్కాలు పాటించండి.
బ్యాటరీ మార్పిడి : ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు బ్యాటరీ మార్పిడి సాంకేతికతతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రెండు బ్యాటరీలను వెంటపెట్టుకోవడం ద్వారా స్కూటర్‌లో బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ స్టేషన్‌లకు వెళ్లి మరో బ్యాటరీని మార్చుకుని ప్రయాణం కొనసాగించవచ్చు. కాబట్టి మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రీప్లేస్ చేయగల బ్యాటరీ ఉంటే, మీరు ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా మీ సమీపంలోని బ్యాటరీ మార్పిడి(Battery Swap Station) స్టేషన్‌కి వెళ్లి ఛార్జ్ అయినా బ్యాటరీని తీసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైన చిట్కా.
మీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకోని పరిస్థితుల్లో ఛార్జ్ అయిపోతే, మీరు దానిని మీకు దగ్గరలో తెలిసిన వారి ఇళ్లకు తీసుకుని వెళ్లండి. అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఎంపికలు అందుబాటులో లేకుంటే, స్థానికులను అభ్యర్థించి.. అక్కడ మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఛార్జింగ్ చేసుకోండి.
రోడ్ సైడ్ అసిస్ట్: మీ స్కూటర్ ఛార్జ్ అయిపోయి మీరు ఇంటికి చేరుకోలేని పరిస్థితిలో ఉంటే.. మీ చివరి అలాగే ఉత్తమ ఎంపిక రోడ్ సైడ్ అసిస్ట్. ఆన్లైన్లో రోడ్ సైడ్ అసిస్ట్ సదుపాయాన్ని అందించే అనేక వెబ్‌సైట్‌లు ఉన్నాయి. మీరు మీ లొకేషన్‌ను షేర్ చేసి మీ వాహనాన్ని సులభంగా మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
New Electric Bike In India : స్టన్నింగ్ ఫీచర్స్‌తో టోర్క్ మోటార్స్ ఈ-బైక్ లాంఛ్.. ధర ఎంతంటే?