ETV Bharat / business

ఫేస్​బుక్​కు షాక్.. సీఓఓ రాజీనామా​.. కారణం అదేనా?

Facebook Meta COO Resign: ఫేస్​బుక్ మాతృసంస్థ మెటాలో జుకర్​బర్గ్​ తర్వాత స్థానంలో.. సీఓఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న షెరిల్ సాండ్​బర్గ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. అయితే అందుకు గల కారణం మాత్రం వెల్లడించలేదు.

author img

By

Published : Jun 2, 2022, 1:32 PM IST

Facebook Meta COO Resign
Facebook Meta Facebook Meta COO ResignCOO Resign

Facebook Meta COO Resign:ఫేస్​బుక్​ మాతృసంస్థ మెటాలో చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​(సీఓఓ)గా విధులు నిర్వర్తిస్తున్న షెరిల్ సాండ్​బర్గ్ అనూహ్యంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ప్రకటించారు. అయితే పదవి నుంచి వైదొలగడానికి కారణం మాత్రం తెలియజేయలేదు. దాతృత్వ కార్యక్రమాలపై పూర్తి దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ఫేస్​బుక్​ పోస్టులో ఆమె తెలిపారు.

శాండ్​బర్గ్​ పోస్టుపై ఫేస్​బుక్​ మెటా సీఈఓ మార్క్​ జుకర్​​బర్గ్​ స్పందించారు. శాండ్​బర్గ్​.. కంపెనీ డైరక్టర్ల బోర్డులో కొనసాగుతారని చెప్పారు. తమ సంస్థ తదుపరి సీఓఓగా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ జేవియర్ ఒలివాన్ బాధ్యతలు తీసుకుంటారని ప్రకటించారు. "2007లో షెరిల్ ఫేస్​బుక్​లో చేరినప్పుడు, నా వయస్సు కేవలం 23 సంవత్సరాలు. ఆ సమయంలో నాకు కంపెనీని నడపడం గురించి ఏమీ తెలియదు. సాండ్​బర్గ్​ నాకు సహకరించి కంపెనీని బాగా నడిపించారు" అని జుకర్‌బర్గ్ ఓ పోస్ట్‌లో తెలిపారు.

షెరిల్​ సాండ్​బర్గ్.. ఫేస్​బుక్​లో చేరకముందు గూగుల్​ వైస్​ ప్రెసిడెంట్​గా బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే ఆ సమయంలో ఆమె టెక్​ ఫీల్డ్​లో ఒక ఉన్నతస్థాయి వ్యక్తిగా ఎదిగారు. సాండ్​బర్గ్​.. ఫేస్​బుక్​లో చేరాకే ఆ సంస్థ ఆదాయం భారీగా పెరిగిందని టెక్​ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

కోరలు చాస్తున్న 'ద్వేషం'.. మరోవైపు.. ఫేస్​బుక్ మాతృసంస్థ మెటా విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం.. ఏప్రిల్‌ నెలలో ఫేస్‌బుక్‌లో ద్వేషపూరిత పోస్టులు 37.82 శాతం పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 86 శాతం పెరిగింది. మార్చి నెలతో పోలిస్తే మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా?

జూన్​లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.