దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. డాలర్ ఇండెక్స్ 100 ఎగువకు చేరడం వల్ల అంతర్జాతీయంగా నెగెటివ్ సెంటిమెంట్, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుందనే భయాలు మదుపర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ- సెన్సెక్స్ 1,173 పాయింట్లు కోల్పోయి 57,1656కి దిగొచ్చింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 314 పాయింట్ల నష్టంతో 17,162 వద్ధ కదలాడుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వల్ల ఉదయం సెషన్లోనే రూ.3.39లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
ఎన్టీపీసీ, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లీ, మారుతి షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఫలితాలు అనుకున్నదానికంటే మరింత ఆందోళనకరంగా ఉండటం వల్ల ఆ సంస్థ షేర్లు 7శాతానికిపైగా కుప్పకూలాయి. టెక్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ షేర్లు కుడా నాలుగు శాతానికిపైగా నష్టపోయాయి.