Sedan Car Discounts In 2023 : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఈ దీపావళి పండుగ సీజన్లో తమ సెడాన్ కార్లపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. వాటిలో టాప్ 5 సెడాన్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Skoda Slavia Offers : జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా.. ఈ ఫెస్టివ్ సీజన్లో 'స్లావియా' సెడాన్ కారుపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
Skoda Slavia Price : స్కోడా స్లావియా కారు ప్రారంభ ధర రూ.10.89 లక్షలుగా ఉంది. అయితే స్కోడా కంపెనీ దీనిపై గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీనిలోనే రూ.60,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలసి ఉంటుంది. స్కోడా కంపెనీ ఈ పండుగ సీజన్లో.. ఆడి, పోర్స్ఛే, ఫోక్స్‌వ్యాగన్ సహా అన్ని స్కోడా కారు కస్టమర్లకు లాయల్టీ బోనస్ అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే నాలుగు సంవత్సరాలు లేదా 60 వేల కి.మీ వరకు కాంప్లిమెంటరీ సర్వీస్ మెయింటెనెన్స్ సర్వీస్‌ను కూడా అందిస్తామని ప్రకటించింది.
Volkswagen Virtus Offers : ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన ప్రీమియం సెడాన్ Virtus. ఈ ఫోక్స్‌వ్యాగన్ Virtus కారు 1.0 లీటర్, 1.5 లీటర్ సామర్థ్యం గల రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది.
Volkswagen Virtus Price : మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ Virtus ప్రైస్ రేంజ్ రూ.11.48 లక్షల నుంచి రూ.19.29 లక్షలు వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ పండుగ సీజన్లో ఈ కారుపై గరిష్ఠంగా రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ.40,000 అందిస్తున్నారు.
Honda City Offers : భారత్‌లో హోండా సిటీ కారుకు మంచి డిమాండ్ ఉంది. అందుకే దీనిని క్యాష్ చేసుకునేందుకు హోండా కార్స్ ఇండియా కంపెనీ సిద్ధమైంది. ఈ పండుగ సీజన్లో హోండా సిటీ కారుపై ఏకంగా రూ.75,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
![Honda City](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2023/19896968_honda-city-1.png)
![Honda City](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2023/19896968_honda-city.png)
![Honda City](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2023/19896968_honda-city-3.png)
Maruti Suzuki Ciaz Offers : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి 2023 మార్చి నెలలో Ciaz కారును లాంఛ్ చేసింది. ప్రస్తుతం ఈ పండుగ సీజన్లో దీనిపై రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే ఈ మారుతి సుజుకి సియాజ్ కారుపై మొత్తంగా రూ.38,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Maruti Suzuki Ciaz Price : మారుతి సుజుకి సియాజ్ కారు ధర రూ.9.30 లక్షల నుంచి రూ.12.45 లక్షల వరకు ఉంది.
Hyundai Verna Discounts : ఇటీవలే విడుదలైన హ్యూందాయ్ వెర్నాపై.. ఈ పండుగ సీజన్లో రూ.25,000 తగ్గింపు ధరతో అందిస్తున్నారు.
![Hyundai Verna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2023/19896968_hyundai-verna.jpg)
Hyundai Verna Price : మార్కెట్లో దీని ధర రూ.10.97 లక్షలు నుంచి రూ.17.38 లక్షలు వరకు ఉంది.
![Hyundai Verna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2023/19896968_hyundai-verna-1.jpg)