SEBI Extends Deadline To Add Nominees In Mutual Funds And Demat Accounts : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలను నామినీని ఏర్పాటుచేసేందుకు ఇచ్చిన గడువును 2023 డిసెంబర్ 31 నుంచి 2024 జూన్ 30 వరకు పొడిగించింది.
పెట్టుబడిదారులు తమ ఆస్తులను భద్రపరుచుకోవడానికి, చట్టపరమైన వారసులకు వాటిని బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.
"మార్కెట్ వర్గాల నుంచి, పెట్టుబడిదారుల నుంచి అనేక విజ్ఞప్తులు, అభ్యర్థనలు వచ్చాయి. అందుకే వారి సౌలభ్యం కోసం, డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ పోర్టుఫోలియోలకు నామినేషన్ సమర్పించేందుకు ఇచ్చిన గడువును 2024 జూన్ 30 వరకు పొడిగించాలని నిర్ణయణం తీసుకున్నాం."
- సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సర్క్యులర్
ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలి!
అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (AMCs), డిపాజిటరీ పార్టిసిపెంట్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు (RTA)లు - డీమ్యాట్ ఖాతాదారులకు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అవేర్నెస్ కల్పించాలని సెబీ నిర్దేశించింది. ఇన్వెస్టర్లు కచ్చితంగా తమ డీమ్యాట్ ఖాతాలకు, మ్యూచువల్ ఫండ్లకు నామినీలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం పెట్టుబడిదారులకు ఈ-మెయిల్స్, SMSలు పంపించాలని తెలిపింది. నామినీని ఏర్పాటు చేయడమే కాదు. ఇప్పటి వరకు ఉన్న నామినీలను తొలగించడానికి, నామినీలను మార్చడానికి తగిన సూచనలు చేసి, అందుకోసం పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేసింది.
ఎస్బీఐ 'అమృత్ కలశ్' స్కీమ్ గడువు పెంపు!
మనదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అమృత్ కలశ్ పథకం గడువును మరోసారి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పథకం గడువును ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే తాజాగా ఈ గడువును 2024 మార్చి 31 వరకు పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది.
అమృత్ కలశ్ స్కీమ్ బెనిఫిట్స్
Amrith Kalash Scheme Interest Rates : ఎస్బీఐ 2023 ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. దీని కాలపరిమితి 400 రోజులు మాత్రమే. ఎస్బీఐ ఈ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ అమృత్ కలశ్ పథకం ద్వారా అధిక లబ్ధి పొందుతారు.
సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
మీ ఆదాయపన్ను మరింత తగ్గించుకోవాలా? - ఇలా ట్యాక్స్ చెల్లిస్తే భారీ మినహాయింపు మీ సొంతం!