ETV Bharat / business

SBI Wecare Special Fixed Deposit Scheme: ఎస్​బీఐ నుంచి సూపర్ స్కీం.. కొద్దిరోజులే ఛాన్స్! - How to Open SBI WECARE FD Scheme

SBI Wecare Special Fixed Deposit Scheme for Senior Citizens: ప్రస్తుత కాలంలో.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి సేవింగ్స్ ఆప్షన్లుగా మారాయి. ఇతర సేవింగ్ స్కీమ్స్‌తో పోల్చిచూస్తే ఇందులో మంచి వడ్డీ రేట్లు ఉండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఓ స్కీం అందుబాటులోకి తెచ్చింది. మరి.. ఆ స్కీం ఏంటి..? దానికి ఎవరు అర్హులు..? గడువు ఎప్పటి వరకు ఉంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Fixed Deposit Scheme
SBI Wecare Special Fixed Deposit Scheme
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 5:14 PM IST

SBI Wecare Special Fixed Deposit Scheme for Senior Citizen: "ఫిక్స్‌డ్ డిపాజిట్.." ప్రజాదరణ పొందిన సురక్షిత ఇన్వెస్ట్​మెంట్​ స్కీమ్స్​లో ఒకటి. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. మీరు పెట్టిన మొత్తానికి అధిక మొత్తంలో వడ్డీ వస్తుంది. సాధారణ పౌరుల కన్నా సీనియర్ సిటిజెన్స్​కు ఎక్కువ శాతం వడ్డీ వస్తుంది. కొన్ని బ్యాంకులు కేవలం సీనియర్ సిటిజెన్స్ కోసమే ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను ప్రారంభించాయి. ఈ కోవలోకి చెందుతుంది.. భారతీయ స్టేట్ బ్యాంక్ తెచ్చిన తాజా స్కీమ్. దాని పేరే.. ఎస్‌బీఐ వీకేర్. ప్రత్యేకంగా.. సీనియర్ సిటిజెన్స్ కోసమే స్కీమ్‌ రూపొందించింది.

How to Generate SBI Debit Card PIN : ఎస్​బీఐ డెబిట్ కార్డు.. పిన్ ఎలా సెట్ చేయాలో తెలుసా..?

SBI Wecare Senior Citizen Fixed Deposit Scheme Full Details: మే 2020లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. SBI 'WE CARE' సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. దీని గడువు తొలుత సెప్టెంబర్ 2020 వరకు ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని చాలా సార్లు పొడిగించారు. అలా ఈ సంవత్సరం మార్చి 31వ తేదీకి ఈ పథకం గడువు ముగుస్తుండగా.. దానిని జూన్​ 30కు పొడిగించారు. మళ్లీ దాన్ని ఈ సెప్టెంబర్​ 30 వరకు పొడిగించారు.

ఎస్బీఐ లక్ష్యం ఇదే..: సీనియర్ సిటిజన్స్​కు అధిక రాబడి అందించడమే లక్ష్యంగా ఎస్‌బీఐ వీ కేర్(SBI WECARE) డిపాజిట్ పథకాన్ని అందిస్తున్నట్లు బ్యాంక్ తన అధికారిక వెబ్ సైట్​లో తెలిపింది. సీనియర్ సిటీజన్స్​తో తమ బంధాన్ని మరి కొన్ని సంవత్సరాలు కొనసాగించేందుకే దీనిని గడువు పెంచుతున్నట్లు చెప్పింది.

How to Unblock Your SBI ATM Card : SBI ATM కార్డును.. అన్‌బ్లాక్ ఎలా చేయాలి..?

అధిక ప్రయోజనాలు..

Benefits of SBI WECARE FD Scheme: ఈ ప్రత్యేక పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది ఎస్పీఐ. రెగ్యులర్‌గా ఇతర ఎఫ్‌డీ పథకాలపై సీనియర్ సిటిజన్లకు అందించే అదనపు 50 బేసిస్ పాయింట్లు కాకుండా.. మరో 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ ఈ స్కీమ్ ద్వారా అందుతుంది. అంటే రెగ్యులర్ కస్టమర్ల కన్నా 100 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ పొందవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.

స్కీమ్‌కు అర్హులు వీరే..

Eligibility: SBI WeCare కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ చేసుకొనే అవకాశం 60 సంవత్సరాలు దాటిన ఇండియన్‌ సిటిజన్స్‌కు మాత్రమే ఉంది. ఇది డొమెస్టిక్‌ టర్మ్‌ డిపాజిట్‌ పథకం కావడంతో ఎన్‌ఆర్​ఐలు అకౌంట్‌ ఓపెన్‌ చేసుకొనే అవకాశం లేదు. మనీ సెక్యూరిటీ మాత్రమే కోరుకొంటే సాధారణ ఎఫ్‌డీలు మంచివే. సీనియర్‌ సిటిజన్లు, రిస్కు ఎక్కువగా ఉన్న వర్గాలు కూడా ఈ డిపాజిట్లు చేయవచ్చు. కరోనా కాలంలో 60 ఏళ్లు కంప్లీట్​ అయిన సీనియర్‌ సిటిజన్ల కోసం చాలా బ్యాంకులు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ ప్రారంభించాయి.

ఎలా ప్రారంభించాలి..?

How to Open SBI WECARE FD Scheme: ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను నెట్ బ్యాంకింగ్ లేదా నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి కూడా తీసుకోవచ్చు. అలాగే స్టేట్ బ్యాంక్ YONO యాప్ ద్వారా స్కీమ్‌లో జాయిన్ కావచ్చు.

How to Use SBI Card Pay : వినియోగదారులకు SBI గుడ్​న్యూస్.. ఇక కార్డు లేకుండానే షాపింగ్..!

How to Setup and Login to SBI YONO App : మీరు ఎస్​బీఐ కస్టమరా..? మరి YONO యాప్ వాడుతున్నారా.. లేదా??

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.