RIL AGM News 2023 : ప్రముఖ వ్యాపారవేత్త, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ తన వారసత్వ పగ్గాలను.. తన ముగ్గురు బిడ్డలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ఇషా, ఆకాశ్, అనంత్‌లకు కీలక పదవులు కట్టబెట్టారు.
46వ ఏజీఎం
రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఆగస్టు 28న ముంబయిలో జరిగింది. ఈ సమావేశంలో ఇషా, ఆకాశ్, అనంత్‌లను కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో స్పష్టంగా తెలిపారు.
జియో - అకాశ్ అంబానీ
66 ఏళ్ల ముకేశ్ అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి గతేడాది భారతదేశపు అతిపెద్ద మొబైల్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బాధ్యతలను అప్పగించారు.
ఇషా, అనంత్
ఆకాశ్ అంబానీ కవల సోదరి ఇషా.. రిలయన్స్ రిటైల్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. అనంత్ అంబానీ న్యూ ఎనర్జీ బిజినెస్‌ను చూసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ జియో ప్లాట్‌ఫామ్స్ అన్నీ ముకేశ్ అంబానీ నేతృత్వంలోనే కొనసాగుతుండడం విశేషం.
బోర్డు నుంచి వైదొలిగిన నీతా అంబానీ
నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆమె రాజీనామాను రిలయన్స్ బోర్డ్ ఆమోదించింది. ఓ వైపు తమ వారసులు రిలయన్స్ బోర్డులో కీలక పదవులు చేపట్టిన క్షణంలోనే.. నీతా అంబానీ బోర్డు నుంచి తప్పు కోవడం విశేషం. అయితే నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా మాత్రం కొనసాగుతారు.
రిలయన్స్ జియో 5జీ సర్వీస్
రిలయన్స్ జియో 5జీ సర్వీసులు 2023 డిసెంబర్‌లోగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని ఆ కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఆల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్‌లు అందించడానికి తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా చాలా వేగంగా ఈ 5జీ సేవలను విస్తరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జియోఎయిర్ ఫైబర్
2023 సెప్టెంబర్ 19 గణేశ్ చతుర్థి రోజున జియోఎయిర్ఫైబర్ను లాంఛ్ చేస్తున్నట్లు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో ఆయన పేర్కొన్నారు.
జియో కస్టమర్ బేస్
ఏజీఎంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. 'జియో వినియోగదారుల సంఖ్య 450 మిలియన్లు దాటింది. ఇప్పటికే ప్రధానమైన పట్టణాల్లో, నగరాల్లో 96 శాతం వరకు 5జీ నెట్వర్క్ సేవలు అందిస్తున్నాం. ఈ విధంగా సంవత్సరానికి 20 శాతానికి పైగా ఆదాయవృద్ధిని సాధించాం. అంతేకాదు ఈ ఏడాది డిసెంబర్‌లోగా దేశవ్యాప్తంగా పూర్తిగా ఈ 5జీ సేవలు విస్తరిస్తాం' అని తెలిపారు.
డిజిటల్ ఇండియా
'జియో సేవలను 7 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. దీని ద్వారా భారతదేశాన్ని ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. అలాగే భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రెక్చర్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం.' అని ముకేశ్ అంబానీ ఆర్ఐఎల్ ఏజీఎంలో పేర్కొన్నారు.
150 బిలియన్ డాలర్ల పెట్టుబడి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గత 10 ఏళ్లలో 150 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిందని రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. తాము అసాధ్యమని అనుకునే లక్ష్యాలను నిర్దేశించుకుని.. వాటిని సుసాధ్యం చేశామని వెల్లడించారు.
-
Namaste 🙏 Welcome to the 46th Annual General Meeting of Reliance Industries Limited (Post IPO)#WithLoveFromJio #RILAGM #Reliance #Jio https://t.co/IhIEDAI5Zc
— Reliance Jio (@reliancejio) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Namaste 🙏 Welcome to the 46th Annual General Meeting of Reliance Industries Limited (Post IPO)#WithLoveFromJio #RILAGM #Reliance #Jio https://t.co/IhIEDAI5Zc
— Reliance Jio (@reliancejio) August 28, 2023Namaste 🙏 Welcome to the 46th Annual General Meeting of Reliance Industries Limited (Post IPO)#WithLoveFromJio #RILAGM #Reliance #Jio https://t.co/IhIEDAI5Zc
— Reliance Jio (@reliancejio) August 28, 2023
మార్కెట్ వర్గాల ఆసక్తి!
జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇటీవలే స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించింది. కానీ ప్రారంభంలోనే ఆ షేరు కాస్త తడబాటుపడుతోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ గ్రూప్‌లోని ఇతర విభాగాల లిస్టింగ్‌పై ముకేశ్ అంబానీ ఏం ప్రకటిస్తారో అని.. మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.