ETV Bharat / business

Quick Bank loan : త్వరగా బ్యాంకు లోన్​ కావాలా?.. ఇలా ప్లాన్ చేసుకుంటే.. - బ్యాంకు లోన్ సిబిల్​ స్కోర్​

Quick Bank loan : మీరు రుణం​ తీసుకుందామని అనుకుంటున్నారా? అందుకోసం ప్రైవేట్​ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారా? అయితే ఆగండి! బ్యాంకు లోన్​ కోసం ప్రయత్నించండి. దానికంటే ముందుగా.. త్వరగా బ్యాంకు లోన్ ఏ విధంగా పొందాలో తెలుసుకోండి. పూర్తి వివరాలు మీ కోసం..

Get Quick Loans at Lowest Interest Rates
How to get a bank loan quickly
author img

By

Published : Jun 17, 2023, 7:50 PM IST

Quick Bank loan : జీవిత పోరాటంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అవసరమైన సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం.. చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. కొన్ని సార్లు జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు రుణం చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇల్లు కట్టుకోవడం, కొత్త కారు కొనడం లాంటివి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా ప్రజలు తమ అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది మిమ్మల్ని ఆర్థికంగా బాధిస్తుంది. దీనికి బదులుగా మీరు బ్యాంకు లోన్​ కోసం ప్రయత్నించడం ఉత్తమం.

త్వరగా రుణం పొందడం ఎలా?
బ్యాంకు లోన్లు రావడం చాలా కష్టమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానిలో కొంత వరకు వాస్తవం కూడా ఉంది. కానీ సరైన విధానంలో అప్లై చేస్తే.. కచ్చితంగా బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది.

ఖర్చులు అదుపులో ఉంచుకోండి!
మీరు రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి కూడా స్పష్టంగా ఒక అంచనాకు రావాలి. ప్రస్తుతం మీకు వస్తున్న ఆదాయం, నిత్యవసరాల ఖర్చులు, రుణ వాయిదాల చెల్లింపులు అన్నీ చూసుకోవాలి. సాధారణంగా నికర ఆదాయంలో ఖర్చులు 40 నుంచి 50 శాతం వరకు ఉంటాయి. ఇలా ఉన్నవారికే సాధారణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రుణం కోసం దరఖాస్తు చేసే ముందు.. మీ ఖర్చులు 40 శాతానికి మించకుండా చూసుకోవాలి.

క్రెడిట్​ స్కోర్​ను పెంచుకోండి!
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణంగా లోన్ అప్లికేషన్స్​ పరిశీలించేటప్పుడు.. రుణ గ్రహీతకు సంబంధించిన క్రెడిట్​ స్కోర్ నివేదిక కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాయి. ఎందుకంటే ఈ క్రెడిట్​ రిపోర్టులో.. క్రెడిట్ స్కోర్​, రుణం తిరిగి చెల్లింపు చరిత్ర, ఇప్పటికే కొనసాగుతున్న రుణ ఖాతాలు, పొదుపు ఖాతాల గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. అందువల్ల లోన్​ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. సొంతంగా మన క్రెడిట్​ స్కోర్​ను మనమే చూసుకోవాలి.

ఇటీవలి కాలంలో చాలా సంస్థలు నెలవారీ క్రెడిట్​ రిపోర్టులను ఉచితంగానే అందిస్తున్నాయి. అయితే ఎలాంటి క్రెడిట్​ హిస్టరీ లేనివారు మాత్రం క్రెడిట్​ కార్డ్​ను తీసుకోవడం ద్వారా దాన్ని నిర్మించుకోవచ్చు. కనీసం రెండు నుంచి మూడేళ్ల పాటు మీరు క్రెడిట్​ కార్డు బిల్లులు సక్రమంగా చెల్లిస్తే, మీరు మంచి క్రెడిట్​ స్కోర్​ సాధించడానికి వీలవుతుంది.

రుణార్హత చూసుకోండి!
బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ విచక్షణ మేరకు.. ఒక వ్యక్తికి రుణం ఇవ్వాలా? వద్దా? ఇస్తే.. ఎంత మేరకు రుణం ఇవ్వాలి? అనే అంశాలను నిర్ణయిస్తాయి. సాధారణంగా వ్యక్తి వయస్సు, నెలవారీ నికర ఆదాయం, ప్రస్తుతం ఉంటున్న నివాసం తదితర అంశాలను బ్యాంకులు పరిశీలిస్తుంటాయి. కనుక మీరు ముందుగా మీ రుణార్హతను సరిచూసుకోండి.

ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్​లైన్​లోనే రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. మీకు రుణార్హత ఉన్నట్లయితే.. మీరు ఏ బ్యాంకు ఖాతా కలిగి ఉన్నారో.. ఆ బ్యాంకు ఇలాంటి ఆన్​లైన్​ లోన్​ సౌకర్యాన్ని కల్పిస్తుందో? లేదో? చూసుకోండి. మీకు పైన పేర్కొన్న అన్ని అర్హతలు సరిగ్గా ఉంటే బ్యాంకులు త్వరగా రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది.

ఏ అవసరం కోసం రుణం చేస్తున్నారు?
మీరు ఎలాంటి అవసరం కోసం రుణం తీసుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యం. ఇల్లు నిర్మించడానికి లేదా వాహనం కొనడానికి, వ్యక్తిగత రుణం తీసుకోవడాని రుణం తీసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ తక్కువ వడ్డీకి లోన్​ మంజూరు చేస్తుందో మనం ముందుగానే తెలుసుకోవడం మంచిది. అప్పుడే మీకు ఆర్థిక భారం తగ్గుతుంది.

బ్యాంకులు మాత్రమే కాదు!
చాలా మంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లేదా బ్యాంకుల దగ్గర మాత్రమే రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ గృహరుణ సంస్థలు, బ్యాంకింగేత రుణ సంస్థలు కూడా మంచి ప్రయోజనాలతో రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కనుక, ఒకసారి అలాంటి అవకాశాలను కూడా పరిశీలించడం మంచిది.

అవసరానికి మించి అప్పు చేయవద్దు!
చాలా మంది రుణగ్రహీతలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. కేవలం అవసరం మేరకు మాత్రమే రుణాన్ని తీసుకోవాలి. ఎందుకంటే తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏ లక్ష్యం లేకుండా అవసరానికి మించి అప్పు తీసుకుంటే.. వడ్డీ భారం తప్ప ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.