ETV Bharat / business

బ్యాంక్ లోన్​తో పాతకారు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి! - పాతకారుపై లోన్​

Pre Owned Used Car Loan details : మనలో చాలా మందికి కారు కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. కొత్త కారు కొనుక్కొనే స్థోమత లేని వాళ్లు కనీసం పాతకారు అయినా కొనాలని తాపత్రయపడుతుంటారు. మరి ఇలాంటి వారికి బ్యాంకులు లోన్​లు ఇస్తాయా? ఇస్తే ఎంత మేరకు వడ్డీ చెల్లించాలి. ఇలాంటి పూర్తి వివరాలు మీ కోసం.

Pre Owned Used Car Loan details
old Car Loan details
author img

By

Published : Jun 3, 2023, 12:31 PM IST

బ్యాంకులు సాధారణంగా కొత్త కారు కొనుక్కోవడానికి రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. కానీ సామాన్య ప్రజలకు కొత్త కారు కొనే స్థోమత ఉండదు. అలాంటి వారు కనీసం పాతకారు అయినా కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కూడా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి.

పూర్తిగా సొంత డబ్బు అవసరం లేదు!
సాధారణంగా చాలా మంది పాత కారు కొనుక్కోవడానికి సొంత డబ్బు ఉపయోగిస్తారు. లేదా బయట అధిక శాతం వడ్డీకి అప్పు చేస్తూ ఉంటారు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సెకండ్​ హ్యాడ్​ కార్లకు మార్కెట్​లో మంచి గిరాకీ ఉంది. అందుకే బ్యాంకులు కూడా పాత కార్ల కొనుగోలు కోసం తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నాయి.

రుణాలు పొందేందుకు ఉన్న అర్హతలు ఏంటి?
బ్యాంకులు పాత కార్లకు రుణాలు ఇచ్చే ముందు కొన్ని కచ్చితమైన అర్హతలు చూస్తాయి. ముఖ్యంగా రుణగ్రహీత వయస్సు, అతని ఆదాయం, ఉద్యోగం, క్రెడిట్​ స్కోర్​ లాంటి అంశాలను పరిశీస్తాయి. సాధారణంగా క్రెడిట్​ స్కోర్​ 750కి పైగా ఉన్నప్పుడే రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. నెలకు కనీసం రూ.10 వేల రూపాయలకు మించి ఆదాయం ఉన్న వారికి మాత్రమే రుణాలు మంజూరు చేస్తుంటారు.

ఎంత మొత్తం మేరకు రుణాలు మంజూరు చేస్తారు?
వాహనం మోడల్​, అది ఎంత పాత వాహనం అనే దానిని అనుసరించి రుణం ఎంత ఇవ్వాలన్నది బ్యాంకులు నిర్ణయిస్తాయి. ముఖ్యంగా కారు విలువ, రుణగ్రహీత చెల్లింపు సామర్థ్యం, బీమా ప్రీమియం, పన్నులు మొదలైన అన్ని అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి.

రుణం తీసుకునే ముందు చూసుకోవాల్సిన అంశాలు?
బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ముందు కొన్ని అంశాలను మనం పరిశీలించుకోవాలి. ముందు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకుల గురించి తెలుసుకోవాలి. తరువాత పాత అప్పులు తీర్చే విషయంలో, అదే విధంగా రోజువారీ అవసరాలకు, ఖర్చులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణం తీసుకునే ముందు కారు విలువలో కనీసం 20 శాతమైనా సొంత సొమ్ము పెట్టుకోగలిగే స్థోమత కలిగి ఉండాలి.

రుణాన్ని ఎన్నాళ్లలో చెల్లించాల్సి ఉంటుంది?
పాతకారు కొనడానికి తీసుకున్న రుణాలన్ని ఎన్నాళ్లలో చెల్లించాలో మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మంచి ఆదాయం వస్తుంది అనుకుంటే నెలవారీ వాయిదాలు తీసుకోవచ్చు. అందువల్ల వాయిదాలో కట్టాల్సిన మొత్తం అధికంగా ఉంటుంది. కానీ వడ్డీ భారం తగ్గుతుంది. లేదంటే దీర్ఘకాలిక వ్యవధి చెల్లింపులకు వెళ్లవచ్చు. అప్పుడు ఈఎంఐ తగ్గుతుంది. కానీ అందువల్ల అధిక మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీకు ఇబ్బంది లేని విధంగా రుణ చెల్లింపు వాయిదాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయి?
బ్యాంకులు సాధారణంగా పాత కార్ల రుణాలపై అధిక వడ్డీలను విధిస్తూ ఉంటాయి. కానీ ఇవి స్థిర వడ్డీ రేట్లు కనుక, ఒక సారి నిర్ణయించిన వడ్డీ మొత్తం అప్పు తీర్చే వరకు మారదు. అందుకోసం తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకులను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది.

రుణాన్ని ముందే తీర్చివేయవచ్చా?
వాస్తవానికి బ్యాంకు రుణాలను వ్యవధి కంటే ముందుగానే తీర్చుకునే వెసులుబాటు ఉంది. అయితే రుణంగా తీసుకున్న మొత్తంపై 6శాతం వరకు ముందస్తు చెల్లింపు రుసుమును వసూలు చేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బ్యాంకు రుణంపై చెల్లించే వడ్డీ.... రుసుము కన్నా అధికంగా ఉన్నప్పుడే ముందస్తుగా రుణాలు తీర్చడం గురించి ఆలోచించాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.