Petrol diesel price today: పెట్రోల్ ధరలు రోజురోజుకు సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో 13వ సారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. దేశరాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసల చొప్పున పెంచుతూ చమురు పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.104.61కు చేరగా.. డీజిల్ ధర రూ.95.87కు పెరిగింది.
• Mumbai Petrol prices: ముంబయిలో పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.119.67కు ఎగబాకింది. డీజిల్ ధర 85 పైసలు అధికమై.. రూ.103.92కు చేరుకుంది.
• 76 పైసల పెరుగుదలతో చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.110.08కు చేరుకోగా.. డీజిల్ ధర 76 పైసలు పెరిగి రూ.100.16కు ఎగబాకింది.
• కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌పై 83 పైసలు, డీజిల్‌పై 80పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.114.26గా ఉంది. డీజిల్ ధర రూ.99.01కి చేరింది.
• Petrol Price in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 87 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.118.57కు చేరింది. డీజిల్ ధర రూ.104.62కు ఎగబాకింది.
• గుంటూరులో పెట్రోల్ ధర రూ.120 దాటింది. తాజాగా పెంచిన 88 పైసలతో.. పెట్రోల్ ధర రూ.120.39కు చేరింది. డీజిల్ ధర రూ.84 పైసలు పెరిగి.. రూ.106.04కు చేరుకుంది.
• వైజాగ్‌లో 87 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.119.1కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై.. రూ.104.79కు ఎగబాకింది.
ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి తప్పనిసరి!