ETV Bharat / business

ఇన్సూరెన్స్ కంపెనీ లాభాల్లో వాటా కావాలా? ఈ పాలసీ ఎంచుకుంటే డబుల్​ ప్రాఫిట్​! - భాగస్వామ్య జీవిత బీమా పాలసీ

Participating Life Insurance Policy : మీరు జీవిత బీమా తీసుకుంటున్నారా? బీమాతో పాటు ఆ సంస్థ లాభాల్లోనూ వాటా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ పాలసీ. ఇంతకీ ఆ పాలసీ ఏంటి? దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

participating life insurance policy
participating life insurance policy
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 4:01 PM IST

Participating Life Insurance Policy : కుటుంబంలో ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు ఆర్థిక స్థిరత్వాన్ని అందించేది జీవిత బీమా. అందుకే, సరైన అవగాహనతో పాలసీని ఎంపిక చేసుకోవాలి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌, యాన్యుటీ, యులిప్‌ వంటి అనేక రకాల్లో దేన్ని ఎంచుకోవాలనేది నిర్ణయించుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వీటితోపాటు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతున్న పార్టిసిపేటింగ్‌ (భాగస్వామ్య) పాలసీలు అనే మరో రకాన్ని కూడా పరిశీలించాలి. ఈ నేపథ్యంలో ఈ పాలసీ ఏంటి? అందించే ప్రయోజనాలు, తీసుకునేటప్పుడు చూడాల్సిన అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీమా సంస్థ తన లాభాల్లో పాలసీదారులకూ కొంత వాటాను చెల్లిస్తుంది. ఇలాంటి పాలసీలనే భాగస్వామ్య జీవిత బీమా పాలసీలు అంటారు. వీటిని పార్‌ పాలసీలుగానూ చెబుతుంటారు. బీమా సంస్థ తన లాభాల్లో కొంత భాగాన్ని పాలసీదారులకు వార్షిక ప్రాతిపదికన బోనస్‌ లేదా డివిడెండుగా ఇస్తుంది. సాధారణ పాలసీలు అందించే ప్రయోజనాలకు ఇది అదనం అనొచ్చు.

వ్యక్తులను బట్టి ఆర్థిక ప్రణాళికలు మారుతాయి. లక్ష్యాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. కొందరు పూర్తి రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ పాలసీలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ లభించడమే వారికి నచ్చిన అంశం. కుటుంబ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో టర్మ్‌ పాలసీలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. కొందరికి హామీతో కూడిన రాబడిని అందించే పాలసీలు కావాలని చూస్తుంటారు. ఇలా దీర్ఘకాలంలో మంచి రాబడి రావాలని కోరుకునే వారు యులిప్‌లను ఎంపిక చేసుకుంటారు. రాబడి హామీతోపాటు, డివిడెండ్‌, బోనస్‌ రూపంలోనూ ఆదాయం వస్తే బాగుంటుందని భావించే వారికి పార్‌ పాలసీలు సరిపోతాయి. కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు భద్రత, జీవిత లక్ష్యాలు నెరవేర్చుకోవడంలో ఇవి సహాయం చేస్తాయి. అదే సమయంలో సాధారణ పాలసీలతో పోలిస్తే కొంత అదనపు ప్రయోజనాలూ ఇందులో ఉంటాయి.

ఆ హామీ ఉండదు..
Participating Life Insurance Pros And Cons : లాభాల్లో వాటాతో సంబంధం లేకుండా ఉండే నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీలతో పోలిస్తే పార్‌ పాలసీలకు ఒకటి రెండు ప్రతికూలతలు ఉన్నాయి. డివిడెండ్లు, బోనస్‌ను కంపెనీ ఆర్జించే లాభాల నుంచి చెల్లిస్తారు. బీమా సంస్థ ఎప్పుడూ లాభాలనే ఆర్జిస్తుందని చెప్పలేం. కాబట్టి, డివిడెండ్‌, బోనస్‌లకు కచ్చితమైన రాబడి లభించదు. ఇవి పూర్తిగా సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. దీనర్ధం.. కొన్నేళ్లపాటు బోనస్‌లు ఉండకపోవచ్చు. కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే.. కొన్నేళ్లలోనే అసాధారణ రీతిలో డివిడెండ్‌ లభించే అవకాశమూ ఉంటుంది.

కచ్చితమైన రాబడి..
కంపెనీ లాభాల్లో వాటా విషయంలో హామీ లేకపోయినా కూడా.. ఈ రకం జీవిత బీమా పాలసీల్లో ఇతర కచ్చితమైన చెల్లింపులూ కొన్ని ఉంటాయి. మెచ్యూరిటీ చెల్లింపులు, పాలసీదారుడు మరణించినప్పుడు చెల్లించే పరిహారం తదితరాలకు హామీ ఉంటుంది. పాలసీ వ్యవధిలోనే పాలసీదారుడు మరణిస్తే పాలసీ విలువను లెక్కించి బీమా సంస్థ నామినీకి చెల్లిస్తుంది. పాలసీదారుడు వ్యవధి తీరేంతవరకూ జీవించి ఉంటే.. పాలసీలో చెప్పిన మెచ్యూరిటీ ప్రయోజనాలను చెల్లిస్తుంది. ఈ మొత్తం ఎంత వస్తుందో ముందే తెలుసు కాబట్టి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకోవచ్చు.

కాస్త అదనపు ప్రీమియంతో..
భాగస్వామ్య పాలసీలు.. బీమా కంపెనీల లాభాల్లో మనకు వాటా అందిస్తాయి. కాబట్టి, వీటికి నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీలతో పోలిస్తే ప్రీమియం కాస్త అధికంగానే ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ పాలసీలు అందించే ప్రయోజనాలతో పోలిస్తే ఇది అంత ఎక్కువ కాకపోవచ్చు. కుటుంబ ఆర్థిక భద్రత, జీవిత లక్ష్యాల కోసం హామీ ఇచ్చిన ప్రయోజనాలతోపాటు.. కంపెనీ లాభాల్లోనూ భాగం ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్తతరం పార్‌ పాలసీలతో కోరుకున్న ఆదాయం, అది ఎప్పుడు ప్రారంభం కావాలి, ఎంత కాలం అందుకోవాలి అనేది పాలసీదారులే నిర్ణయించుకునే వీలును బీమా సంస్థలు అందిస్తాయి. కాబట్టి, జీవిత లక్ష్యాలకు తగ్గట్టుగా వీటిని ఎంపిక చేసుకోవచ్చు.
జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం ఆర్థిక ప్రణాళికలో ఎంతో ముఖ్యమైన నిర్ణయం. కుటుంబ అవసరాలను అర్థం చేసుకొని.. వాటికి తగిన రక్షణ కల్పించేలా పాలసీ ఉండాలి. వ్యక్తిగత జీవిత లక్ష్యాలను నెరవేర్చే ఉత్పత్తులనే ఎప్పుడూ ఎంచుకోవాలి.

టాపప్​ లోన్​ కావాలా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

పర్సనల్​ లోన్ తీసుకుంటున్నారా? అంతకన్నా తక్కువ వడ్డీకే రుణాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.