ETV Bharat / business

New Financial Rules From October 1st 2023 : అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే.. త్వరగా ఈ పనులు పూర్తి చేయండి! - new financial rules from october 1st 2023

New Financial Rules From October 1st 2023 : రూ.2000 నోట్లను ఇంకా బ్యాంకుల్లో మార్చుకోలేదా? డీమ్యాట్​ అకౌంట్​కు నామినీని జతచేయలేదా? అయితే వీటన్నింటికి చివరి తేదీ సెప్టెంబర్​ 30. అలాగే కొత్తగా వచ్చిన ట్యాక్స్​ రూల్స్​ అక్టోబర్​ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Aadhaar Card, Birth Certificate, Mutual Fund 6 Changes That Will Impact Your Personal Finance From 2023 October 1st
Financial Deadlines In September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 5:38 PM IST

New Financial Rules From 1st October 2023 : డీమ్యాట్​ అకౌంట్​కు నామినీ లింక్, రూ.2,000 నోట్ల మార్పిడి​ సహా మరికొన్ని ఆర్థిక అంశాలకు సంబంధించిన గడువు ఈనెల 30తో ముగియనుంది. అలాగే కొత్తగా మారిన పన్ను​ నిబంధనలు అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను సవివరంగా ఇప్పుడు చూద్దాం.

మ్యూచువల్​ ఫండ్స్​కు నామినీ లింక్​!
Mutual Fund Nominee Update Last Date : ప్రస్తుతం ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్​లకు సెప్టెంబర్​ 30లోపు కచ్చితంగా నామినీ ఏర్పాటు చేసుకోవాలి.​ ఇప్పటికీ నామినీల వివరాలను జతచేయనివారు ఈ గడువులోగా చేసుకోండి. లేదంటే మీ ఖాతాను ఫ్రీజ్​ చేస్తారు.

ప్రభుత్వ ఉద్యోగానికి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి​!
Government Jobs Birth Certificate : వచ్చేనెల 1 నుంచి ఆధార్​ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా, ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా బర్త్​ సర్టిఫికేట్​ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం ప్రకారం, ఈ రూల్​ 2023 అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి రానుంది.

సేవింగ్స్​ ఖాతాలకూ ఆధార్!
Aadhar Link To Savings Account : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పోస్టాఫీసు డిపాజిట్లు సహా ఇతర చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన వారు సెప్టెబర్​ 30లోగా తమ ఆధార్ వివరాలను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖకు సమర్పించాలి. గడువులోగా సమర్పించకపోతే ఖాతాలను ఫ్రీజ్​ లేదా స్తంభింపజేస్తారు.

అక్టోబర్​ 1నుంచి అమల్లోకి!
TCS Rules From October 2023 : ఇటీవలే తీసుకొచ్చిన ట్యాక్స్​ రూల్స్​ కూడా అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం ఓవర్సీస్​లో మీ క్రెడిట్​ కార్డు వినియోగం పరిమితి రూ.7 లక్షలకు మించితే అక్టోబర్​ 1 నుంచి 20 శాతం ట్యాక్స్​ను వసూలు చేయనున్నారు. అయితే వైద్యం సహా విద్యకు సంబంధించి ఖర్చులు ఉంటే గనుక 5 శాతం పన్నును మాత్రమే విధిస్తారు. అలాగే విదేశీ విద్య కోసం రూ.7 లక్షల కంటే ఎక్కువ రుణాలు తీసుకునే విద్యార్థులకు నిబంధనల ప్రకారం 0.5 శాతం ట్యాక్స్​ను విధిస్తారు.

రూ.2000 నోట్లకు 6 రోజులే!
2000 Deposit Last Date : రూ.2000 పెద్ద నోట్లు ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా వాటిని డిపాజిట్​ లేదా మార్చుకునేందుకు ఆఖరి తేదీ సెప్టెంబర్​ 30. ఇప్పటికీ రూ.2 వేల నోట్లను మార్చుకొనివారు ఎవరైనా ఉంటే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు. లేదంటే అక్టోబర్​ 1 నుంచి ఈ డినామినేషన్​ నోట్లు ఎక్కడా పనిచేయదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రానున్న ఈ 6 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులున్నాయి. అందుకని వినియోగదారులు బ్యాంకు పనివేళలను తెలుసుకొని వెళ్తే మంచిది.

డీమ్యాట్​, ట్రేడంగ్​ అకౌంట్లకు నామినీ జత!
Dmat Nomination Last Date : జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేటప్పుడు ఎలాగైతే నామినీలను ఏర్పాటు చేసుకుంటామో.. స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​ చేసేందుకు వాడే డీమ్యాట్​ అకౌంట్​కు కూడా అలానే నామినీని ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే, పెట్టుబడి పెట్టిన వ్యక్తికి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే.. అతని/ఆమె ఖాతాలో ఉన్న పెట్టుబడులను, ఫండ్‌ యూనిట్లను వారి వారసులు క్లెయిం చేసుకోవడం కష్టం అవుతుంది. ఇటువంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకే నామినీ వివరాలను జతచేయటం తప్పనిసరి చేస్తూ సెబీ 2023 ఫిబ్రవరిలో సర్క్యులర్‌ జారీ చేసింది. దీని ప్రకారం డీమ్యాట్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నామినీని ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఇందుకు చివరితేదీ కూడా సెప్టెంబర్​ 30నే. ఈ తేదీలోపు మీరు నామినీని ఏర్పాటు చేసుకోకపోతే.. మీ అకౌంట్​ను ఫ్రీజ్​ చేస్తారు.

Financial Deadlines In September : రూ.2000 నోటు మార్పిడి నుంచి ఫ్రీ ఆధార్ అప్​డేట్ వరకు​.. ఆఖరి గడువు ఇదే!

Demat Nominee Deadline : ఈ గడువులోగా నామినీని యాడ్​ చేయకపోతే.. మీ డీమ్యాట్ అకౌంట్ ఫ్రీజ్​!.. త్వరపడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.