ETV Bharat / business

LIC Unclaimed Amount Check : పాత​ ఎల్​ఐసీ పాలసీ మీ దగ్గర ఉందా?.. బీమా మొత్తాన్ని ఇలా క్లెయిమ్ చేసుకోండి! - పర్సనల్​ ఫైనాన్స్​

LIC Unclaimed Amount Check In Telugu : మీ దగ్గర పాత (అన్​క్లెయిమ్డ్)​ ఎల్​ఐసీ పాలసీలు ఉన్నాయా? అందులోని బీమా మొత్తాన్ని చెక్​ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎల్​ఐసీ పాలసీ బీమా మొత్తాన్ని ఎలా చెక్​ చేయాలి? దానిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

LIC Unclaimed Amount Claim Process
LIC Unclaimed Amount Check
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 12:59 PM IST

LIC Unclaimed Amount Check : లైఫ్​ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (LIC) అనేది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రముఖ బీమా సంస్థ. ఎల్​ఐసీ అనేక రకాల బీమా పాలసీలను వినియోగదారులకు అందిస్తుంది. వీటి ద్వారా జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా లాంటి అనేక ప్రయోజనాలు వినియోగదారులకు కలుగుతాయి. మరీ ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కనుక.. కచ్చితంగా వినియోగదారుల డబ్బుకు, బీమాకు హామీ ఉంటుంది.

క్లెయిమ్ చేయని పాలసీల సంగతేంటి?
What Is Unclaimed Amount In LIC : భారతదేశంలో సాధారణంగా.. ఓ పాలసీదారుడు 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు క్లెయిమ్ చేయకపోతే అలాంటి బీమా పాలసీలను.. అన్​ క్లెయిమ్డ్​ పాలసీలు అని అంటారు. వాస్తవానికి దీనిని పాలసీ మెచ్యూరిటీ తేదీ, పాలసీదారు ప్రీమియం చెల్లించడం ఆపివేసిన తేదీ, లేదా పాలసీదారు మరణించిన తేదీ ఆధారంగా లెక్కిస్తారు. మీ వద్ద కూడా ఇలాంటి క్లెయిమ్ చేయని బీమా పాలసీలు ఉన్నాయా? అయితే వాటిని ఎలా చెక్​ చేయాలో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్​ చేయని బీమా మొత్తాన్ని తనిఖీ చేయడం ఎలా?
How to check unclaimed amount :

  • ముందుగా ఎల్​ఐసీ అధికారిక వెబ్​సైట్​ https://licindia.in/ ను ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లోని Online Services ట్యాబ్​ను ఓపెన్​ చేయాలి.
  • Unclaimed Amout ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • పాలసీ నంబర్​, మీ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఎల్​ఐసీ అకౌంట్​లోకి లాగిన్ కావాలి.
  • మీ ఖాతాలోకి లాగిన్ కాగానే.. అందులో Unclaimed amout కనిపిస్తుంది.

బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడం ఎలా?
LIC Unclaimed Amount Claim Process : ఎల్​ఐసీ పాలసీదారు తన బీమా సొమ్మును.. నిబంధనలకు అనుగుణంగా ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం అవసరమైన పత్రాలతో సహా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

Life Insurance Policy Documents : ఎల్​ఐసీ కార్యాలయం లేదా ఎల్​ఐసీ అధికారిక వెబ్​సైట్​లో నుంచి.. బీమా పాలసీ క్లెయిమ్ డాక్యుమెంట్​ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. దీనిలో మీ వ్యక్తిగత, పాలసీ వివరాలు అన్నీ నమోదుచేసి, కింద తెలిపిన ముఖ్యమైన పత్రాలు అన్నీ జతచేసి, ఎల్​ఐసీ కార్యాలయంలో సమర్పించాలి. ఎల్​ఐసీ మీ దరఖాస్తును పరిశీలించి, మీకు రావాల్సిన బీమా మొత్తాన్ని అందిస్తుంది.

Note : బీమా క్లెయిమ్​ కోసం కావాల్సిన పత్రాలు - ఎల్​ఐసీ పాలసీ డాక్యుమెంట్​, ప్రీమియం రసీదు, మరణ ధ్రువీకరణ పత్రం (అవసరమైతే!).

నామినీ పరిస్థితి ఏమిటి?
LIC Policy Claim Nomination Process : కొంత మంది తాము తీసుకున్న ఎల్​ఐసీ పాలసీల గురించి తమ కుటుంబ సభ్యులకు, లేదా నామినీలకు చెప్పరు. దీని వల్ల దురదృష్టవశాత్తు సదరు పాలసీదారు మరణిస్తే.. అతని కుటుంబానికి, లేదా నామినీ ఆ బీమా మొత్తం లభించదు. అందుకే ఎల్​ఐసీ పాలసీ తీసుకున్నప్పుడే.. నామినీని ఏర్పాటుచేసుకోవాలి. ఆ విషయం నామినీకి లేదా కుటుంబ సభ్యులకు కచ్చితంగా తెలియజేయాలి. ఎప్పుడైనా నామినీ పేర్లను మార్చినట్లయితే.. అప్పుడు కూడా ఇదే విధానాన్ని పాటించాలి.

క్లెయిమ్ చేయని పాలసీ మొత్తం ఏమవుతుంది?
Unclaimed Amount In LIC : సాధారణంగా చాలా మంది తమ ఎల్​ఐసీ పాలసీలను క్లెయిమ్ చేసుకోరు. ఇలాంటి క్లెయిమ్ చేయని బీమా సొమ్మును.. నిబంధనల ప్రకారం, గవర్నమెంట్ సెక్యూరిటీల్లో, ఇతర ఆమోదిత పెట్టుబడి మార్గాల్లో ఎల్​ఐసీ ఇన్వెస్ట్ చేస్తుంది. వీటిపై వచ్చే ఆదాయాన్ని.. పాలసీదారుని అన్​క్లెయిమ్డ్​ పాలసీ ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాలసీదారుని వారసులు లేదా నామినీ.. సరైన పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకుంటారో.. అప్పుడు వారికి ఆ బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది.

ఈ విషయం మరిచిపోవద్దు!
LIC Policy Safety Precautions : కొన్ని సందర్భాల్లో పాలసీదారులు తమ బీమా పాలసీ గురించి మరిచిపోతూ ఉంటారు. లేదా ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లను పోగొట్టుకుని ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో పాలసీ క్లెయిమ్​కు కావాల్సిన డాక్యుమెంట్స్​ వారి దగ్గర ఉండకపోవచ్చు. మరీ దారుణం ఏమిటంటే.. కొందరు తమ బీమా పాలసీ గురించి ఇంట్లో చెప్పరు. కనీసం నామినీని కూడా ఏర్పాటుచేసుకోరు. దురదృష్టవశాత్తు అతను మరణిస్తే.. ఇక ఆ బీమా పాలసీ ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది. అందుకే మీరు కచ్చితంగా బీమా పాలసీలు తీసుకునేటప్పుడే.. ఈ విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు లేదా నామినీకి తెలియజేయడం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.