ETV Bharat / business

ఎల్​ఐసీ 'స్పెషల్'​ పాలసీ.. 20 ఏళ్ల ప్లాన్​.. 12 ఏళ్ల ప్రీమియం కడితే చాలు! - lic jeevan azad policy if insured dies

LIC Jeevan Azad Plan : ఇన్సూరెన్స్​ పాలసీల్లో అనేక రకాలుంటాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే పాలసీ కాస్త స్పెషల్​. ఎందుకంటే.. 20 ఏళ్ల ఇన్సూరెన్స్​ పాలసీ ప్లాన్​ను తీసుకుంటే 12 సంవత్సరాలకు మాత్రమే మనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పాలసీని ​ప్రముఖ బీమా కంపెనీ ఎల్​ఐసీ తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం.

LIC Jeevan Azad Policy OR Plan
ఎల్​ఐసీ జీవన్​ ఆజాద్​ పాలసీ
author img

By

Published : Jul 20, 2023, 3:58 PM IST

LIC Jeevan Azad Policy : లైఫ్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవడం అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం. ఇందుకోసం మార్కెట్లో అనేక బీమా కంపెనీలు వివిధ రకాల ఇన్సూరెన్స్​ పాలసీలను తమ కస్టమర్లకు అందిస్తుంటాయి. అయితే ప్రముఖ బీమా కంపెనీ ఎల్​ఐసీ ప్రవేశపెట్టిన ఓ ప్రత్యేకమైన​ బీమా పాలసీ గురించి తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా దాన్ని తీసుకోక మానరు. అదే 'ఎల్​ఐసీ జీవన్​ ఆజాద్​ పాలసీ'. ఈ డిఫరెంట్​ పాలసీని తమ వినియోగదారుల కోసం ఈ ఏడాది జనవరిలో అందుబాటులోకి తెచ్చింది. పాలసీ లాంఛ్​ చేసిన 10-15 రోజుల్లోనే 50 వేలకు పైగా ఎల్​ఐసీ జీవన్​ ఆజాద్​ పాలసీలు అమ్ముడుపోయాయంటే దీనికున్న బెనిఫిట్స్​ను అర్థం చేసుకోవచ్చు. పాలసీ స్పెషాలిటీ ఏంటంటే.. మనం ఏ ప్లాన్​ను తీసుకున్నా 8 సంవత్సరాలు ప్రీమియం మొత్తాన్ని మనం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు మీరు ఒక 20 సంవత్సరాలు పాలసీ ప్లాన్​ను ఎంచుకుంటే దానికి కేవలం 12 ఏళ్ల ప్రీమియం అమౌంట్​ కడితే చాలు. అలాగే ఈ పథకం కింద పాలసీ వ్యవధి(మెచ్యురిటీ) ముగిసే సమయానికి నిబంధనల ప్రకారం కచ్చితమైన హామీతో కూడిన పెద్దమొత్తాన్ని పాలసీదారు​ చేతికి అందజేస్తుంది ఎల్​ఐసీ.

ఎల్​ఐసీ జీవన్​ ఆజాద్​ పాలసీ అంటే ఏమిటి..?
LIC Jeevan Azad Policy Details : ఎల్​ఐసీ అందిస్తున్న అనేక ఇన్సూరెన్స్​ ప్లాన్లలో జీవన్​ ఆజాద్​ పాలసీ మంచి జనాదరణను సంపాదించుకుంది. ఇది వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్​ పార్టిసిపేటింగ్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఈ రకమైన పాలసీలను లో-రిస్క్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ అంటారు. వీటిద్వారా వినియోగదారులు కచ్చితమైన హామీతో కూడిన రిటర్న్​లను పొందుతారు. ముఖ్యంగా ఇవి మార్కెట్​ ఒడుదొడుకుల ప్రభావం వీటిపై పడవు. కాబట్టి ఈ పాలసీ ద్వారా వచ్చే రాబడులకు మార్కెట్​ పనితీరుతో ఏ మాత్రం సంబంధం ఉండదు. దీనిని ఓ లిమిటెడ్​ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్‌గా చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం ప్రీమియం పేయింగ్​ టర్మ్​-పీపీటీ (20 సంవత్సరాల ప్లాన్​ అనుకుందాం) నుంచి 8 సంవత్సరాలను తీసేసి మిగతా కాలానికి మాత్రమే ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక 20 సంవత్సరాల లైఫ్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకున్నారనుకోండి.. దానికి మీరు కేవలం 12 ఏళ్ల ప్రీమియం అమౌంట్​ చెల్లిస్తే చాలు. మీ ప్లాన్​ మెచ్యురిటీ తీరే సరికి మొత్తం పాలసీ ప్లాన్​ అమౌంట్​ మీకు తిరిగి చెల్లిస్తారు. అదేవిధంగా 18 సంవత్సరాల పాలసీ ప్లాన్​కు 10 సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లిస్తే సరి.

పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే..
LIC Jeevan Azad Policy Rules : ఈ ప్రత్యేక ప్లాన్​కు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే అర్హులు. అంటే ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా ఈ పాలసీ తీసుకోవడం కుదరదు. ప్రస్తుతానికి ఈ ప్లాన్​ కింద ఒక్కో వ్యక్తికి కనిష్ఠంగా రూ.2 లక్షలు, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అది కూడా పాలసీ తీసుకోవాలని అనుకునే వ్యక్తి సమర్పించే ఫిజికల్​ ఫిట్​నెస్​ రిపోర్ట్​(మెడికల్​ సర్టిఫికేట్​)పై ఆధారపడి ఉంటుంది. కాగా, ఎల్​ఐసీ జీవన్​ ఆజాద్​ పాలసీ ప్లాన్​ గడువు 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

మూడు నెలల శిశువు నుంచే..
LIC Jeevan Azad Policy Age Limit : అయితే ఈ స్పెషల్​ ప్లాన్​కు మూడు నెలల వయసున్న శిశువుల నుంచి 50 ఏళ్ల వ్యక్తుల వరకు అర్హులు. అయితే మైనారిటీ తీరని పిల్లల కోసం ఈ ప్లాన్​ను తీసుకోవాలనుకుంటే మాత్రం దగ్గర్లోని ఎల్​ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాలి. మిగతా వారికి ఆన్​లైన్​ ద్వారా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే మెచ్యురిటీ అమౌంట్​ను పొందాలంటే గనుక పాలసీదారు కనీసం 18 ఏళ్ల వయసు దాటాలి. గరిష్ఠంగా 70 ఏళ్లలోపు ఉన్నవారు మాత్రమే మెచ్యురిటీ మొత్తాన్ని పొందుతారు. అంటే ఈ పాలసీ ప్లాన్​ గరిష్ఠ కాలం 20 ఏళ్లు కాబట్టి 50 ఏళ్లలోపు ఉన్నప్పుడే ఈ ప్లాన్​ను కొనుగోలు చేస్తే గనుక మనకు 70 సంవత్సరాలు నిండేలోపు మెచ్యురిటీ మొత్తం మన చేతికి అందుతుంది. అయితే పాలసీ తీసుకునే ముందు పాలసీ ఏజెంట్​ ద్వారా అన్ని వివరాలు తెలుసుకుంటే మంచిది.

మెచ్యురిటీకి ముందే పాలసీదారు మరణిస్తే..?
LIC Jeevan Azad Policy If Insured Dies : ప్లాన్​ ప్రారంభమైన తర్వాత పాలసీ గడువు ముగియక ముందే పాలసీదారు మరణిస్తే గనుక అప్పటివరకు కట్టిన ప్రీమియంల ఆధారంగా పాలసీ నిబంధనల ప్రకారం ప్లాన్​ మొత్తాన్ని పాలసీ హోల్డ్రర్​ సంబంధిత వ్యక్తులకు చెల్లిస్తారు. ఈ డెత్​ బెనిఫిట్​ అనేది పాలసీదారు తాను మరణించిన సమయానికి చెల్లించిన ప్రీమియంలతో పోలిస్తే 105 శాతానికి తక్కువ ఉండకూడదు. కాగా, మైనర్​ మరణం విషయంలోనూ నిబంధనల​ ప్రకారం చెల్లించిన ప్రీమియంలను వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తారు.

గమనిక :
ఈ సమాచారం మొత్తం మీ అవగాహన కోసం మాత్రమే. ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు ఎల్​ఐసీ అధికారిక వెబ్​సైట్​లో చూడొచ్చు.. లేదా ఏజెంట్​ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.