ETV Bharat / business

ఆ షేర్లన్నీ కొనేశారు​- ఎల్​ఐసీ ఐపీఓ స్పందన ఎలా ఉందంటే? - ఎల్​ఐసీ ఐపీఓ అప్​డేట్స్​

LIC IPO Responce: బుధవారం ప్రారంభమైన ఎల్​ఐసీ ఐపీఓకు విశేష స్పందన లభిస్తోంది. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్​స్క్రైబ్​ కావడం విశేషం. తొలి రెండు గంటల్లోనే దాదాపు మూడింట ఒక వంతు షేర్లకు సభ్యత్వం పొందారు పెట్టుబడిదారులు.

LIC IPO: Policyholders portion fully subscribed, muted demand in non-institutional category
LIC IPO: Policyholders portion fully subscribed, muted demand in non-institutional category
author img

By

Published : May 4, 2022, 2:24 PM IST

LIC IPO Responce: దేశంలోనే అతిపెద్ద ఐపీఓ ఎల్​ఐసీకి మంచి స్పందన కనిపిస్తోంది. షేర్ల కొనుగోలు కోసం మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి రోజు బిడ్డింగ్​లో భాగంగా.. బుధవారం మధ్యాహ్నం వరకు 0.29 రెట్లు షేర్లు సబ్​స్క్రైబ్​ అయ్యాయి. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్​స్కైబ్​ కావడం విశేషం. కంపెనీ ఉద్యోగుల విభాగానికి కేటాయించిన షేర్లలో 0.49 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి.

క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ బయ్యర్​(క్యూఐబీ), నాన్​- ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్​(ఎన్​ఐఐ) పోర్షన్​కు ఇప్పటివరకు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. కార్పొరేట్లు, ఇతరులు ఉండే ఈ కేటగిరీలో 6 శాతం షేర్లు మాత్రం సబ్​స్క్రైబ్​ అయ్యాయి. మొత్తంగా చూస్తే.. తొలి రెండు గంటల్లో 31 శాతానికిపైగా షేర్లకు దరఖాస్తులు అందాయి.

రిటైల్​, సంస్థాగత పెట్టుబడిదారుల కోసం ప్రారంభమైన ఎల్​ఐసీ ఐపీఓ మే 9న ముగుస్తుంది. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్‌ ఖాతాల్లోకి షేర్లు మే 16న బదిలీ అవుతాయి. మే 17న స్టాక్‌ ఎక్స్చేంజీల్లో షేర్లు నమోదు కానున్నాయి. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.902-949గా నిర్ణయించారు. కనీసం 15 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద మదుపర్లు కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాలి. అయితే పాలసీదార్లకు రూ.60, రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంటు ఇస్తున్నారు. సంస్థలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఈక్విటీ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.