JIO New Recharge Plan 84 Days : దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. కస్టమర్ల అభిరుచి, అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తుంటుంది. తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లను ఎక్కువగా ఉపయోగించే వారిని దృష్టిలో ఉంచుకొని ఓ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు స్విగ్గీతో చేతులు కలిపింది. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు జియో తెలిపింది.
రూ.866తో రీఛార్జ్ చేసుకుంటే 'స్విగ్గీ వన్ లైట్' 3 నెలల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ప్లాన్ ప్రారంభ ఆఫర్ కింద ఇప్పుడు రీఛార్జ్ చేసుకునే వారికి రూ.50 క్యాష్‌బ్యాక్ కూపన్ కూడా ఇస్తున్నట్లు జియో తెలిపింది. ఇది మైజియో అకౌంట్‌లో ఉంటుందని.. తదుపరి రీఛార్జ్‌లో రూ.50 తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఫుడ్ డెలివరీ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చిన తొలి టెలికాం ప్లాన్ ఇదేనని జియో పేర్కొంది. ఈ ప్లాన్‌లో ఉచిత 5జీ డేటా, రోజుకు 2జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉంటాయి. జియోయాప్‌లకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇవన్నీ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి.
ఇవీ బెనిఫిట్స్..!
ఈ ప్లాన్ తీసుకుంటే ప్రతిరోజు 2 జీబీ డేటా వినియోగించుకువచ్చు. రూ.149 కన్నా ఎక్కువ ధర ఉన్న ఫుడ్ ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేస్తారు. ఇక రూ.199 కన్నా ఎక్కువ సరకులను కొనుగోలు చేస్తే కూడా ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తారు. అంతేకాకుండా ఆర్డర్లు పీక్ స్థాయిలో ఉన్న సమయాల్లో కూడా ధరల్లో తేడా ఉండదు. వీటికి తోడు ఫుడ్ ఆర్డర్లపై 30 శాతం వరకు, రూ.60 కన్నా ఎక్కువ విలువ కలిగిన జీనీ డెలివరీలపై 10 శాతం డిస్కౌంట్స్ అందిస్తారు.
BSNL బంపర్ ఆఫర్.. ప్రీ 4జీ సిమ్!
ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలే బీఎస్ఎన్ఎస్ దేశవ్యాప్తంగా 4జీని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసిన సర్కిల్‌లలోని వినియోగదారుల 4జీకి మారేందుకు ఉచిత 4జీ సిమ్ అప్‌గ్రేడ్‌లను ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లను వినియోగదారులు 2జీ/3జీ నుంచి 4జీకి మారేవారికి మూడు నెలల వ్యాలిడిటీతో 4జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నారు. ఈ 4జీ సిమ్‌కు మారాలంటే... ఎంపిక చేసిన ప్రాంతాల్లోని సర్వీస్ సెంటర్లు, ఫ్రైంచైజీ కార్యాలయాలు, రిటైల్ స్టోర్‌ను సంప్రదించాలి. అనంతరం డిజిటల్ కేవైసీ ప్రక్రియను పూర్చి చేయాలి.
తక్కువ ఖర్చులో రెండో సిమ్ మెయింటెనెన్స్!
ప్రస్తుతం చాలా మొబైల్ ఫోన్లు డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్స్‌తో వస్తున్నాయి. ఇక కొన్ని ఫోన్లలో ఈ సిమ్‌తో ఫిజికల్ సిమ్ స్లాట్స్ కూడా ఉంటున్నాయి. ఇక చాలా మంది వారి సౌలభ్యం కోసం రెండు సిమ్ కార్డులను వాడుతుంటారు. అందులో ఎక్కువ మంది వారి ప్రైమరీ సిమ్ కార్డును పర్సనల్ పనుల కోసం వాడతారు. రెండోదాన్ని బిజినెస్ పనుల నిమిత్తం వాడతారు. ఇలా రెండు సిమ్ కార్డులపై డిపెండ్ అవడం వల్ల ఆర్థిక భారం పడుతుంది. అయినా వాటిని యాక్టివ్‌లో ఉంచడానికి రీచార్జ్ చేయించాలి. ఇందుకోసం ప్రముఖ టెలికం కంపెనీలు కాస్ట్ ఎఫెక్టివ్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
Operator | Price | Validity (in days | Data (per year) | Calling |
Airtel | రూ.1,799 | 365 రోజులు | 24 GB | Unlimited |
BSNL | రూ.1251 | 365 రోజులు | 9GB | Unlimited |
Jio | రూ.1559 | 336 రోజులు | 24GB | Unlimited |
Vi | రూ.1799 | 365 రోజులు | 24GB | Unlimited |