ETV Bharat / business

భారత్​లో నగదు బదిలీ పథకం అమలు.. ఓ అద్భుతం: ఐఎంఎఫ్​ - భారత్​ నగదు బదిలీ పథకం

భారత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం.. లక్షలాది మంది నిరుపేదలకు చేరుకోవడం నిజంగా అద్భుతమని ఐఎంఎఫ్​ ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్​ పాలో మౌరో కితాబిచ్చారు. మరోవైపు, పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని భారత్​ సాధించాలంటే కీలకమైన నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలాని ప్రధాన ఆర్థికవేత్త పియర్​-ఒలివర్​ తెలిపారు.

International Monetary Fund
International Monetary Fund
author img

By

Published : Oct 13, 2022, 11:03 AM IST

భారత్​లో పలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో నగదు బదిలీ పథకం అమలు చేయడం ఓ అద్భుతమని అంతర్జాతీయ ద్రవ్యనిధి బుధవారం పేర్కొంది. భారత్​ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఐఎంఎఫ్​ ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్​ పాలో మౌరో అన్నారు. భారత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం.. లక్షలాది మంది నిరుపేదలకు చేరుకోవడం అద్భుతమని ఆయన చెప్పారు.

"ప్రత్యేకంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వృద్ధులు, రైతులను లక్ష్యంగా చేసుకుని వివిధ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అందులోనూ సాంకేతిక ఆవిష్కరణలు ఉండడం గొప్ప విషయం​. విశిష్ట గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్​ను.. భారత్​లో ఉపయోగించడం మరో అద్భుతం. చాలా దేశాల ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ లేకపోయినా.. మొబైల్ ఫోన్​ ఉండడం వల్ల మొబైల్​ బ్యాంకింగ్​ వంటి సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పలు దేశాలు ఇతర దేశాలను చూసి నేర్చుకోవాలి." అని పాలో చెప్పుకొచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు.. ఆర్థిక మాంద్యంలోకి జారుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారతదేశం మాత్రం ఆశాజనకంగా కనిపిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధాన ఆర్థికవేత్త పియర్​ ఒలివర్​ అన్నారు. కానీ పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి కీలకమైన నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని తెలిపారు.

"భారతదేశ ఆర్ధిక వ్యవస్థ సహేతుకంగా బాగానే ఉంది. 2021లో వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండగా.. 2022 వృద్ధిరేటును ఐఎంఎఫ్​ 6.8 శాతంగా అంచనా వేసింది. 2023కు సంబంధించి అంచనాలను 6.1కు తగ్గించింది. భారత ఆర్థిక వ్యవస్థ పది ట్రిలియన్​ డాలర్లకు కచ్చితంగా చేరుకుంటుంది. కానీ అందుకు అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. డిజిటలైజేషన్‌లో భారతదేశం చాలా ముందంజలో ఉంది" అని ఆయన అన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.