ETV Bharat / business

పండుగల వేళ ఫుల్​ గిరాకీ.. ఆన్​లైన్​లో రూ.2.5 లక్షల కోట్ల విక్రయాలు

ప్రస్తుత పండుగ సీజన్​లో దుకాణాలతో పాటు ఆన్​లైన్​​లోనూ విక్రయాలు బాగున్నాయని విక్రయాల సమాఖ్య కాయిట్ తెలిపింది. ఈ సీజన్​లో రూ.2.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు, సేవల విక్రయాలు నమోదు కావచ్చని పేర్కొంది.

cait
కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌
author img

By

Published : Oct 17, 2022, 6:31 AM IST

ప్రస్తుత పండుగ సీజన్‌లో రూ.2.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు, సేవల విక్రయాలు నమోదు కావచ్చని విక్రయదారుల సమాఖ్య కాయిట్‌ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌) భావిస్తోంది. సంప్రదాయ దుకాణాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు బాగున్నాయని తెలిపింది. టీవీలు, గృహోపకరణాలు, ఎఫ్‌ఎంసీజీ ఆహార, ఆహారేతర ఉత్పత్తులు, దుస్తుల వంటి అమ్మకాల పరిమాణం గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే 8-10 శాతం పెరిగినట్లు సమాచారం. ద్రవ్యోల్బణ ఆందోళనలున్నా, దేశీయంగా వినియోగదార్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. వినాయక చవితి, ఓనమ్‌, దుర్గా పూజ, దసరా ఉత్సవాలు పూర్తి కాగా, దీపావళి వరకు పండుగ సీజన్‌గా పరిగణిస్తారు.

  • 41.8 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.7 లక్షల మంది పింఛనుదార్లకు ఇటీవల 4 శాతం కరవు భత్యాన్ని (డీఏ) పెంచడమూ కొనుగోళ్లకు ఊతమిచ్చిందని చెబుతున్నారు. ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ) కింద రైల్వేలో నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని అందించడమూ కొనుగోళ్లను ప్రేరేపించిందని కాయిట్‌ వివరించింది. ఈ రెండు నిర్ణయాలతో రూ.వేల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరాయని కాయిట్‌ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ వెల్లడించారు.
  • నవరాత్రి తర్వాత విక్రయాలు పుంజుకున్నాయని, దీపావళికి ఇవి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీఈఏఎంఏ) వెల్లడించింది. ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల విక్రయాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిటైల్‌ విక్రయాలు పరిమాణ పరంగా 8-10 శాతం, విలువ పరంగా 25-30 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా వేస్తున్నామని సీఈఏఎంఏ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా వెల్లడించారు.
  • డాబర్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌-సేల్స్‌ ఆదర్శ్‌ శర్మ, బికానో డైరెక్టర్‌ మనీశ్‌ అగర్వాల్‌, రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (రాయ్‌) సీఈఓ కుమార్‌ రాజగోపాలన్‌, సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్రై.లి (ఎస్‌పీపీఎల్‌) సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వా, బీఎన్‌పీ పారిబాస్‌ ఇండియా అనలిస్ట్‌-కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ నీలేశ్‌ భయ్యా తదితరులు కూడా గత ఏడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: 'అది రూపాయి పతనం కాదు.. డాలర్ బలపడటం'.. నిర్మలా సీతారామన్

Home Loan ప్రీపేమెంట్‌ చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.