ETV Bharat / business

త్వరలో దిగిరానున్న వంటనూనె ధరలు ! - వంటనూనె ధరలు

Indonesia Palm Oil: వంటనూనె ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఇండోనేషియా తాజాగా ఎత్తివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చుక్కలనంటుతున్న వంటనూనెల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Indonesia Palm Oil
Indonesia Palm Oil
author img

By

Published : May 20, 2022, 7:43 AM IST

Updated : May 20, 2022, 7:59 AM IST

Indonesia Palm Oil: ప్రపంచవ్యాప్తంగా చుక్కలనంటుతున్న వంటనూనెల ధరలు త్వరలోనే కాస్త దిగువకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ దేశం నుంచి పామాయిల్‌ ఎగుమతిపై నెల రోజులుగా అమల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఇండోనేసియా తాజాగా నిర్ణయించడమే ఇందుకు కారణం. ఈ నెల 23 నుంచి తమ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు దేశాధ్యక్షుడు జోకో విడొడొ వెల్లడించారు. ప్రపంచంలో 85% పామాయిల్‌ ఇండోనేసియా, మలేసియాల్లోనే ఉత్పత్తవుతుంటుంది.

దేశీయంగా కొరతను నివారించడమే కాకుండా ధరలకు కళ్లెం వేసేందుకుగాను వంటనూనెల ఎగుమతిపై ఇండోనేసియా నిషేధాన్ని ఏప్రిల్​ 28న అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పామాయిల్‌ రేట్లు రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. భారత్ ఏడాదికి​ 8 మిలియన్​ టన్నుల పామాయిల్​ను దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్​ టన్నుల పామాయిల్​ ఉత్పత్తి అవుతుండగా.. ఇండోనేషియాలోనే 48 మిలియన్​ టన్నులు ఉత్పత్తి అవుతుంది. పామాయిలే ఆ దేశ ప్రధాన ఆదాయ వనరు.

ఇదీ చదవండి: తిరుగు లేని భారత్​... జీడీపీ వృద్ధిలో మనమే టాప్

Last Updated : May 20, 2022, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.