Indian Oil Companies Dividend: ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల సెగ భారత కంపెనీలకూ తాకింది. రష్యన్ కంపెనీల్లో వాటాలున్న కొన్ని భారత చమురు సంస్థలకు భారీ ఎత్తున డివిడెండ్ రావాల్సి ఉంది. కానీ, ఆంక్షల కారణంగా అవి నిలిచిపోయాయి. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ల కన్సార్టియానికి రష్యాకు చెందిన వ్యాంకోర్‌నెఫ్ట్ చమురు ప్రాజెక్టులో 23.9 శాతం, టాస్-యుర్‌యాక్ ఆయిల్‌ఫీల్డ్‌లో 29.9 శాతం వాటాలున్నాయి.
వ్యాంకోర్‌నెఫ్ట్ ఆరు నెలలు, టాస్ యుర్‌యాక్ మూడు నెలలకోసారి డివిడెంట్లు చెల్లిస్తుంటాయి. అందులో భాగంగా భారత కంపెనీలకు వాటి నుంచి 125.49 మిలియన్ డాలర్లు (రూ.975.03 కోట్లు) రావాల్సి ఉంది. కానీ, ఆంక్షల కారణంగా ఆ సొమ్మంతా రష్యన్ బ్యాంకుల్లోనే ఇరుక్కుపోయింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యన్ బ్యాంకులను బహిష్కరించడమే ఇందుకు కారణం.
ఇవీ చూడండి: క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు!
ఆ డిమాండ్లకు ఒప్పుకుంటేనే.. భారత్‌లో ప్లాంట్‌పై మస్క్ క్లారిటీ