ETV Bharat / business

మీ సేవింగ్స్​ అకౌంట్​ ఇన్​యాక్టివ్ అయ్యిందా? - ఏం జరుగుతుందో తెలుసా?

Inactive Savings Account : మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? మీకున్న బ్యాంక్ అకౌంట్లను మెయింటెయిన్ చేయకుండా వదిలేస్తున్నారా? అలా చేస్తే.. ఆ అకౌంట్లు ఇన్​యాక్టివ్​ మోడ్​లోకి వెళ్లిపోతాయి. దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

Inactive Savings Account
Inactive Savings Account
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 11:01 AM IST

Inactive Savings Account : కారణాలు ఏవైనా కావొచ్చు.. కొందరు ఐదారు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేస్తారు. కానీ.. వాటిలో రెగ్యులర్‌గా వాడేవి ఒకటి లేదా రెండు అకౌంట్లు మాత్రమే ఉంటాయి. అవసరం తీరిపోయిన తర్వాత.. మిగిలిన అకౌంట్లను పట్టించుకోరు. అలాగనీ అధికారికంగా క్లోజ్ చేయరు. అలా వదిలేస్తారు. కానీ.. బ్యాంకును బట్టి అకౌంట్​లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయినప్పటికీ.. ఆ ఖాతాను ఆపరేట్ చేయకపోతే.. కొంత కాలం తర్వాత ఇన్​యాక్టివ్​ మోడ్​లోకి వెళ్తుంది. అసలు ఇన్​యాక్టివ్​ సేవింగ్స్​ అకౌంట్​ అంటే ఏంటి..? దాని వల్ల నష్టాలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మంచిది?

ఇన్‌యాక్టివ్ సేవింగ్స్ ఖాతా అంటే ?: 12 నెలల వ్యవధిలో ఎటువంటి లావాదేవీలు నిర్వహించకపోతే.. ఆ ఖాతా​ను ఇన్‌యాక్టివ్ సేవింగ్స్ అకౌంట్ అంటారు. ఉదాహరణకు మీరు 2022 జనవరిలో ఓ ట్రాన్సాక్షన్​ చేశారనుకుందాం. మళ్లీ 2023 జనవరి లోపు ఒక్క ట్రాన్స్​క్షన్​ కూడా చేయకపోతే.. మీ అకౌంట్​ ఇన్​యాక్టివ్​ స్టేట్​లోకి వెళ్లిపోతుంది. ఖాతా ఎక్కువ కాలం ఇన్​యాక్టివ్​గా ఉంటే పెనాల్టీ విధిస్తారు. ఇన్​యాక్టివ్​ ఖాతాల విషయంలో.. బ్యాంకును బట్టి రూల్స్ మారే అవకాశం ఉంది.

అకౌంట్​ ఇన్​యాక్టివ్​గా ఉంటే ఏం జరుగుతుంది..?

  • ఒక ఖాతా ఎక్కువ కాలం పాటు ఇన్​యాక్టివ్​గా ఉంటే.. బ్యాంకు నిబంధనల ప్రకారం.. ఆ అకౌంట్​లోని డబ్బును స్టేట్​ అన్​క్లైయిమ్డ్​ ప్రాపర్టీ డివిజన్​కు బదిలీ చేస్తారు.
  • భవిష్యత్తులో ఖాతా యజమాని లేదా వారి వారసుల ద్వారా నిధులను రీక్లెయిమ్ కోసం ఇది ఉపయోగపడుతుంది.
  • ​ఖాతా ఇన్​యాక్టివ్ అయినందుకు.. ఎక్కువగానే ఫైన్ చెల్లించాల్సి రావొచ్చు.

ఇన్‌యాక్టివ్ సేవింగ్స్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడం ఎలా?

How to Reactivate an Inactive Savings Account..?

  • ఇన్​యాక్టివ్​ పొదుపు ఖాతాను తిరిగి యాక్టివ్​ చేయడానికి.. ఫైన్ సెటిల్ చేయాల్సి ఉంటుంది.
  • దీనికోసం.. మీరు బ్యాంక్ శాఖను సంప్రదించాల్సి ఉంటుంది.
  • కస్టమర్ కేర్​కు కాల్ చేయడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఇన్​యాక్టివ్​ సేవింగ్స్​ అకౌంట్​ను తిరిగి యాక్టివ్​ చేయడానికి కొన్ని బ్యాంకుల్లో.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీస్​ కూడా అందుబాటులో ఉంటుంది.
  • ఫైనల్​గా అకౌంట్​ను యాక్టివేేట్ చేయడానికి డబ్బు డిపాజిట్ చేయడం.. మనీ ట్రాన్స్​ఫర్ చేయడం వంటి చేయాల్సి ఉంటుంది.
  • తరచుగా ఖాతాను ఆర్గనైజ్ చేయకపోతే.. మళ్లీ ఇన్​ యాక్టివ్​ మోడ్​లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

Savings And Current Accounts Difference : సేవింగ్స్.. కరెంట్.. రెండు అకౌంట్లలో ఏది బెస్ట్?

SBI Salary Account Benefits : శాలరీ అకౌంట్​ ఓపెన్ చేయాలా?.. ఎస్​బీఐ అందిస్తున్న బెస్ట్ బెనిఫిట్స్​ ఇవే!

RBL Bank Zero Balance Savings Account : RBL సేవింగ్స్​ అకౌంట్​తో​.. ఎన్ని ప్రయోజనాలో చూశారా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.