Hyundai i10 Car For Only Rs 1 Lakh at Carwale : ఈ రోజుల్లో సొంత ఇల్లు తర్వాత అందరి ఆశ ఓ కారు. కొందరికి అది స్టేటస్ సింబల్ అయితే.. మరి కొందరికి కుటుంబ అవసరం. అందుకే.. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఓ కారు కొనిపడేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు మధ్యతరగతి జనాలు. అయితే.. షోరూమ్ కార్లు కొనాలంటే.. ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అందుకే.. సెకండ్ హ్యాండ్ మీద ఓ లుక్కేస్తుంటారు జనాలు. మీరు కూడా ఇలాంటి మంచి కండీషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారుగానీ కొనాలని చూస్తుంటే మాత్రం.. మీకు ఇక్కడ బెస్ట్ ఛాయిస్‌లు ఉన్నాయి. ఇక, ఆలస్యం చేయకుండా అవేంటో చూసేయండి. వీలుంటే.. రయ్య్‌మంటూ ఓ రౌంట్ వేసేయండి. నచ్చితే ఇంటికి తెచ్చేయండి.
ఇవాళ అంతా ఆన్లైన్ అయిపోయింది. కూరగాయల నుంచి కార్ల దాకా అన్నీ ఇంటర్నెట్ నుంచే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇదే కోవలో.. సెకండ్ కార్లను కూడా ఆన్లైన్ ద్వారా అమ్మే వెబ్సైట్లు చాలానే వచ్చేశాయి. అలాంటి వాటిల్లో ఒకటే CarWale. ఇందులో కార్ల ధరలు తక్కువగానే ఉన్నాయన్నది మార్కెట్ మాట. ప్రత్యేకంగా i10 Magna మోడల్‌ను బట్టి తక్కువ ధరకే వస్తోంది. మరి, ఆ రేట్లు, కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
దేశీయ వాహన మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన కార్లలో హ్యుందాయ్ ఐ10 ఒకటి. ఇందులో శక్తివంతమైన ఇంజన్ ఉంది. ఇది మరింత శక్తిని, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఎక్కువ స్థలం ఉండడంతోపాటు అనేక ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. మార్కెట్‌లో దీని ధర దాదాపుగా రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుంది. CarWale వెబ్‌సైట్‌లోని సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు తక్కువగా ఉన్నాయి.
ముందుగా.. 2009 హ్యుందాయ్ ఐ10 మాగ్నా 1.2 మోడల్ గురించి చూద్దాం. ఇది కేవలం 26,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కారు కండీషన్ చూసుకొని అంతా ఓకే అనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు. అయితే.. ఇందుకోసం నోయిడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు కేవలం రూ. 1.1 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.
2008 మోడల్‌కు చెందిన హ్యుందాయ్ i10 మాగ్నా 1.2 కూడా కార్వేల్ వెబ్సైట్ వద్ద ఉంది. ఇది 81,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది ఘజియాబాద్‌లో ఉంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే.. రూ.1.18 లక్షలు చెల్లించాల్సి ఉంది.
2009 మోడల్‌కే చెందిన మరొక హ్యుందాయ్ i10 Magna 1.2 కారు కూడా అందుబాటులో ఉంది. ఈ కారు కూడా చక్కటి కండీషన్లో ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది 67,500 కిలోమీటర్లు నడిచింది.
2010 హ్యుందాయ్ i10 Magna 1.2 మోడల్ రూ.1.4 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ కారు 1,11,237 కిలోమీటర్లు తిరిగింది. ఈ విధంగా పలు కార్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే.. ఓ రౌండ్ వేసి రావడమే.
నోట్ : ధరల్లో కొద్దిపాటి వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు.
Jeep Compass 2024 : 9.8 సెకన్లలో 100 కి.మీ వేగం.. సూపర్ ఫీచర్స్.. ఈ కారు చూశారా?