ETV Bharat / business

భారీ జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మన దగ్గరే పోస్టింగ్!

author img

By

Published : Apr 26, 2022, 4:04 PM IST

HPCL recruitment 2022: కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్ పెట్రోలియంలో పనిచేసే సువర్ణవకాశాన్ని పొందాలనుకుంటున్నారా? నెలకు రూ.76 వేల గరిష్ఠ వేతనం సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే, ఈ వివరాలు మీకోసమే!

hpcl recruitment 2022
hpcl recruitment 2022

HPCL recruitment 2022: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్​పీసీఎల్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 186 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించింది సంస్థ. విశాఖపట్నంలోని రిఫైనరీలోనే ఈ ఖాళీలు భర్తీ కానున్నాయి. టెక్నీషియన్లు, ల్యాబ్ అనలిస్ట్​లు, సేఫ్టీ ఇన్​స్పెక్టర్​లను నియమించుకోనుంది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం పోస్టులు- 186
*ఆపరేషన్స్ టెక్నీషియన్స్- 94
*బాయిలర్ టెక్నీషియన్స్- 18
*మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ (ఎలక్ట్రికల్)- 17
*మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ (మెకానికల్)- 14
*మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ (ఇన్​స్ట్రుమెంటేషన్)- 9

అర్హతలు
జూనియర్ ఫైర్, సేఫ్టీ ఇన్​స్పెక్టర్లు మినహా మిగిలిన పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు.. డిగ్రీ/డిప్లొమా పాస్ అయి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వీటితో పాటు ఒక్కో ఉద్యోగానికి వేర్వేరు అర్హతలను నిర్ణయించింది హెచ్​పీసీఎల్.

వయసు
అభ్యర్థులు 18ఏళ్లు పైబడిన వారై ఉండాలి. గరిష్ఠ వయసు 25ఏళ్లకు మించకూడదు. 2022 ఏప్రిల్ 1 నాటికి ఈ వయసును లెక్కిస్తారు.
దరఖాస్తు ఇలా
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు త్వరపడండి. ఆన్​లైన్ అప్లికేషన్ల పోర్టల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. మే 21 చివరి తేదీ. www.hindustanpetroleum.com వెబ్​సైట్​లోకి వెళ్లి కెరీర్స్ సెక్షన్​పై క్లిక్ చేసి.. అక్కడ ఉన్న సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపాల్సి ఉంటుంది.
వేతనం
పే స్కేల్ రూ.26 వేల నుంచి రూ.76వేల మధ్య ఉంటుంది. కాస్ట్​ టు కంపెనీ ఆధారంగా ఈ ఉద్యోగాలకు కనీస వేతనం రూ.55 వేలుగా ఉండనుంది. వీడీఏ, హెచ్ఆర్​ఏ, కెఫెటేరియా భత్యంతో పాటు పదవీ విరమణ ప్రయోజనాలు వర్తిస్తాయి.

పోస్టింగ్ ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. హిందుస్థాన్ పెట్రోలియంకు చెందిన విశాఖ్ రిఫైనరీలో పోస్టింగ్ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు 9నెలలు ప్రొబేషన్​పై పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని.. పూర్తి స్థాయి ఉద్యోగులుగా నియమించుకుంటారు.
పరీక్ష ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు రూ.590 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇదీ చదవండి:

స్విగ్గీ బంపర్ ఆఫర్.. ఇకపై వారంతా మేనేజర్స్.. ఫుల్​టైమ్ జాబ్, సూపర్ సాలరీ!

ప్రభుత్వ బ్యాంకులో 'స్పెషల్' ఉద్యోగాలు.. జీతం రూ.78వేల పైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.