How to Money Transfer in SBI UPI Pay App : దేశంలో డిజిటల్ చెల్లింపులు(Digital Payments) ఊపందుకున్న తర్వాత.. యూపీఐ ద్వారా క్షణాల్లో నగదు బదిలీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యాప్‌లకు విపరీతమైన ఆదరణ ఏర్పడింది. దీంతో.. ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) యూపీఐ యాప్స్‌కి ధీటుగా.. ఎస్బీఐ యూపీఐ పే యాప్‌ను తీసుకొచ్చింది.
SBI UPI Pay App Using Process : అన్ని యూపీఐ యాప్‌ల మాదిరిగానే.. దీన్ని కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది. దీంట్లో చెల్లింపుల వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పర్యవేక్షిస్తుంది. మరి, ఈ యాప్‌లో ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకొవాలి? ఏ విధంగా డబ్బులు చెల్లించాలి? ఈ యాప్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
How to Register for SBI UPI in Online :
SBI UPI యాప్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..?
- మొదట మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి SBI UPI యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించుకోవాలి.
- SMS అందిన తర్వాత యాప్ ఆటోమేటిక్‌గా మొబైల్ నంబర్‌ని ధ్రువీకరిస్తుంది.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి 'Virtual Address', ''First Name', 'Last Name', 'ఈ-మెయిల్'ని నమోదు చేయాలి. ఆ తర్వాత సంబంధిత బ్యాంకును ఎంచుకోవాలి.
- అన్ని నిబంధనలు, షరతులను ఆమోదించి 'Next' బటన్‌ను ఎంచుకోవాలి.
- బ్యాంక్ ఖాతాను ఎంచుకున్నాక 'Register'అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత 6-అంకెల పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి.
- m-PINని నిర్ధారించడానికి OPTలో డెబిట్ కార్డ్ వివరాలను సమర్పించడం ద్వారా m-PINని సెటప్ చేసుకోవాలి.
- అప్పుడు మీ సంబంధిత మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్ నిర్ధారణ అయినట్లు సందేశం వస్తుంది.
SBI UPI పే యాప్‌ని ఉపయోగించి డబ్బును ఎలా బదిలీ చేయాలంటే..?
How to Transfer Money Using SBI UPI Pay App in Telugu :
- మీ స్మార్ట్‌ఫోన్‌లోని SBI పే యాప్‌కి వెళ్లి 6 అంకెల పిన్‌ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత 'Pay'అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఖాతాను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత బదిలీ చేయవలసిన మొత్తాన్ని నమోదు చేసి 'Pay'అనే దానిపై క్లిక్ చేయాలి.
- చివరగా m-PINని నమోదు చేసి submitపై నొక్కాలి.
How to Use SBI Card Pay : వినియోగదారులకు SBI గుడ్‌న్యూస్.. ఇక కార్డు లేకుండానే షాపింగ్..!
SBI UPI Pay App Benefits :
SBI UPI Pay యాప్ ప్రయోజనాలు:
ఈజీ ట్రాన్సాక్షన్స్ : SBI PAY యాప్ ద్వారా.. కస్టమర్లు ఎటువంటి ఇబ్బందీ లేకుండా.. డబ్బులు పంపవచ్చు. స్వీకరించవచ్చు.
RBI మద్దతుతో : SBI పే యాప్‌ను RBI పర్యవేక్షిస్తుంది. కాబట్టి.. ఇది ఉపయోగించడానికి చాలా నమ్మదగిన యాప్. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న సేవ కాబట్టి పంపుతున్న నిధుల పరంగా ఎటువంటి ప్రమాదమూ ఉండదు.
వేగవంతమైన సేవ : SBI పే అనేది దేశంలో డిజిటల్ లావాదేవీలను అనుమతించే వేగవంతమైన, ఆర్థిక మరియు అవాంతరాలు లేని సేవ. ఇది ఇతర రకాల ఫండ్ బదిలీ పద్ధతుల కంటే చాలా వేగంగా ఉంటుంది.
రోజులో 20 లావాదేవీలు : మీరు రూ.1 లక్ష పరిమితిలోపు ఒక రోజులో గరిష్టంగా 20 లావాదేవీలను నిర్వహించవచ్చు.
How to Setup and Login to SBI YONO App : మీరు ఎస్బీఐ కస్టమరా..? మరి YONO యాప్ వాడుతున్నారా.. లేదా??
How to Unblock Your SBI ATM Card : SBI ATM కార్డును.. అన్‌బ్లాక్ ఎలా చేయాలి..?