ETV Bharat / business

How To Reverse UPI Transaction : యూపీఐ ద్వారా రాంగ్​ నంబర్​కు పేమెంట్​ చేశారా?.. వెనక్కు తీసుకోండిలా! - యూపీఐ రాంగ్​ పేమెంట్​ను తిరిగి ఎలా పొందాలి

How To Reverse UPI Transaction : కొన్ని సార్లు అనుకోకుండా రాంగ్ ఫోన్​​ నంబర్లకు యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తుంటాం. అంటువంటి సమయాల్లో ఆ డబ్బును ఎలా తిరిగి వెనక్కు తీసుకోవాలో చాలా మందికి తెలియదు. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

how to reverse wrong upi transaction
How To Reverse UPI Transaction
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 4:40 PM IST

How To Reverse UPI Transaction : భారత్​లో యూపీఐ పేమెంట్​ లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. డబ్బులు చెల్లించేందుకు కోట్ల మంది ఈ పద్ధతినే వాడుతున్నారు. మొబైల్​ ఫోన్​ ద్వారా క్షణాల్లోనే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో పంపాల్సిన వారికి కాకుండా వేరే వారికి డబ్బులు పంపిస్తుంటాం. రాంగ్ యూపీఐ ఐడీ లేదా రాంగ్​ ఫోన్​ నంబర్లకు డబ్బులు పంపించేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో ఏం చేయాలి? తిరిగి డబ్బును ఎలా వెనక్కు తెచ్చుకోవాలి? ఈ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఈ క్రింది సందర్భాలలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

  • అనుకోకుండా వేరే వారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపించినప్పుడు​
  • అనధికార చెల్లింపులు జరిపినప్పుడు
  • మోసపూరితమైన లావాదేవీలు జరిగినప్పుడు
  • అవతలి వ్యక్తి ఇంకా చెల్లింపులను స్వీకరించనప్పుడు
  • పేమెంట్​ చేసే సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తినప్పుడు

చెల్లింపుల సమయంలో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు.. ముందుగా సంబంధిత బ్యాంక్ అధికారుల​ను సంప్రదించాలి. అక్కడి అధికారుల దృష్టికి మీ సమస్యను తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని లావాదేవీలను తిరిగి రివర్స్​ చేయడానికి వీలుపడదు. ఒకవేళ గ్రహీత మీ పేమెంట్​ను రిసీవ్​ చేసుకున్నట్లయితే అది కాస్త కష్టంగా మారవచ్చు. కేవలం మీ బ్యాంక్​ను మాత్రమే కాకుండా.. యూపీఐ సర్వీస్​ ప్రొవైడర్​ను కూడా కలిసి మీ సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.

UPI Vs UPI Lite : బేసిక్​ ఫోన్​తో పేమెంట్స్​ చేయాలా?.. UPI & యూపీఐ లైట్​ వాడండిలా!

ఎన్​పీసీఐని సంప్రందించడం ద్వారా..
National Payments Corporation of India : బ్యాంక్ లేదంటే యూపీఐ సర్వీస్​ ప్రొవైడర్ ద్వారా కూడా.. రాంగ్​ పేమెంట్​లను తిరిగి వెనక్కు తీసుకోవడం వీలుకాకపోతే.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ)ను సంప్రదించాలి. ఎన్​పీసీఐ అనేది యూపీఐ సిస్టమ్​ను కంట్రోల్​ చేస్తుంది. కనుక మీ లావాదేవీల సమస్యకు అక్కడ పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. తిరిగి మీ డబ్బును వెనక్కు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇందుకోసం మీరు చేసిన రాంగ్​ ట్రాన్సాక్షన్ వివరాలను.. NPCI అధికారులకు అందించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీ పరిధిలో ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్, లేదంటే సంబంధిత రెగులేట్​ అథారిటీ ఆధికారులను కలిసి కూడా ఈ సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.

ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోరు. మీరు ఇచ్చిన అర్జీని బాగా పరిశీలించిన తరువాతనే సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం కొన్ని రోజుల సమయం పడుతుంది. మీ వినతి న్యాయబద్ధమైనదిగా భావించినప్పుడు.. మీ ఖాతాలో తిరిగి డబ్బు జమ అవుతుంది.

How To Resolve Failed UPI Payments : యూపీఐ ట్రాన్సాక్షన్​ ఫెయిల్ అయ్యిందా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

How UPI Payment Works : త్వరలోనే యూపీఐ 2.0.. మరింత సులభంగా చెల్లింపులు.. ఇంకా మరెన్నో ఫీచర్లు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.