ETV Bharat / business

గుడ్ న్యూస్​ - PF ఖాతాతో LIC పాలసీ లింక్​ చేయొచ్చు - లాభం ఏంటో తెలుసా? - పీఎఫ్‌ ఖాతాతో ఎల్‌ఐసీ పాలసీ లింకింగ్‌

How to Link LIC Policy With PF Account : మీరు నెలనెలా ఎల్​ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించలేకపోతున్నారా..? మీకు పీఎఫ్​ అకౌంట్​ ఉందా..? అయితే మీ కోసమే ఇది. నెలనెలా ఎల్​ఐసీ ప్రీమియం చెల్లించలేని వారు పీఎఫ్ అకౌంట్​ నుంచి చెల్లించవచ్చు. మరి.. ఆ ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How to Link LIC Policy With PF Account
How to Link LIC Policy With PF Account
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 11:22 AM IST

How to Link LIC Policy With PF Account in Telugu: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అంతిమ లక్ష్యం ఒక్కటే. ఉద్యోగులు లేదా పాలసీదారులకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించడం! అయితే.. రెండిటి మధ్య చిన్న తేడా ఉంది. పీఎఫ్ ఖాతాకు చేరాల్సిన సొమ్ము ఉద్యోగి చేతి నుంచి చెల్లించకుండానే చేరిపోతుంది. కానీ.. LIC ప్రీమియం మాత్రం పాలసీదారు నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి చేతిలో డబ్బులేక చెల్లించలేకపోతుంటారు. ఇలాంటి వారికి PF, ఎల్​ఐసీ కలిసి ఓ అద్భుత అవకాశాన్ని అందిస్తున్నాయి. మరి.. అదేంటి అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

EPF Advance For Marriage : పెళ్లి కోసం డబ్బులు కావాలా?.. ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందండిలా!

పీఎఫ్​ ఖాతాతో ఎల్​ఐసీ పాలసీ లింక్​ వల్ల ప్రయోజనాలు:

Benefits of Linking LIC Policy with PF Account: ఆర్థిక సమస్యలు వేధిస్తున్న పాలసీదారులు.. గడువు తేదీలోపు ప్రీమియం చెల్లించలేకపోతుంటారు. దీనివల్ల ఫైన్ చెల్లించాల్సి రావొచ్చు. నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగి.. పాలసీని కొనసాగించలేకపోవచ్చు కూడా. అందుకే.. పీఎఫ్, ఎల్​ఐసీ సంస్థలు కలిసి.. PF అకౌంట్​ కలిగిన ఉద్యోగులకు ఓ సూపర్ ఛాన్స్ అందిస్తున్నాయి. PF అకౌంట్​తో.. LIC పాలసీని లింక్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. అంటే.. ఇక నుంచి మీరు మీ PF డబ్బు ఉపయోగించి LIC పాలసీ ప్రీమియం చెల్లించవచ్చన్నమాట!

ఉద్యోగులకు మేలే..!

ఈ అవకాశం ఉద్యోగులకు ఒక వరంగా భావిస్తున్నారు. ఎల్‌ఐసీ పాలసీని ఈపీఎఫ్‌ ఖాతాతో లింక్ చేయడం వల్ల.. ఉద్యోగులపై ప్రత్యక్ష ఆర్థిక భారం తగ్గుతుంది. వచ్చే నెలవారీ వేతనం నుంచే ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి రాదు. దాంతో ఉద్యోగులకు వెసులుబాటు లభిస్తుంది. దీనివల్ల.. ప్రీమియం చెల్లించని కారణంగా ఎల్‌ఐసీ పాలసీలు లాప్స్ అయ్యే ప్రమాదం తగ్గుతుందని భావిస్తున్నారు.

How to Check PF Balance in Easy Way : క్షణాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. UAN, ఇంటర్నెట్ కూడా అవసరం లేదు..!

పీఎఫ్‌ అకౌంట్​కు ఎల్‌ఐసీ పాలసీని ఎలా లింక్​ చేయాలి:

How to Link Lic Policy With PF Account:

  • ఎల్‌ఐసీ పాలసీని మీ పీఎఫ్​ ఖాతాతో లింక్ చేయడానికి మీరు ఫామ్-14ని.. సమీపంలోని EPF​ ​కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
  • మీ పీఎఫ్‌ ఖాతాను ఉపయోగించి LIC ప్రీమియం చెల్లింపును అనుమతించాలని కోరుతూ.. ఈపీఎఫ్‌ కమిషనర్‌ని కోరాల్సి ఉంటుంది.
  • అయితే.. మీ పీఎఫ్‌ ఖాతాలోని నిధులు.. మీ వార్షిక ఎల్‌ఐసీ ప్రీమియం మొత్తంతో పోలిస్తే, కనీసం రెండింతలు ఉండాలి.
  • ఈ సదుపాయం ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులకు మాత్రమే పరిమితం.
  • ఇతర బీమాల ప్రీమియం పీఎఫ్‌ ఖాతా ద్వారా చెల్లించడానికి అవకాశం లేదు.

మీకు ఎల్​ఐసీలో పాలసీ ఉందా? - ఈ నెంబర్​కు 'Hai' అని పెడితే నిమిషాల్లో పూర్తి వివరాలు!

LIC Policy Revival Process : మీ ఎల్​ఐసీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా?.. సింపుల్​గా రివైవ్ చేసుకోండిలా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.