How To Get Fancy Registration Number For Vehicle : మనలో చాలా మందికి ఫ్యాన్సీ నంబర్స్ అంటే చాలా మోజు ఉంటుంది. కొంతమందికి నంబర్ సెంటిమెంట్ ఉంటుంది. అందుకే ఇలాంటి వాళ్లు తమ కార్లు, బైక్‌ల కోసం భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి.. ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకుంటూ ఉంటారు. మరి మీరు కూడా ఇలాంటి ఫ్యాన్సీ నంబర్లను కోరుకుంటున్నారా? అయితే ఆ ఫ్యాన్సీ నంబర్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
అంత సులువు కాదు!
Fancy Number Registration Process : వాహనాలకు ముందు, వెనుక భాగంలో నంబర్ ప్లేట్ కచ్చితంగా ఉండాలి. ఈ నంబర్ ప్లేట్లో కొన్ని అక్షరాలు, నంబర్లు ఉంటాయి. ఇవి సదరు బండి యజమాని వివరాలను, పొజిషన్ వివరాలను, అది ఏ ప్రాంతంలో రిజిస్టర్ అయ్యింది అనే విషయాలను తెలియజేస్తుంది. వాస్తవానికి ఈ నంబర్ ప్లేట్స్ లేదా లైసెన్స్ ప్లేట్స్ వలన ట్రాఫిక్ నియంత్రణ సులువు అవుతుంది.
మనలో చాలా మంది కొత్త కారు కొన్న తరువాత.. తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్లను సొంతం చేసుకోవాలని చూస్తారు. కానీ ఇది అంత సులువు కాదు. ఫ్యాన్సీ నంబర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. అందుకే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఫ్యాన్సీ నంబర్ సిరీస్ పొందాలంటే.. ఆర్టీఓ సంస్థ విధించే కఠినమైన నిబంధనలను సరిగ్గా ఫాలో కావాల్సి ఉంటుంది.
ఫ్యాన్సీ నంబర్ కోసం అప్లై చేయండిలా?
How To Apply Online For Fancy Registration Number : మీరు కనుక కచ్చితం మీ వాహనానికి (కారు/బైక్) ఫ్యాన్సీ నంబర్ కావాల్సిందే అని అనుకుంటే.. ఇక్కడ తెలిపిన ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. (వాస్తవానికి ఏ విధమైన వాహనానికైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది.)
1. ముందుగా మీరు రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వశాఖ వారి అధికారిక వెబ్సైట్ https://morth.nic.in/ ఓపెన్ చేయాలి.
2. పబ్లిక్ యూజర్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకుని.. లాగిన్ అవ్వాలి.
3. వెబ్సైట్లో దేశంలోని RTO ఆఫీసుల లిస్ట్ ఉంటుంది.. ఆ లిస్ట్‌లో మీరు ఏ RTO ఆఫీస్ పరిధిలోకి వస్తారో, దానిని ఎంచుకోవాలి.
4. మీకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ అందుబాటులో ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి.
5. ఒక వేళ మీరు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ ఉంటే.. దాని పక్కనే నంబర్ రిజర్వేషన్ ఛార్జీ కనిపిస్తుంది.
6. మీరు కోరుకున్న నంబర్‌ను రిజర్వ్ చేసుకోవాలంటే.. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
7. మీకు ఎవరూ పోటీ రాకుంటే.. బేసిక్ రిజర్వేషన్ ప్రైజ్‌కే ఫ్యాన్సీ నంబర్ అలాట్ అవుతుంది. ఒక వేళ ఎవరైనా పోటీకి వస్తే.. ఆక్షన్ నిర్వహిస్తారు. అప్పుడు మీరు కచ్చితంగా ఆక్షన్‌లో పాల్గొనాల్సి వస్తుంది. ఇందుకోసం మీరు ముందుగా బిడ్డింగ్ వేయాలి. మీలాగే చాలా మంది బిడ్డింగ్ వేస్తూ ఉంటారు. అందులో ఎవరైతే ఎక్కువ డబ్బులకు బిడ్ వేస్తారో.. వారికి సదరు ఫ్యాన్సీ నంబర్ దక్కుతుంది.
8. ఒక వేళ మీరు వేసిన బిడ్ అప్రూవ్ అయితే.. వెంటనే సదరు బిడ్ డబ్బులను ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది. (ఒక వేళ ఆక్షన్‌లో మీకు ఫేవర్‌బుల్‌గా రిజల్ట్ రాలేదనుకోండి. వెంటనే మీకు రిఫండ్ వస్తుంది.)
9. ఆక్షన్‌లో మీరు ఫ్యాన్సీ నంబర్ గెలుచుకున్న తరువాత.. అలాట్మెంట్ లేటర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి.
10. ఆ అలాట్మెంట్ లెటర్ ప్రింట్అవుట్ను సంబంధిత డీలర్షిప్ సంస్థ వద్ద సబ్మిట్ చేయాలి. అప్పుడు ఆ డీలర్స్ మీ వాహనానికి.. మీరు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను ఇన్స్టాల్ చేసి ఇస్తారు.
నోట్ : వాస్తవానికి ఫ్యాన్సీ నంబర్ ఆక్షన్ అనేది సుదీర్ఘమైన ప్రక్రియ అని చెప్పవచ్చు. మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిన 4 రోజుల తరువాత మాత్రమే.. ఫ్యాన్సీ నంబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఆక్షన్- బిడ్డింగ్- ఫ్యాన్సీ నంబర్ అలాట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరో 5 రోజులు పడుతుంది.