How to Find Your Which Bank Accounts are linked to Phone Number : ఈ డిజిటల్ కాలంలో దాదాపుగా అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కొంతమంది వివిధ బ్యాంకులు క్రెడిట్(Credit Cards), డెబిట్ కార్డులపై ఆఫర్స్ ఇస్తుండడంతో రెండు, మూడు ఖాతాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఏ బ్యాంకుకు ఏ ఫోన్ నంబర్ ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. కానీ.. మీ బ్యాంకు అకౌంట్స్(Bank Account) నంబర్స్ తెలిసి ఉండడం అవసరం. ఒకవేళ మీరు మరిచిపోతే.. సింపుల్‌గా మీ బ్యాంకు ఖాతాకు లింక్ అయిన నంబర్ ఇలా తెలుసుకోవచ్చు.
UIDAI వెబ్‌సైట్ ద్వారా మీ ఫోన్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను కనుగొనండిలా..
How to Find Bank Accounts linked to Phone Number use UIDAI Website : సాధారణంగా మీరు బ్యాంకు అకౌంట్ తీసే అన్ని బ్యాంకులు ఆధార్‌ను అడుగుతాయి. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ చేసి ఉంటారు. కాబట్టి, UIDAI వెబ్‌సైట్ ద్వారా మీ పేరు లేదా మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాను సులభంగా తెలుసుకోవచ్చు.
- ముందుగా మీరు UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ఆధార్ సేవల కింద Check Aadhaar/Bank Linking Statusను నావిగేట్ చేయండి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీని నమోదు చేయాలి.
- అలాగే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Send OTPపై క్లిక్ చేయాలి.
- అప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని అక్కడ నమోదు చేసి.. చివరగా సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- అంతే మీ ఆధార్, ఫోన్ నంబర్‌కి లింక్ చేయబడిన మొదటి బ్యాంక్ ఖాతా స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది.
ATM Withdraw Issues : ఏటీఎంలో డబ్బులు రాలేదా..? బ్యాంకులు రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే..!
UPI యాప్‌ల ద్వారా ఫోన్ నంబర్‌కి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను కనుగొనండిలా..
How to Find Bank Accounts linked to Phone Number Through UPI Apps : Google Pay, Paytm, PhonePe, BHIM మొదలైన UPI యాప్‌ల ద్వారా మీ పేరు లేదా మొబైల్ నంబర్‌కి లింక్ చేయబడిన అన్ని బ్యాంక్ ఖాతాలను కనుగొనడానికి మరొక మార్గం. అన్ని యాప్‌లలో అకౌంట్‌తో లింక్ అయిన నంబర్ కనుగొనే ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది.
- మొదట మీ ఫోన్లో మీరు వాడే UPI యాప్‌ను ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత ఎవరికైనా proceed to pay చేయండి. డబ్బు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.
- చెల్లింపు స్క్రీన్‌పై ఎంతో కొంత మొత్తాన్ని నమోదు చేయండి. ఉదాహరణకు రూ. 1 అనుకోండి.
- ఆ తర్వాత చెల్లింపు మోడ్‌ను ఎంచుకోండి.
- అప్పుడు చెల్లింపు మోడ్ స్క్రీన్‌పై Add a bank accountపై నొక్కండి.
- ఆ తర్వాత మీరు వ్యక్తిగతంగా బ్యాంక్‌లను ఎంచుకోవాలి.
- అప్పుడు UPI యాప్‌లో మీ ఫోన్ నంబర్‌కి ఏ బ్యాంక్ ఖాతా లింక్ చేయబడి ఉందో తెలియజేస్తుంది.
Contact Your Bank to Find Bank Accounts linked to Phone Number :
మీ బ్యాంక్‌ని సంప్రదించడం ద్వారా కూడా ఏ నంబర్ ఇచ్చారో తెలుసుకోవచ్చు.. మీ పేరు, నంబర్‌కి లింక్ చేయబడిన ఏవైనా ఇతర ఖాతాల గురించిన వివరాలను పొందడంలోనూ మీ బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది. మీకు అకౌంట్ ఉన్న బ్రాంచ్‌ని సందర్శించడం ఎలా తెలుసుకోవచ్చు అంటే.. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ బ్యాంక్‌లో ఇచ్చి ఉంటారు. మీరు బ్యాంకు వారిని సంప్రదించిం.. మీ ఫోన్ నంబర్ ఏ అకౌంట్‌కి లింక్ అయి ఉందో చెప్పాలని కోరితే.. వారు చెక్ చేసి చెబుతారు.
UPI Vs UPI Lite : బేసిక్ ఫోన్‌తో పేమెంట్స్ చేయాలా?.. UPI & యూపీఐ లైట్ వాడండిలా!
Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్ అందించే బ్యాంకులివే..!