How To Find My PPO Number : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం కల్పించిన ఆదాయ మార్గం పెన్షన్. అయితే క్రమం తప్పకుండా పెన్షన్ పొందాలంటే.. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి సదరు బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో 'యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్' లేదా 'జీవన ప్రమాణ పత్రం'ను సమర్పించాల్సి ఉంటుంది. అలా ఏడాదికోసారి దీనిని అందిస్తేనే క్రమం తప్పకుండా మీరు పెన్షన్ డబ్బులను పొందగలుగుతారు. అయితే యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ పొందాలంటే.. కచ్చితంగా మీకు PPO నంబర్ తెలియాల్సి ఉంటుంది. మరి ఈ పీపీఓ నంబర్‌ను ఆన్లైన్లో తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
PPO నంబర్ పొందండిలా!
- ముందుగా www.epfindia.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- తర్వాత Online Serviceలోని pensioner's portalపై క్లిక్ చేయాలి.
- అనంతరం పేజీ కుడి భాగంలో ఉండే pensioner's portalలో 'Know Your PPO number'పై క్లిక్ చేయాలి.
- మీ బ్యాంక్ ఖాతా నంబర్ లేదా PF సంఖ్యను ఎంటర్ చేయాలి.
- ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మీకు PPO నంబర్‌తో పాటు Member ID, ఏ రకమైన పెన్షన్‌ను మీరు పొందుతున్నారు లాంటి వివరాలు కనిపిస్తాయి.
- ఈ యూనిక్ నంబర్ అనేది పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో గానీ, యానువల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించేటప్పుడు గానీ ఉపయోగపడుతుంది.
- మీ PF ఖాతాను ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి మరొక బ్యాంక్‌కు బదిలీ చేసేటప్పుడు కూడా ఈ PPO నంబర్ ఉపయోగపడుతుంది.
Digilocker నుంచి కూడా PPO నంబర్ డౌన్లోడ్!
- EPF పోర్టల్ నుంచే కాకుండా Digilocker ద్వారా కూడా పెన్షన్ పేమెంట్ ఆర్డర్(PPO)ను సులువుగా పొందవచ్చు. ఎలాగంటే..
- ముందుగా digilocker.gov.in లో రిజిస్టర్ కావాలి. తరువాత..
- Digilocker అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- తరువాత UAN సేవలపై క్లిక్ చేసి నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- అనంతరం 'Get Document'పై క్లిక్ చేయాలి.
- చివరగా 'ePPO'ను డౌన్లోడ్ చేసుకోవాలి.
గమనిక : పైన తెలిపిన స్టెప్స్‌ను ఫాలో అవుతూ EPS స్కీమ్ సర్టిఫికేట్, UANను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
PPO నంబర్ అంటే ఏమిటి?
What Is PPO Number : PPO (పెన్షన్ పేమెంట్ ఆర్డర్).. ఇది 12 అంకెల నంబర్. దీని సాయంతోనే పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు నిరాటంకంగా పెన్షన్‌ను పొందగలరు. దీని సాయంతో మీ పెన్షన్ స్టేటస్‌ను ట్రాక్ కూడా చేసుకోవచ్చు.
యానువల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?
What Is Annual Life Certificate : ప్రభుత్వ ఉద్యోగులు.. సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పొందుతారు. దీనిని పొందేందుకు సదరు వ్యక్తి తాను బతికి ఉన్నట్లుగా ఒక డాక్యుమెంట్‌ను.. పెన్షన్‌ను అందించే బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు లేదా ఇతర సంస్థలకు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీనినే యానువల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రం అని కూడా అంటారు.
జీవన ప్రమాణ పత్రం ఇవ్వకపోతే ఏమౌతుంది?
What Will Happen If Jeevan Pramaan Pathra Not Submitted : జీవన ప్రమాణ పత్రం.. అనేది మీరు బతికి ఉన్నారని తెలిపే సర్టిఫికేట్. ఇది మీ పెన్షన్ డబ్బులను యథావిథిగా మీ బ్యాంక్ ఖాతాలు లేదా పోస్ట్ ఆఫీసుల్లో జమ చేయాల్సిందిగా కోరుతూ ఇచ్చే డాక్యుమెంట్. దీనిని తప్పనిసరిగా ఏడాదికోసారి మీకు పెన్షన్‌ను మంజూరు చేసే సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిని అందిచని పక్షంలో మీకు వచ్చే పెన్షన్‌ను నిలుపుదల చేస్తారు.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ఇవ్వాల్సిన వివరాలు!
- మీ పూర్తి పేరు
- ఆధార్ నంబర్
- మొబైల్ నంబర్
- PPO నంబర్
- పెన్షన్ అకౌంట్ నంబర్
- బ్యాంక్ ఖాతా వివరాలు
- మీకు పెన్షన్‌ను మంజూరు చేసే సంస్థ వివరాలు.
- మీకు పెన్షన్ అందించే బ్యాంకు లేదా పోస్టాఫీస్ వివరాలు.
- How to Check GST Payment Status in Online : ఆన్లైన్లో మీ జీఎస్టీ పేమెంట్ స్టేటస్.. ఇలా తెలుసుకోండి!
- Vehicle RC Transfer Process : వెహికల్ RCని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
- Stay Alert! These 5 Cash Transactions Could Land You an IT Notice : ఈ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా..? మీకు ఐటీ నోటీసులు పక్కా..!