IBPS Admit Card Download : ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఐబీపీఎస్ (IBPS) క్లర్క్ పోస్టులకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌ను ఆగస్టు 16వ తేదీన విడుదల చేసినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా IBPS పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. IBPS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. మరి, IBPS (Institute of Banking Personnel Selection) క్లర్క్ పోస్టుల అడ్మిట్ కార్డ్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?, అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి..?, ఏయే వివరాలను నమోదు చేయాలి..?, అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఎన్ని రోజుల సమయం ఉంది..? చివరగా.. పరీక్ష తేదీలు ఎప్పుడు..? వంటి తదితర వివరాలను తెలుసుకుందాం.
IBPS అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌కు అనుసరించాల్సిన పద్ధతులు..
- క్లరికల్ కేడర్ పోస్టుల దరఖాస్తులో అన్ని పత్రాలు సమర్పించిన వారు మాత్రమే IBPS క్లర్క్ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అర్హులు.
- దరఖాస్తుదారులు మొదటగా అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ను సందర్శించాలి.
- 'IBPS CRP క్లర్క్ అడ్మిట్ కార్డ్' లింక్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ లేదా పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ నమోదు చేయాలి.
- ఆ తర్వాత దరఖాస్తుదారుని ఖాతా లాగిన్ అవుతుంది.
- క్లర్క్‌ల కోసం IBPS అడ్మిట్ కార్డ్ అని స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి, దాని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఎన్ని రోజుల్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి?
How to Download :
IBPS క్లర్క్ పోస్టుల అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి IBPS కొద్ది రోజుల సమయాన్ని మాత్రమే కేటాయించింది. 16 ఆగస్టు 2023 నుండి 2 సెప్టెంబర్ 2023 లోపు అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని వెల్లడించింది.
IBPS క్లర్క్ పరీక్ష తేదీలు..
IBPS Clerk Exam Dates :
IBPS క్లర్క్ పోస్టులకు ఏయే తేదీల్లో పరీక్షలు జరగనున్నాయనే వివరాలను కూడా IBPS వెల్లడించింది. ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2వ తేదీల్లో పరీక్ష జరగనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్ష ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్ లో నిర్వహిస్తామని అధికారులు తెలియజేశారు. కాబట్టి అభ్యర్థులంతా త్వరగా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోవాలని సూచించారు. పరీక్ష జరిగే రోజున ధ్రువీకరణ కోసం ఒరిజినల్ హాల్ టికెట్ తీసుకొస్తేనే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తారని ఐబీపీఎస్ అధికారులు పేర్కొన్నారు.
ఈ యాప్‌లను అధ్యయనం చేయండి..
గ్రేడ్ అప్-ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ (Grade up Exam Preparation App) :
ఈ యాప్ వివిధ రకాల బ్యాంక్ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఇది స్టడీ వీడియోలు, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, క్విజ్‌లు, మాక్ టెస్ట్‌లతోపాటు మరికొన్నింటికోసం విద్యార్థులు సన్నద్ధం కావడానికి సహకరిస్తుంది.
అడ్డా 24/7 (Adda 24/7 app): ఈ యాప్ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని అంశాలనూ కవర్ చేస్తుంది. ఇది పరీక్షలకు సంబంధించిన తాజా విషయాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా, ప్రత్యక్ష తరగతులు, వీడియో ఉపన్యాసాలను అందిస్తుంది. అదనంగా ఇ-బుక్స్, నోట్స్, మాక్ టెస్ట్‌లు, క్విజ్‌లతోపాటు మరికొన్నింటిని అందిస్తుంది.
ఇలాంటి యాప్స్.. SBI, IBPS PO, IBPS క్లర్క్ పోస్టులతోపాటు మరికొన్ని ఉద్యోగాల ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడుతాయి. ఈ యాప్స్‌లోని కోర్సులు సాధారణ అవగాహన, Quantitative Aptitude, రీజనింగ్ సామర్థ్యం వంటి సిలబస్‌లను కవర్ చేస్తాయి. దీంతోపాటు అదనంగా స్టడీ మెటీరియల్ అందిస్తూ, మాక్ పరీక్షలను కూడా నిర్వహిస్తాయి. నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని.. పరీక్షకు సన్నద్ధమవ్వండి. ఆల్ ది బెస్ట్.