ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - health insurance tips and tricks

Best Health Insurance tips and tricks : ఆరోగ్య బీమా మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరినప్పుడు, మనం జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము నీళ్లలా ఖర్చు అయిపోకుండా ఇది మనల్ని కాపాడుతుంది. కానీ సరైన అవగాహన లేకుండా ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నట్లయితే.. అవసరమైన సమయంలో పాలసీ ఉన్నా ఫలితం లేకుండా పోతుంది. అందుకే ఆరోగ్య బీమా గురించి, పాలసీ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.

best health insurance plans
how to choose best insurance policy
author img

By

Published : Jun 4, 2023, 3:56 PM IST

How to choose best health insurance : ఉరుకుల పరుగుల ఈ ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. ఇది కష్ట సమయంలో మనల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది అయితే ఆరోగ్య బీమా తీసుకునే ముందు పలు అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.

నిబంధనలు మారుతూ ఉంటాయి!
ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో చాలా సహజంగానే మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలపై మనకు సరైన అవగాహన లేకపోతే.. అవసరమైనప్పుడు పాలసీ ఉన్నా కూడా ఫలితం లేకుండా పోతుంది. అందువల్ల ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకునే ముందు పరిగణించాల్సిన అంశాలు
Health Insurance room rent limit :
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు గది అద్దె అనేది చాలా కీలకంగా మారుతుంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు కచ్చితంగా ఇన్సూరెన్స్​ కంపెనీయే గది అద్దె మొత్తం చెల్లించాలే చూసుకోవాలి. లేదంటే మన సొమ్ము గంగపాలైనట్లే.

ఉదాహరణకు మీరు ఒక హెల్త్​ పాలసీ తీసుకున్నారనుకుందాం. అందులో గది అద్దె రూ.6 వేలు వరకు మాత్రమే చెల్లించేలా నిబంధన ఉందనుకుందాం. కానీ మీరు చేరిన ఆసుపత్రిలో గది అద్దె రూ.10 వేల వరకు చెల్లించాల్సి వచ్చింది. అంటే మీరు మీ చేతి నుంచి రూ.4వేల రూపాయలు ఆసుపత్రికి చెల్లించాల్సి వస్తుంది. మీరు రూ.4 వేల రూపాయలే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇన్సూరెన్స్​ కంపెనీ గది అద్దె ఆధారంగా మిగతా చికిత్స ఖర్చులను లెక్కవేసి, దామాషా ప్రకారం బిల్లులు చెల్లిస్తుంది. అంటే పై ఉదాహరణనే తీసుకుంటే, ఆసుపత్రిలోని గది బిల్లు రూ.6 వేలనే ప్రామాణికంగా తీసుకుని, ఆ మేరకే చికిత్స బిల్లును సర్దుబాటు చేసి క్లెయిమ్​ చెల్లిస్తుంది. దీని వల్ల మీరు భారీగా నష్టపోతారు. అందుకే పాలసీ తీసుకున్నప్పుడే గది అద్దెపై ఎలాంటి పరిమితి లేకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఇలాంటి పాలసీల ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ అవసరమైనప్పుడు ఇవే మనల్ని ఆదుకుంటాయి.

చికిత్సకు ముందు, తరువాత కూడా..
హెల్త్​ ఇన్సూరెన్స్​ ఉంటే ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లినంత వరకు అయిన ఖర్చులన్నింటినీ ఇన్సూరెన్స్​ కంపెనీయే భరిస్తుంది. ఇంటికి వెళ్లిన తరువాత కూడా రోగికి అయ్యే ఖర్చులను కొన్ని సార్లు ఆరోగ్య బీమా సంస్థ చెల్లిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పాలసీలు 30 నుంచి 60 రోజుల వరకు, గరిష్ఠంగా 60 నుంచి 180 రోజుల వ్యవధి వరకు ఖర్చులను భరిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడానికి ప్రయత్నించండి.

ఉపపరిమితులు లేకుండా చూసుకోవాలి
Health Insurance sublimit : ఆరోగ్య బీమా పాలసీల్లో నిర్ణీత వ్యాధులకు మాత్రమే క్లెయిమ్​ వర్తిస్తుంది. కొన్ని సార్లు క్లెయిమ్​ చేసుకోవడానికి వీలున్నా, దానిపైన కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.
ఉదాహరణకు కంటి శుక్లాల చికిత్సకు రూ.60 వేల వరకే పరిమితి ఉందునుకుందాం. కానీ వాస్తవానికి ఆసుపత్రిలో కంటి శుక్లాల చికిత్సకు రూ.1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది. అయినప్పటికీ, ఇన్సూరెన్స్​ కంపెనీ మీకు రూ.60 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ఒకవేళ చికిత్స ఖర్చు రూ.30 వేలు మాత్రమే అయ్యిందనుకుందాం. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ రూ.30 వేలు మాత్రమే చెల్లిస్తుంది.

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇలాంటి పాలసీల్లో ఆసుపత్రి గదికి చెల్లించాల్సిన మొత్తం, పాలసీలో 1శాతం మాత్రమే ఉంటుంది. కనుక ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు, ఎక్కువ ఉపపరిమితులు లేదని పాలసీలను ఎంచుకోవడం ఉత్తమం.

నిరీక్షణ లేకుండా చూసుకోవాలి
Health insurance waiting period : ఆరోగ్య బీమా విషయంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, బీమా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు అది వర్తించదు. పాలసీదారునకు అప్పటికే ఉన్న వ్యాధులకు నిర్ణీత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం లాంటి కొన్ని వ్యాధులు ఈ కోవలోకి వస్తాయి. ఇలాంటి వ్యాధులకు 2 నుంచి 4 సంవత్సరాల వ్యవధి వరకు వేచి చూడాల్సిరావచ్చు.

బీమా తీసుకునేటప్పుడు నిరీక్షణ కాలం తక్కువ ఉండేలా చూసుకోవాలి. అయితే కొన్ని పాలసీలు మాత్రం కాస్త అధిక ప్రీమియం వసూలు చేసి, పాలసీ తీసుకున్న రోజు నుంచే బీమాను కవర్​ చేస్తూ ఉంటాయి. మీకు ఈ విషయంపై ఏమైనా సందేహాలు ఉంటే మీరు బీమా కంపెనీని సంప్రదించవచ్చు.

నగదు రహితంగా చికిత్స అందేలా చూసుకోవాలి
Health insurance cashless claim process : మీరు తీసుకున్న పాలసీలో నెట్​వర్క్ ఆసుపత్రుల జాబితా చూసుకోవాలి. అవి మీకు అందుబాటులో ఉన్నాయో, లేదో చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంతే కాకుండా నెట్​వర్క్​ ఆసుపత్రుల్లో నగదు రహితంగా చికిత్స అందేలా చూసుకోవాలి. ఒక వేళ నాన్​ నెట్​వర్క్​ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే, ముందుగా మనం చెల్లించిన బిల్లును చూపించి, బీమా కంపెనీ నుంచి క్లెయిమ్​ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ముందుగా మనం మన జేబు నుంచి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తరువాత బిల్లులు చూపించి, బీమా క్లెయిమ్​ చేసుకోవాల్సి ఉంటుంది కనుక.

రోజువారీ చికిత్సకూ కవరేజ్​ ఉండాలి
Health insurance day care procedures : టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో, ఆసుపత్రుల్లో చాలా చికిత్సలు కేవలం ఒక్క రోజులోనే పూర్తయిపోతున్నాయి. ఇలాంటి చికిత్సలను డే కేర్​ చికిత్సలు ఉంటారు. ఉదాహరణకు డయాలసిస్​, కీమోథెరపీ లాంటివి. అందుకే ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు పాలసీలో డే కేర్​ చికిత్సలకూ పరిహారం అందేలా చూసుకోవాల్సి ఉంటుంది.

బిల్లులో కొంత మీరు కట్టాల్సి వస్తే..
ఆసుపత్రి ఖర్చులు కొంత మేరకు మీరు చెల్లించాల్సి రావడాన్ని 'సహ చెల్లింపు' అంటారు. ఉదాహరణకు మీరు 20 శాతం సహ చెల్లింపు చేయాల్సి ఉంది అనుకుందాం. అలాంటప్పుడు ఆసుపత్రి బిల్లు లక్ష రూపాయలు అయితే మీరు 20 శాతం అంటే రూ.20 వేలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇలాంటి పాలసీల వల్ల ముందస్తు ప్రీమియం తగ్గుతుంది కానీ, అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు భారంగా మారుతుంది. కనుక సహ చెల్లింపులు సాధ్యమైనంత తక్కువగా ఉండేలా లేదా పూర్తిగా లేకుండా చూసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.