Honda SP 160 Launch Date in India : హోండా నుంచి సరికొత్త టూవీలర్ విడుదలైంది. ఎస్పీ 160 పేరుతో విడుదల చేసిన ఈ మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. యూనికార్న్ 160 మోడల్‌ను పోలి ఉన్నట్లుగా ఉన్న ఈ బైక్‌లో కొన్ని కొత్త ఫీచర్లు చేర్చారు. యూనికార్న్‌తో పోలిస్తే స్టైలిష్ ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్‌గా కనిపించే హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సరికొత్త డిజైన్‌తో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లను ఇందులో అమర్చారు.
Honda SP 160 New Model 2023 : ఈ బైక్‌కు 130 ఎంఎం వైడ్ టైర్లను అమర్చారు. యూనికార్న్ బైక్‌కు ఉన్న.. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్నే ఇందులోనూ వాడారు. బైక్ కన్సోల్ పూర్తిగా డిజిటల్‌గా మార్చేశారు. క్లాక్, ఫ్యుయల్ ఇండికేటర్, గేర్ పొజీషన్, సైడ్ స్టాండ్ ఇండికేటర్లతో పాటు సర్వీస్ ఇండికేటర్, సగటు స్పీడ్, యావరేజ్ మైలేజీ, వినియోగించిన ఇంధనం వంటి వివరాలు సైతం డిజిటల్ కన్సోల్‌లో కనిపించనున్నాయి. ఈ హోండా బైక్.. బజాజ్ పల్సర్ పీ150, యమహా ఎఫ్‌జడ్, సుజుకీ జిక్సర్ 155కి పోటీ ఇవ్వనుంది.
-
Bold is finally here.
— Honda 2 Wheelers India (@honda2wheelerin) August 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Presenting the new SP160- ADVANCED BY NATURE, BOLD BY DESIGN. #Honda #PowerOfDreams #PlayItBold #SP160 pic.twitter.com/7yMl4fStVu
">Bold is finally here.
— Honda 2 Wheelers India (@honda2wheelerin) August 8, 2023
Presenting the new SP160- ADVANCED BY NATURE, BOLD BY DESIGN. #Honda #PowerOfDreams #PlayItBold #SP160 pic.twitter.com/7yMl4fStVuBold is finally here.
— Honda 2 Wheelers India (@honda2wheelerin) August 8, 2023
Presenting the new SP160- ADVANCED BY NATURE, BOLD BY DESIGN. #Honda #PowerOfDreams #PlayItBold #SP160 pic.twitter.com/7yMl4fStVu
బైక్ ఇతర ఫీచర్ల వివరాలు ఇలా ( Honda SP 160 Features )
- పెటల్ డిస్క్ బ్రేకులు
- 594 ఎంఎం లాంగ్ సీటు
- 177 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్
- ఇంజిన్ స్టాప్ స్విచ్
- హజార్డ్ స్విచ్
ఏడేళ్ల వారంటీ.. ఆరు రంగుల్లో..
ఈ బైక్‌కు మూడేళ్ల స్టాండర్డ్ వారంటీ ఉంటుందని, ఏడేళ్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ సౌలభ్యం ఉంటుందని హోండా తెలిపింది. హోండా ఎస్పీ 160 మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అవేంటంటే?
- మాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్
- మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్
- మాట్ డార్క్ బ్లూ మెటాలిక్
- పెరల్ స్పార్టన్ రెడ్
- పెరల్ ఇగ్నీస్ బ్లాక్
- పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే
ఎక్స్ షోరూం దిల్లీ ప్రకారం ఈ బైక్ ధరలు ఇలా ఉన్నాయి.
- Honda SP 160 Price : హోండా ఎస్పీ 160 సింగిల్ డిస్క్ : రూ.1,17,500
- హోండా ఎస్పీ 160 డ్యుయల్ డిస్క్ : రూ.1,21,900