ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఆ రూల్స్​ విషయంలో జాగ్రత్త! - health insurance plans for family premium

health insurance plans: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య బీమా పాలసీ ఒక తప్పనిసరి అవసరంగా మారింది. దీని వల్ల ఆసుపత్రి బిల్లులపై ఖర్చు చేయకుండా సహాయం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలోనూ ఆరోగ్య బీమా పాలసీకి స్థానం కల్పించాలి. అదే సమయంలో పాలసీ తీసుకునేటప్పుడు నిబంధనలూ స్పష్టంగా తెలుసుకోవాలి.

health insurance plans
ఆరోగ్య బీమా పాలసీ
author img

By

Published : May 2, 2022, 1:51 PM IST

health insurance plans: పెరుగుతున్న వైద్య ఖర్చులు, ఆరోగ్య సంక్షోభ సమయంలో ఆరోగ్య బీమా పాలసీ ఒక తప్పనిసరి అవసరంగా మారింది. కష్టార్జితాన్ని ఆసుపత్రి బిల్లులపై ఖర్చు చేయకుండా ఆర్థికంగా ఇది సహాయం చేస్తుంది. అందుకే, ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలోనూ దీనికి స్థానం కల్పించాలి. అదే సమయంలో పాలసీ తీసుకునేటప్పుడు నిబంధనలూ స్పష్టంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా పాలసీ విధించే ఉప పరిమితుల గురించి అర్థం చేసుకోవాలి. అప్పుడే అవసరం వచ్చినప్పుడు మన చేతి నుంచి డబ్బులు పెట్టక్కర్లేదు.

ఆసుపత్రిలో చేరినప్పుడు అయిన మొత్తం ఖర్చును చెల్లించేలా బీమా పాలసీ తీసుకోవాలి. కొన్నిసార్లు బీమా ప్రీమియం ధర అధికంగా ఉండి, భరించలేం అనుకున్న వారు ఉప పరిమితులు ఉండే పాలసీని తీసుకుంటారు. అంటే.. ఏదైనా వ్యాధి లేదా ఖర్చు వచ్చినప్పుడు దానిని ఎంత మేరకు చెల్లించాలో ముందుగానే నిర్ణయిస్తారన్నమాట. బీమా సంస్థ ఆ మేరకే పరిహారాన్ని ఇస్తుంది.

ఉదాహరణకు రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. ఏదైనా వ్యాధి చికిత్స కోసం ఉప పరిమితి రూ.30వేలుగా నిర్ణయించవచ్చు. ఇంతకు మించితే పాలసీదారుడు భరించాల్సిందే. అంబులెన్స్‌ ఛార్జీ పాలసీ మొత్తంలో 1 శాతంగా పేర్కొనవచ్చు. ఏదైనా అనారోగ్యం, చికిత్స, నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఈ పరిమితి ఉంటుంది. ఆసుపత్రిలో చేరే ముందు, చికిత్స పూర్తయ్యాక ఇంటికి వెళ్లినప్పుడు అయిన ఖర్చుల చెల్లింపు పైనా పరిమితి ఉంటుంది. రోజుల సంఖ్య లేదా బీమా మొత్తంలో నిర్ణీత శాతం మేరకు దీనిని పరిమితం చేస్తారు. బీమా సంస్థ బాధ్యతను ఈ ఉప పరిమితులు తగ్గిస్తాయని చెప్పొచ్చు.

  • సాధారణంగా కంటి శుక్లం, సైనస్‌, మూత్రపిండాల్లో రాళ్లు, పైల్స్‌, ప్రసూతి తదితర చికిత్సలపై బీమా సంస్థలు ఈ పరిమితులను విధిస్తుంటాయి. అనారోగ్యాల జాబితా, ఉప పరిమితులు బీమా సంస్థను బట్టి మారుతూ ఉంటుంది. పాలసీదారులు ఈ జాబితాను సరిగా అర్థం చేసుకోవాలి. తెలుసుకొని దానికి తగ్గట్టుగా సిద్ధం కాకపోతే ఆసుపత్రిలో చేరినప్పుడు చేతి నుంచి ఖర్చు, ఇబ్బందులు తప్పవు.
  • గది అద్దె, ఐసీయూ, అంబులెన్స్‌ ఛార్జీలు, ఇంటివద్ద చికిత్స, ఓపీడీ తదితర వాటిపైనా బీమా సంస్థలు ఉప పరిమితుల ఆంక్షలు విధిస్తాయి. గది అద్దె పరిమితి పాలసీ విలువలో 1 శాతం అని పేర్కొంటే.. రూ.5లక్షల పాలసీ ఉన్న వారికి రూ.5వేలు మాత్రమే చెల్లిస్తారు. మీరు ఉంటున్న చోట ఆసుపత్రి గది అద్దె అంతకు మించి ఉంటే.. మీకు ఆర్థిక భారం అవుతుంది. కొన్ని బీమా సంస్థలు షేరింగ్‌, ప్రత్యేక గదులు తీసుకోవడంపైనా నియంత్రణ విధిస్తాయి. ఈ పరిమితి ఉన్నా.. కనీసం 2-3 శాతం మేరకైనా చెల్లించేలా ఉండేలా చూసుకోవాలి.
  • ఆసుపత్రిలో చేరకముందు 30 రోజులు, ఇంటికెళ్లాక 90 రోజుల వరకూ అయిన ఖర్చులను బీమా సంస్థలు చెల్లిస్తాయి. కొన్నిసార్లు ఈ రోజుల సంఖ్యను బీమా సంస్థలు తగ్గించే అవకాశం ఉంది. పాలసీ తీసుకునేటప్పుడు దీన్ని జాగ్రత్తగా గమనించాలి. వీలైనంత వరకూ తక్కువ ఉప పరిమితులు ఉన్న పాలసీలే ఎప్పుడూ ఉత్తమం. కాస్త ప్రీమియం అధికంగా చెల్లించినా.. భవిష్యత్‌లో వచ్చే ఖర్చులతో పోలిస్తే ఇది తక్కువగానే ఉంటుంది.

- టీఏ రామలింగం, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌,
బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ఇదీ చదవండి: ఇంటి నుంచే 'గోల్డ్​ లోన్​' తీసుకోవాలా? ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.