ETV Bharat / business

ఆ యూనివర్సిటీ సూపర్ రిచ్​ - 120+ దేశాల ఎకానమీ కంటే ఎక్కువ ఆదాయం!

Harvard University Wealth : ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీల గురించి, అక్కడ అందించే విద్య గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనిక యూనివర్సిటీలు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓ యూనివర్సిటీ ఆదాయం, 120 దేశాల జీడీపీ కంటే అధికమంటే మీరు నమ్ముతారా? అయితే మీరే చూడండి.

Harvard University endowment
Harvard University wealth
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 2:14 PM IST

Harvard University Wealth : ప్రపంచ ప్రఖాత్య యూనివర్సిటీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకటి. యూఎస్​కు చెందిన ఈ యూనివర్సిటీ ఉన్నత విద్యకే కాదు, గొప్ప సంపదకు కూడా నిలయం.
యూఎస్​లోనే అతిపెద్ద యూనివర్సిటీ అయిన హార్వర్డ్​ వద్ద సుమారుగా 50 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఇది ట్యునీషియా, బహ్రెయిన్, ఐస్​లాంట్ లాంటి ప్రపంచంలోని 120+ దేశాల జీడీపీ కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.

ఇంత ఆదాయం ఎలా?
ప్రపంచ వ్యాప్తంగా హార్వర్డ్​ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యున్నత స్థానాలకు ఎదిగిన వారు, ఏటా భారీ మొత్తంలో విరాళాలు అందిస్తారు. ఇవే కాకుండా, హార్వర్డ్ యూనివర్సిటీ అనేక పెట్టుబడులు కూడా పెడుతుంటుంది. వీటి నుంచి కూడా ఏటా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది.

2023 ఆర్థిక సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీ మొత్తం సంపద 50.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఈ సంపద 50.9 బిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే గతేడాది కంటే ఈ ఏడు యూనివర్సిటీ ఆదాయం స్వల్పంగా తగ్గింది. దీనికి కారణం ఏమిటంటే?

విద్యార్థుల నిరసనలు
ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీలో ఇజ్రాయెల్​- హమాస్ యుద్ధం గురించి విద్యార్థులు నిరసనలు చేపట్టారు. యూనివర్సిటీ వర్గాలు దీనిని హ్యాండిల్ చేసిన విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు కొందరు పూర్వ విద్యార్థులు ఇకపై యూనివర్సిటీకి విరాళాలను నిలిపివేస్తామని, ఇప్పటికే ప్రకటించిన విరాళాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. ఇది యూనివర్సీటీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

హార్వర్డ్ యూనివర్సిటీ 2023లో 8 శాతం ఎండోమెంట్​ (విరాళాలు+ రాబడులు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కేవలం 2.9 శాతం మాత్రమే సేకరించగలగింది. వీటిలో బహుమతులు, విరాళాల వాటాయే 45 శాతం వరకు ఉంది. దీనిని అనుసరించి, యూనివర్సిటీకి వచ్చే ఆదాయంలో పూర్వ విద్యార్థుల నుంచి వచ్చే ఆర్థిక విరాళాలు ఎంత ప్రధానమైనవో సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ నిధులను ఏం చేస్తాయి?

  • యూనివర్సిటీలు తమకు వచ్చే నిధులతో, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాయి. హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థిక నివేదిక ప్రకారం, ఈ ఏడాది ఏకంగా 850 మిలియన్ డాలర్ల మేరకు, విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు.
  • హార్వర్డ్ యూనివర్సిటీ, ఏడాదికి 85,000 డాలర్లు కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన అండర్​ గ్రాడ్యుయేట్ విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయదు.
  • 85,000 - 1,50,000 డాలర్ల మధ్య వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థుల నుంచి కేవలం, వారి గరిష్ఠ ఆదాయంలోని 10 శాతాన్ని మాత్రమే ఫీజుగా వసూలు చేస్తుంది.
  • ప్రస్తుత విద్యా సంవత్సరంలో ట్యూషన్ సహా ఇతర ఫీజుల కోసం 79,450 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల 1,50,000 డాలర్ల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి కచ్చితంగా ఆర్థిక సాయం అవసరం అవుతుంది.

ద్రవ్యోల్బణం కంటే వేగంగా
1975లో హార్వర్డ్​ యూనివర్సిటీ చదువుకోవడానికి ట్యూషన్ ఫీజుగా 5,350 డాలర్లు చెల్లించాల్సి ఉండేది. కానీ నేడు ట్యూషన్​ ఫీజు 30,000 డాలర్లకు పెరిగింది. అంటే ద్రవ్యోల్బణం కంటే విద్యకు అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. వాస్తవానికి హార్వర్డ్​ యూనివర్సిటీలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్య వ్యాపార వస్తువు అయ్యింది. కనుక సామాన్యులకు అందనంత వేగంగా విద్యా ఖర్చులు పెరిగిపోతున్నాయి.

హార్వర్డ్ ప్రెసిడెంట్ జీతం ఎంతో తెలుసా?
2021లో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్​గా పనిచేసిన గే (Gay) అక్షరాల 879,079 డాలర్లు జీతంగా పొందారు. అవుట్​ గోయింగ్ ప్రెసిడెంట్​ లారెన్స్​ ఎస్​ బాకో ఏకంగా 1.3 మిలియన్ డాలర్స్ వేతనం తీసుకున్నారు.

Worlds Richest Universities : ప్రపంచంలోని టాప్​-5 అత్యంత ధనిక విశ్వవిద్యాలయాలు (2021 లెక్కల ప్రకారం)

  • హార్వర్డ్ యూనివర్సిటీ - 53 బిలియన్ డాలర్లు
  • యేల్ యూనివర్సిటీ - 42 బిలియన్ డాలర్లు
  • ది యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్​ సిస్టమ్ ఆఫీస్ - 40 బిలియన్ డాలర్లు
  • స్టాన్​ఫోర్డ్ యూనివర్సిటీ - 38 బిలియన్ డాలర్లు
  • ప్రిన్స్​టన్ యూనివర్సిటీ - 37 బిలియన్ డాలర్లు

ఈ తప్పులు చేశారో అప్పుల ఊబిలో చిక్కుకోవడం గ్యారెంటీ!

డిసెంబర్ డెడ్​లైన్స్​ - గడువులోగా ఈ పనులన్నీ కంప్లీట్​ చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.