ETV Bharat / business

గూగుల్ పే యూజర్లకు ఫ్రీగా రూ.88వేలు.. వెంటనే వాడుకుంటే ఓకే.. లేదంటే..! - గూగుల్ పే రివార్డులు ఎలా

మీకు గూగుల్ పే ఉందా? మీ ఖాతాలోకి ఫ్రీగా రివార్డులు వచ్చాయా? కొంతమందికి రూ.8వేల నుంచి రూ.88వేల వరకు ఫ్రీగా రివార్డులు వచ్చాయి. మరి ఈ రివార్డుల కథేంటి? వెంటనే వాడుకోని వారికి వచ్చిన నష్టమేంటి? చూద్దాం పదండి..

GOOGLE PAY REWARDS
Google Pay glitch free rewards
author img

By

Published : Apr 10, 2023, 3:57 PM IST

గూగుల్ పే యూజర్లకు జాక్​పాట్ తగిలింది! గూగుల్ పేలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల అనేక మంది యూజర్ల ఖాతాల్లోకి భారీగా డబ్బు వచ్చి చేరింది. రివార్డుల రూపంలో యూజర్లకు రూ.8000 నుంచి రూ.88 వేల మధ్య క్రెడిట్ అయినట్లు తెలుస్తోంది. అయితే, వారికి ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సాంకేతిక లోపాన్ని గుర్తించి.. క్రెడిట్ అయిన డబ్బును కంపెనీ వెనక్కి తీసుకుంది. మరికొందరికి మాత్రం ఈ సాంకేతిక లోపం వరమే అయింది!

అమెరికాకు చెందిన మిషాల్ రెహ్మాన్ అనే టెక్ జర్నలిస్ట్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. గూగుల్ పే రెమిటెన్స్ (అంతర్జాతీయ పేమెంట్స్) ఫీచర్​ను పరీక్షించిన తనకు 46 డాలర్లు (రూ.3,800) రివార్డుగా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గూగుల్ పే సాధారణంగానే యూజర్లకు ఇలా రివార్డు ఇస్తోందేమోనని భావించినట్లు పేర్కొన్నారు. తనలా ఇంకెవరికైనా రివార్డులు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు సూచనలు కూడా చేశారు. గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి డీల్స్ ట్యాబ్​లోని రివార్డ్స్ సెక్షన్​ను చెక్ చేసుకోవాలని సూచించారు. సాంకేతిక లోపంలో భాగంగానే ఇలా వచ్చాయేమోనని తొలుత సరదాగా వ్యాఖ్యానించారు.

కొంతమంది రెడిట్ యూజర్లు సైతం గూగుల్ ప్లే సాంకేతిక లోపానికి సంబంధించిన పోస్టులు చేశారు. తన ఖాతాలోకి 1072 డాలర్లు (సుమారు రూ.88వేలు) వచ్చాయని పోస్ట్​లో వివరించారు. ఇంకో యూజర్ తనకు 240 (రూ.20వేలు) వచ్చాయని చెప్పారు. ఈ రివార్డుల వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చాలా మంది తమ ఖాతాలను చెక్ చేసుకొని.. ఇంటర్నెట్​లో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం దీనిపై స్పందించారు. దీనిపై వచ్చిన వార్తా కథనాలను పోస్ట్ చేస్తూ.. 'నోటీస్' అనే ఒక్క పదాన్ని ట్వీట్ చేశారు.

GOOGLE PAY REWARDS
గూగుల్ పేలో వచ్చిన రివార్డు స్క్రీన్​షాట్ షేర్ చేసిన మిషాల్

దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టిన గూగుల్ పే.. రివార్డులను వెనక్కి తీసుకుంది. ఎవరెవరికి ఎంతెంత క్రెడిట్ అయిందో లెక్కేసి.. రివార్డును ఉపసంహరించుకుంది. అయితే, వచ్చిన డబ్బును అప్పటికే వేరే ఖాతాలకు బదిలీ చేసిన వ్యక్తులకు, ఖర్చు చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేసింది. ఆ డబ్బు సదరు యూజర్లదేనని పేర్కొంది. వారిపై చర్యలేమీ తీసుకోమని తెలిపింది. ఈ మేరకు సంబంధిత యూజర్లకు ఈమెయిల్స్ పంపించినట్లు తెలుస్తోంది. తనకు వచ్చిన మెయిల్​ను జర్నలిస్ట్ మిషాల్ రెహ్మాన్ తన ట్విట్టర్​ ఖాతాలో షేర్ చేశారు.

GOOGLE PAY REWARDS
మెయిల్ స్క్రీన్​షాట్ షేర్ చేసిన మిషాల్ రెహ్మాన్

గూగుల్ పే మొబైల్ పేమెంట్స్ యాప్ మూడు దేశాల్లో అందుబాటులో ఉంది. తొలుత భారత్​లో దీన్ని లాంచ్ చేయగా.. ఆ తర్వాత సింగపూర్, అమెరికా దేశాల్లో ఈ సేవలను ప్రారంభించింది గూగుల్. భారత్​లో యూపీఐ ద్వారా సేవలు అందిస్తున్న గూగుల్ పే.. అమెరికాలో వాలెట్ సర్వీసులు సైతం ప్రవేశపెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.