Gold Rate Today: దేశంలో బంగారం ధర కాస్త తగ్గగా.. వెండి ధర మళ్లీ పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.61 తగ్గి.. ప్రస్తుతం రూ.59,339 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 300 పెరిగి.. ప్రస్తుతం రూ.68,400 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.59,339 గా ఉంది. కిలో వెండి ధర రూ.68,400 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,339 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,400గా ఉంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,339 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,400 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.59,339 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,400గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1900.60 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.72 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.20,47,745పలుకుతుండగా.. ఇథీరియం, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మరికొన్నింటి ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.20,47,745 |
ఇథీరియం | రూ.1,40,758 |
టెథర్ | రూ.82.84 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,788 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.34 |
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల మధ్య బుధవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 440 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం 58,340 వద్ద కదలాడుతోంది. మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల్లో ఉంది. 109పాయింట్ల లాభంతో 17,152 వద్ద సూచీ ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో రిలయన్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. సన్‌ఫార్మా, టాటాస్టీల్, టాటా మోటర్స్, టైటాన్, మారుతి, టీసీఎస్, కొటాక్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, యాక్సిక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎన్టీపీసీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం విలువ
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరిగింది. ప్రస్తుతం ట్రేడింగ్‌లో నాలుగు పైసలు పెరిగి 82.33 వద్ద ఉంది.