Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.310 పెరిగి రూ.57,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,066 తగ్గి.. ప్రస్తుతం రూ.66,140 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.57,700గా ఉంది. కిలో వెండి ధర రూ.66,140 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,140గా ఉంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,700 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,140 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,700 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.66,140గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1830.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.03 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.19,32,171పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.19,32,171 |
ఇథీరియం | రూ.1,34,892 |
టెథర్ | రూ.82.44 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,037 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.45 |
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 305.05 పాయింట్లు లాభపడి 59,267 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 17,399 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, టీసీఎస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ, మారుతీ సిమెంట్, టైటాన్, రిలయన్స్, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందుస్తాన్ యూనీలివర్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు నష్టాలతో ఊగిసలాడుతున్నాయి.
రూపాయి మారకం విలువ
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పెరిగి 82.36 వద్ద కొనసాగుతోంది.