Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.140 మేర పెరిగి ప్రస్తుతం రూ.56,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,025 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.56,160గా ఉంది. కిలో వెండి ధర రూ.70,025 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,025గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,160 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,025వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,160 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,025గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,797.55 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.75 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,97,441 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.13,97,441 |
ఇథీరియం | రూ.1,01,007 |
టెథర్ | రూ.82.81 |
బైనాన్స్ కాయిన్ | రూ.20,227 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.82 |
స్టాక్ మార్కెట్లు:
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో 60,291 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 17,933 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, విప్రో, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, మారుతీ, సన్ ఫార్మా షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.
రూపాయి విలువ:
డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు తగ్గి ప్రస్తుతం రూ. 82.79 వద్ద ఉంది.
ఇవీ చదవండి:
2022 నేర్పిన ఆర్థిక పాఠాలేంటి?.. కొత్త ఏడాదిలో ఎలా ముందుకెళ్లాలి?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆ దేశాల నుంచే అధిక ముప్పు : నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్