Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,117గా ఉండగా.. బుధవారం రూ.61,132గా ఉంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.76,025 ఉండగా.. రూ.375 పెరిగి రూ.76,400కు చేరుకుంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,132గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,400గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,132గా ఉంది. కిలో వెండి ధర రూ.76,400కు చేరుకుంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,132గా ఉంది. కిలో వెండి ధర రూ.76,400గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,132గా ఉంది. కిలో వెండి ధర రూ.76,400కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి గమనించవలెను.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1963 డాలర్లుగా ఉండగా.. బుధవారం స్పాట్ గోల్డ్ ధర 1963 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 24.61 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.23,89,876 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, యూఎస్డీ కాయిన్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, బైనాన్స్ కాయిన్ మాత్రం నష్టాల్లో ఉంది. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,89,876 |
ఇథీరియం | రూ.1,51,958 |
టెథర్ | రూ. 81.87 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,440 |
యూఎస్డీ కాయిన్ | రూ. 81.92 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి రూ.81.95 వద్ద స్థిరపడింది.
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today : విదేశీ తాజా నిధుల ప్రవాహం, యూఏస్ మార్కెట్లలో దూకుడుతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 455 పాయింట్లు లాభపడి 66,810 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు వృద్ధి చెంది 19,802 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఐటీసీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు :
ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ స్టాక్‌లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.