Gold Rate Today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.61,190గా ఉంది. మరోవైపు వెండి ధర పెరిగింది. బుధవారంతో పోల్చితే కిలో వెండి ధర రూ.495 పెరిగి రూ.78,050 పలుకుతోంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,190గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.78,050గా కొనసాగుతోంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,190గా ఉంది. కిలో వెండి ధర రూ.78,050గా ఉంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,190గా ఉంది. కిలో వెండి ధర రూ.78,050 పలుకుతోంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,190గా ఉంది. కిలో వెండి ధర రూ.78,050గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : శనివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1976 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం అదే రేటు వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు సిల్వర్ ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 25.05 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,56,152 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, బైనాన్స్ కాయిన్, యూఎస్డీ కాయిన్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,56,152 |
ఇథీరియం | రూ.1,55,374 |
టెథర్ | రూ.82.4 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,796 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.4 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.92గా ఉంది. డీజిల్ ధర రూ.98.78గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే 6 పైసలు పెరిగి రూ.82.02 వద్ద కొనసాగుతోంది.
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 194 పాయింట్లు నష్టపోయి 66,903 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 40.30 పాయింట్లు క్షీణించి 19,793 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
రిలయన్స్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐఎన్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ కంపెనీల్ల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు :
యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, టైటాన్ మోటార్స్, టైటాన్, నెస్లే, ఎల్ అండ్ టీ, టీసీఎస్ సహ మరి కొన్ని ప్రముఖ కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.