Gold Rate Today 25th August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న వెండి ధరలకు బ్రేక్ పడింది. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,050గా ఉండగా.. వరలక్ష్మీ వ్రతం వేళ శుక్రవారం కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు గురువారం కిలో వెండి ధర రూ.75,825గా ఉండగా.. శుక్రవారం రూ.455 తగ్గి రూ.75,370కి చేరింది.
- Gold Price In Hyderabad 25th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,370గా ఉంది.
- Gold Price In Vijayawada 25th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.75,370కి చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 25th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.75,370గా ఉంది.
- Gold Price In Proddatur 25th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.75,370కి చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 25th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1922 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం ధర 1915 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.05 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 25th August 2023 : బిట్‌కాయిన్, ఇథీరియం మినహా శుక్రవారం మిగిలిన ప్రధాన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,55,632 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. టెథర్, బైనాన్స్ కాయిన్, యూఎస్డీ కాయిన్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,55,632 |
ఇథీరియం | రూ.1,36,603 |
టెథర్ | రూ.82.63 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,883 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.67 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today 25th August 2023 : దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజులు లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌ను నష్టాలతో ఆరంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల్లో ప్రతికూలతలు దీనికి కారణం. దాదాపు ప్రధాన స్టాక్‌లన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 65,096 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 56 పాయింట్ల నష్టంతో 19,331 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
జజాజ్ ఫైనాన్స్, జియోఫిన్, రిలయన్స్, టాటా మోటార్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు..
టైటాన్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, విప్రో, భారతీఎయిర్‌టెల్, ఇన్ఫీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్‌మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్‌లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ!
Rupee Open 25th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించి రూ.82.56 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 25th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.67గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
క్రూడ్ ఆయిల్ రేట్..!
Crude Oil Rates Today 25th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.20 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 83.53 డాలర్లుగా ఉంది.
UPI Lite Limit Increase : నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్.. ఒకేసారి ఎంత చెల్లించవచ్చంటే..
How to Check Income Tax Refund Status : మీ 'ఐటీ రిఫండ్ స్టేటస్'.. ఈజీగా ఇలా తెలుసుకోండి!
Service Charge in Restaurants : రెస్టారెంట్లో సర్వీస్ ఛార్జ్ అడుగుతున్నారా..? కేంద్రం గుడ్ న్యూస్