ETV Bharat / business

చైనాకు ఫాక్స్​కాన్​ షాక్​.. భారత్​లోనే ఐఫోన్ల తయారీ! అదే కారణమట!! - భారత్​లో భారీగా పెట్టుబడులు పెట్టనున్న ఫాక్స్​కాన్

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. యాపిల్‌ ఫోన్లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ తమ ఐఫోన్‌ల తయారీ యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించింది. బెంగళూరులో సుమారు 700 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.

foxconn investment in india
భారత్​లో ఫాక్స్​కాన్​ పెట్టుబడులు
author img

By

Published : Mar 3, 2023, 4:58 PM IST

తైవాన్ విషయంలో చైనా నిరంకుశ ధోరణిపై అమెరిగా ఆగ్రహంతో ఉండడం, డ్రాగన్‌కు చెందిన నిఘా బెలూన్‌ను అమెరికాలో కూల్చివేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. కరోనా తర్వాత పలు దేశాలు తయారీ సంస్థలకు రాచబాట వేస్తున్న వేళ.. చైనాలోని తయారీ రంగ పరిశ్రమలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. ఆర్థికంగా వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్న భారత్‌ సహా వియత్నాం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని 300 ఎకరాల్లో 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఫాక్స్‌కాన్‌కు ఇదే అతిపెద్ద పెట్టుబడి. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలో పెద్ద ఎత్తున ఐఫోన్‌లతోపాటు హ్యాండ్‌సెట్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యూనిట్‌ ద్వారా సుమారు లక్ష మందికి ఉద్యోగాలు దొరుకుతాయని తెలిపింది.

ఫాక్స్‌కాన్‌ బాటలో మరికొన్ని కంపెనీలు.. చైనా నుంచి బయటపడాలని చూస్తున్నాయి. భారత్, వియాత్నం వంటి దేశాలకు తమ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాలని యాపిల్‌తో పాటు ఇతర అమెరికా కంపెనీలు చైనాలో ఉన్న తమ సరఫరాదారులకు సూచిస్తున్నాయి. ఒకేచోట తయారీ కేంద్రాలు కేంద్రీకృతం కావడం వల్ల విపత్తుల సమయాల్లో సరఫరా ఇబ్బందులు తలెత్తుతాయనే అంచనాకు వచ్చాయి. ఇప్పటికే కరోనా సమయంలో ఈ సమస్యను ఎదుర్కొన్నాయి.

చైనాలోని తన ప్లాంట్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ.. 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇప్పటికే యాపిల్ ఫోన్ల తయారీ దారులైన ఫాక్స్‌కాన్, పెగట్రాన్, విస్ట్రాన్.. భారత్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారీదారుగా ఉన్న డ్రాగన్‌ తన హోదాను కోల్పోయే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.

భారత్​ వైపు మొగ్గు..
చైనాలో కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఐఫోన్‌ తయారీలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఫాక్స్‌కాన్‌ భారత్‌లో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తోంది. ఇప్పటికే లేటెస్ట్‌ ఐఫోన్‌-14 మోడళ్ల తయారీని చెన్నైలోని ప్లాంటులో పెంచింది. చైనాలో తరచూ ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తి ఐఫోన్‌ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాపై ఎక్కువగా ఆధారపడడాన్ని ఫాక్స్​కాన్ తగ్గించుకుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.