Home Loan Key Factors in Telugu : సొంతిల్లు కలిగి ఉండటం ప్రతీ ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు మెజారిటీ జనాలు ఎంచుకునే ఆప్షన్.. "హోమ్ లోన్". మీరు కూడా కొత్తగా ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? హోమ్ లోన్(Home Loan) తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మీరు పరిశీలించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ 7 అంశాలు తెలుసుకోవడం మంచిదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.
ఇంటి రుణానికి అవసరమైన పత్రాలు : హోమ్ లోన్ పొందడానికి నెలవారీగా మీరు పొందే ఆదాయం ఆధారాలకు సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించాలి. ఉద్యోగస్తులయితే.. మీరు పని చేస్తున్న సంస్థలో జాయినింగ్ లెటర్, గత మూడు నెలల పే స్లిప్‌లు, బ్యాంకులో మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఫామ్ 26ఏఎస్ సమర్పించాలి.
లోన్ టెన్యూర్ : మీరు తీసుకునే హోమ్ లోన్ చెల్లింపునకు టెన్యూర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ రుణ గడువు ఆధారంగానే మీ నెలవారీ ఈఎంఐ ఖరారవుతుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. మీరు 9% వడ్డీరేటుపై 15 ఏండ్ల టెన్యూర్ కింద రూ.10 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం.. అప్పుడు మీ ఈఎంఐ సుమారు రూ. 10,143. అదే మీ టెన్యూర్ 20 సంవత్సరాలు ఉంటే ఈఎంఐ రూ. 8,997 అవుతుంది.
ఈఎంఐ సెట్ చేసుకోవడం : గృహ రుణం తీసుకుంటే మంత్లీ ఈఎంఐ చెల్లించడానికి వీలుగా మీరు రెగ్యులర్ ఇన్‌కమ్‌పై దృష్టి పెట్టాలి. మీరు లోన్ ఈజీగా చెల్లించడానికి.. వీలుగా తక్కువ మొత్తంలో ఈఎంఐ ఖరారు చేసుకోవడం బెటర్. ఎక్కువగా ఉంటే.. ఆ మొత్తం చెల్లించలేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.
హోమ్ లోన్ EMI భారాన్ని - గడువుకన్నా ముందే తీర్చుకోండిలా!
రుణ మొత్తం కీలకం : మీరు తీసుకునే లోన్ మొత్తం విలువ కూడా కీలకం. మీరు తక్కువ మొత్తంలో లోన్ తీసుకుంటే ఈజీగా తిరిగి చెల్లించవచ్చు. పెద్ద మొత్తంలో హోమ్ లోన్ తీసుకుంటే చెల్లించడానికి చాలా కాలం పడుతుంది.
ఏది ఫస్ట్? : కొన్ని బ్యాంకులు మీకు హోమ్ లోన్‌పై ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ ఆప్షన్ ఇస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ముందు గృహ రుణం పొందిన తర్వాత.. అదే బడ్జెట్ లోపల ఇల్లు వెతుక్కోవడం బెటర్. అలాగే లోన్ గ్రహీతలుగా మీరు మీ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇల్లు ఎంచుకుంటే.. బ్యాంకులు తదనుగుణంగా రుణ పరపతి కల్పిస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి.
హోమ్ లోన్ అర్హతలు : ఏ బ్యాంకైనా లోన్ ఇవ్వాలనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తికి గల అర్హతలను చెక్ చేస్తుంది. కాబట్టి రుణ గ్రహీత తన వయస్సు ఆధారంగా బ్యాంకు వెబ్‌సైట్‌లో లోన్ పరిమితి చెక్ చేసుకుని.. ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది.
ప్రీ పేమెంట్ చార్జీలు : హోమ్ లోన్ తీసుకుంటున్నప్పుడు బ్యాంకుకు.. రుణ గ్రహీత ప్రీ పేమెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే బ్యాంకర్‌తో ప్రీ పేమెంట్ చార్జీల విషయమై చర్చించుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
బ్యాంకు లోన్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి!
బ్యాంక్ అదిరిపోయే శుభవార్త - హోమ్ లోన్ తీసుకోండి - 12 EMIలు కట్టక్కర్లేదు!