ETV Bharat / business

EPF Interest Earning : ఉద్యోగం మానేసిన తరువాత కూడా.. ఈపీఎఫ్​ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా?

EPF Interest Earning In Telugu : ఉద్యోగం చేసే ప్ర‌తి ఒక్క‌రికీ దాదాపుగా ఉద్యోగ భ‌విష్య నిధి (EPF) ఖాతా ఉంటుంది. మ‌న వేత‌నంలో నుంచి ప్ర‌తి నెలా 12 శాతం అందులో జ‌మ అవుతుంది. ఇంతే మొత్తం సంస్థ యజమాని కూడా అందులో జ‌మ చేస్తారు. ఈ న‌గ‌దుపై వడ్డీ జనరేట్​ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడో ప్రశ్న? ఒక‌ వేళ మీరు ఉద్యోగం మానేసినా.. ఈపీఎఫ్ ఖాతాలో డ‌బ్బు జ‌మ చేయ‌కున్నా.. వ‌డ్డీ వ‌స్తుందా?

EPF Interest rate 2023
EPF Interest Earning
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 7:06 PM IST

EPF Interest Earning : ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సాధారణంగా ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాను కలిగి ఉంటారు. దీనికి ప్రతి నెలా వారి ప్రాథమిక జీతంలో నుంచి 12% జమ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్​లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా ఈపీఎఫ్ పథకంలో మదుపు చేయడం ద్వారా​ పదవీ విరమణ తరువాత.. ఉద్యోగులకు ఒక భవిష్య నిధి (కార్పస్)​ ఏర్పడుతుంది. అందువల్ల ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్​ స్కీమ్ గురించి, దాని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పదవీ విరమణ తర్వాత లేదా మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి నిష్క్రమించిన తర్వాత.. ఎంత కాలం డబ్బును EPF ఖాతాలో ఉంచవచ్చు? ఖాతాలో న‌గ‌దు జమ కాకున్నా.. అందులో ఉన్న సొమ్ముపై వ‌డ్డీ వ‌స్తుందా? ఉద్యోగం లేదా కంపెనీ మారిన త‌ర్వాత అదే ఖాతాను కొన‌సాగించాలా? లేక కొత్త‌ది ఓపెన్ చేయాలా? ఇలాంటి ప్ర‌శ్న‌లు మీకూ ఎదుర‌య్యే ఉంటాయి. వీటన్నింటికీ సమాధానం ఇక్కడ ఉంది.

1. ఉద్యోగం మానేసిన తర్వాత ఎంత కాలం EPF ఖాతాలో డబ్బు ఉంచవచ్చు?
How Long Can keep money in EPF after leaving job : ఒక ఉద్యోగి జీతం నుంచి నెలవారీగా ఈపీఎఫ్​ ఖాతాకు డబ్బు జమ అవుతున్నంత కాలం అది యాక్టివ్​గా ఉంటుంది. ఒక వేళ మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి, రెండు నెల‌ల్లోపు మ‌రో ఉద్యోగంలో చేర‌ని ప‌క్షంలో ఈపీఎఫ్​ ఖాతాను మూసేయ‌వ‌చ్చు. లేదంటే పదవీ విరమణ చేసిన తరువాత ఈపీఎఫ్​ ఖాతాను క్లోజ్​ చేయవచ్చు. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ ఈపీఎఫ్ ఖాతాలోని 100% న‌గ‌దును ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది.

2017 జులై 24న కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఓ పత్రికా ప్రకటన చేసింది. దీని ప్రకారం 2016 నవంబర్​ 11 నోటిఫికేషన్​ ద్వారా ఏయే ఈఫీఎఫ్​ ఖాతాలు ఇన్​అపరేటివ్​ అవుతాయో స్పష్టం చేసింది. ఈ ప్రకటన ప్రకారం, ఒక వ్యక్తి వయస్సు 58 సంవత్సరాలు దాటిన తరువాత ఆటోమేటిక్​గా అతని ఈపీఎఫ్​ ఖాతాను నిలిపివేస్తారు. అంట్​ ఇన్​ఆపరేటివ్ అయిపోతుంది. అలాగే ఒక ఉద్యోగి 55 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయితే, అతని ఈపీఎఫ్ అకౌంట్​ మరో 36 నెలలపాటు యాక్టివ్​గా ఉంటుంది. ఆ తరువాత ఆటోమేటిక్​గా అది కూడా ఇన్​ఆపరేటివ్ అయిపోతుంది.

ఒక వ్యక్తి పదవీ విరమణ వయస్సు కంటే ముందే ఉద్యోగం చేయడం మానేస్తే.. EPF ఖాతా చందాలు ఆగిపోయిన నెల నుంచి సరిగ్గా మూడు సంవత్సరాల పాటు అతని ఈపీఎఫ్​ ఖాతా పని చేస్తుంది. ఆ తర్వాత పదవీ విరమణ వయస్సుతో సంబంధం లేకుండా ఆ ఈపీఎఫ్​ ఖాతా ఇన్​యాక్టివ్​ అయిపోతుంది.

ఒక వేళ ఉద్యోగి శాశ్వతంగా విదేశాలకు వెళ్లి, 36 నెలల్లోగా ఈపీఎఫ్​ ఖాతాలోని సొమ్మును విత్​డ్రా చేయకపోతే.. అతని ఖాతాను కూడా నిలిపివేయడం జరుగుతుంది.

2. మూడేళ్లు గడిచినా డబ్బులు తీసుకోకపోతే ఏమవుతుంది?
EPF Withdrawal Time : ఉద్యోగం మానేసిన నాటి నుంచి 3 సంవత్సరాలలోపు EPF ఖాతాలోని డబ్బును విత్‌డ్రా చేయకపోతే.. అది పనిచేయని ఖాతాగా (ఇన్ యాక్టివ్ అకౌంట్‌) మారుతుంది. 7 సంవత్సరాల పాటు దానిని క్లెయిమ్ చేయకుండా ఉంటే.. అందులోని మొత్తం సొమ్మును సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేస్తారు. అక్కడి నుంచి మరో 25 ఏళ్లలో కూడా ఎవరూ ఆ ఈపీఎఫ్​ ఖాతా డబ్బులను క్లెయిమ్​ చేయకపోతే.. కేంద్ర ప్రభుత్వమే ఆ సొమ్మును స్వాధీనం చేసుకుంటుంది.

3. EPF ఖాతాలో ఉన్న డబ్బుకు వడ్డీ వస్తుందా ?
EPF Interest Credit : ఈపీఎఫ్​ ఖాతాలో ఉంచిన డబ్బుపై వడ్డీ వ‌స్తూనే ఉంటుంది. అయితే వ‌డ్డీ రేటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్ర‌కారం ఉంటుంది. ఖాతా యాక్టివ్​గా, ఆపరేటివ్‌గా ఉన్నంత వరకు వడ్డీ జ‌మ అవుతుంది. EPF స్కీమ్, 1952లోని పేరా 72(6) ప్రకారం ఆ ఖాతా ఇన్ ఆప‌రేటివ్ అయితే.. పేరా 60 (6) ప్రకారం దానికి వ‌డ్డీ జ‌మ కాదు.

4. వ‌డ్డీ పై ప‌న్ను విధింపు ఉంటుందా ?
EPF Tax Rules : కొన్ని నిర్దిష్ట ప‌రిస్థితుల్లో మిన‌హా.. EPF నుంచి వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ఖాతాకు యాక్టివ్ కంట్రిబ్యూషన్‌లు ఉంటే కచ్చితంగా పన్ను మినహాయింపు ఉంటుంది. లేని ప‌క్షంలో వ‌డ్డీపై ప‌న్ను విధిస్తారు. సభ్యుడు ఏ పన్ను స్లాబ్​లోకి వస్తే, దానికి అనుగుణంగా.. అతని ఆదాయంపై పన్ను విధిస్తారు.

4. పదవీ విరమణ తర్వాత ప‌నిచేస్తే EPF అకౌంట్ కొన‌సాగించ‌వ‌చ్చా ?
Can EPF Account Be Continued After Retirement : ఒక వ్యక్తి వయస్సు 58 సంవత్సరాలు దాటితే అతను ఇంక ఏ మాత్రం ఎంప్లాయీ పెన్షన్​ స్కీమ్​కు (EPS) అర్హుడు కాదు. కానీ పదవీ విరమణ తర్వాత కూాడ, సదరు ఉద్యోగి అదే సంస్థలో లేదా మరొక సంస్థలో చేరి పనిచేస్తున్నట్లు అయితే.. EPFలో న‌గ‌దు జ‌మ అవుతుంది. ఉద్యోగితో పాటు కంపెనీ య‌జ‌మాని అందించే కంట్రిబ్యూషన్​ కూడా అందులో జ‌మ అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.