ETV Bharat / business

E bike insurance : ఈ-బైక్​​ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ యాడ్​-ఆన్స్ తప్పనిసరి!

E bike insurance : మీరు కొత్తగా ఎలక్ట్రిక్​ టూవీలర్​ తీసుకున్నారా? మంచి ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకుందామని అనుకుంటున్నారా? మంచిదే.. అది మీకు ఆపద కాలంలో రక్షణ కల్పిస్తుంది. అయితే ముందుగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటో పూర్తి కథనంలో చూడండి.

e bike insurance add-ons and their benefits
e bike insurance benefits
author img

By

Published : Jun 9, 2023, 1:01 PM IST

EV insurance India : మనలో చాలా మందికి కొత్త బైక్​ కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. అందుకోసం చాలా ఖర్చు పెట్టి కలల బైక్​ను సొంతం చేసుకుంటాం. కానీ దానికి సరైన ఇన్సూరెన్స్ చేసే విషయంలో మాత్రం అలసత్వం చూపిస్తాం. ఇది సరికాదు. సాధారణంగా పెట్రోల్​ బైక్​కు అయినా, ఎలక్ట్రకిల్​ టూ వీలర్​కు అయినా ఇన్సూరెన్స్​ తీసుకునే విధానం ఒకలానే ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్​ ద్విచక్రవాహనం కోసం తీసుకునే బీమా పాలసీ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

e two wheeler insurance add-ons :
మీరు కొత్తగా ఎలక్ట్రికల్​ టూవీలర్​ తీసుకున్నట్లయితే కచ్చితంగా 5 సంవత్సరాల కాలపరిమితిగల థర్డ్​పార్టీ ఇన్సూరెన్స్​ను తీసుకోండి. దీనితో పాటు మరికొన్ని యాడ్​-ఆన్​లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే

  1. జీరో డిప్రిసియేషన్​ కవర్​
  2. రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్​

కొన్ని బీమా సంస్థలు బ్యాటరీ రక్షణ కోసం​ కవరేజీని కూడా కల్పిస్తాయి. మీకు అవకాశం ఉంటే దానిని కూడా తీసుకోండి. పొరపాటున బ్యాటరీలోకి నీళ్లు చేరి, అది పాడైపోయినప్పుడు ఈ యాడ్​-ఆన్​ మీకు పరిహారం లభించేలా చూస్తుంది. ప్రస్తుతం చాలా బీమా సంస్థలు పోటీపడి మరీ ఎలక్ట్రికల్​ వాహనాలకు ఇన్సూరెన్స్​ కల్పిస్తున్నాయి. కనుక మీరు మీ బైక్​కు బీమా చేయాలనుకున్నప్పుడు మంచి బీమా కవరేజ్​ ఉన్న పాలసీని తీసుకోవడం ఉత్తమం.

ద్విచక్ర వాహనం కోసం బీమా పాలసీని తీసుకునేటప్పుడు ఆ పాలసీ కవర్​ వేటికి వర్తిస్తుందో పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా థర్ట్​పార్టీ పాలసీలు, కాంప్రహెన్సివ్​ పాలసీలను సమగ్రంగా పరిశీలించి, మీకు అనువైనది తీసుకోవాలి. మన దేశంలోని రద్దీ రోడ్లపై వాహనాలు నడపాలంటే, కచ్చితంగా ఇన్సూరెన్స్​ తీసుకొనితీరాలి. అదే మీకు ఆపద వేళ రక్షణ కల్పిస్తుంది. ఒక వేళ బీమా చేయకుండా బండి నడిపితే, అది చట్ట విరుద్ధమైన పని అవుతుంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం థర్డ్​పార్టీ ఇన్సూరెన్స్​ను తప్పనిసరి చేసింది. థర్ట్​ పార్టీ ​పాలసీ కేవలం అవతల వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. కాంప్రహెన్సివ్​ పాలసీ మీ బైక్​కు వర్తిస్తుంది. ఈ కాంప్రహెన్సివ్​ పాలసీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో సరైనది ఎంచుకోవాలి.

టూ వీలర్​ పాలసీ వల్ల కలిగే లాభాలు :
Benefits of two wheeler Insurance policy
1. ప్రమాదవశాస్తు యాక్సిడెంట్​ జరిగినప్పుడు, బైక్​ రిపేర్​కు అయ్యే ఖర్చు బీమా సంస్థ భరిస్తుంది.

2. ప్రమాదం జరిగినప్పుడు అవతల వ్యక్తి గాయపడే అవకాశం ఉంది. అప్పుడు కూడా బీమా పాలసీ కొంత వరకు నష్టాన్ని పూరిస్తుంది.

3. ఒక వేళ మన బైక్​ను ఎవరైనా దొంగలించినట్లయితే, ముందుగా మనం పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తరువాత బైక్​ దొరకకపోయినప్పటికీ ఇన్సూరెన్స్ ఉంది కనుక బైక్​ ధర మొత్తాన్ని మనం పొందడానికి వీలవుతుంది.

4. వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చి, బైక్​ చెడిపోయినా ఇన్సూరెన్స్​ కవర్​ అవుతుంది.

5. టూ వీలర్​ పాలసీ తీసుకుని ఏడాదిలోపు ఎలాంటి ఇన్సూరెన్స్​ క్లెయిమ్ చేయనప్పుడు.. కొన్ని బీమా సంస్థలు ఇన్సూరెన్స్​ పాలసీపై బోనస్​ ఇస్తాయి.

6. మరికొన్ని బీమా పాలసీలు అయితే క్యాష్​లెస్​ సెటిల్​మెంట్​ సౌకర్యాన్ని కూడా కల్పిస్తాయి.

7. కొన్ని బీమా సంస్థలు పాలసీ కింద పర్సనల్​ యాక్సిడెంట్​ కవరేజ్​ను కూడా అందిస్తాయి. ముఖ్యంగా బైక్​ను నడిపే వ్యక్తికి దెబ్బలు తగిలినప్పుడు ఈ పాలసీ కవరేజ్​ లభిస్తుంది.

టూ వీలర్​ ఈవీ ఇన్సూరెన్స్​ పాలసీని ఆన్​లైన్​లోనూ, ఆఫ్​లైన్​లోనూ తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మంచి బైక్​ బీమా పాలసీని తీసుకోండి. ఇప్పటికే ఇన్సూరెన్స్​ ఉంటే, సకాలంలో రెన్యువల్​ చేసుకోవడం మరిచిపోకండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.