Flat Vs Duplex House Which Is Better: సొంత ఇల్లు అనేది ప్రతి వ్యక్తి కల. అయితే.. సొంతింటి విషయంలో చాలా మంది చాలా రకాలుగా కలలు కంటుంటారు. చిన్నదో పెద్దదో తమ స్థాయికి తగినట్టుగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు. సొంతింటి కలను నేరవేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. వారివారి స్థాయిని బట్టి సొంత ఇల్లు కట్టుకోవడమో.. ఫ్లాట్ తీసుకోవడమో చేస్తుంటారు. అయితే.. డ్యూప్లెక్స్ హౌస్ కట్టాలా..? ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలా..? అనేది చాలామంది తేల్చుకోలేకపోతుంటారు. రోజుల కొద్దీ ఆ ఆలోచనల్లోంచి బయటికి రాలేక సతమతమవుతుంటారు. ఇంతకీ డ్యూప్లెక్స్ హౌస్ కడితే మంచిదా..?, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే మంచిదా..?, డ్యూప్లెక్స్ హౌస్‌లు ఎన్ని రకాలు ఉంటాయి..?, డ్యూప్లెక్స్ ఇంట్లో నివసిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలను ఈ స్టోరీలో విపులంగా చర్చించుకుందాం.
డ్యూప్లెక్స్ హౌస్ అంటే ఏమిటి..?
What is Duplex House: డ్యూప్లెక్స్ హౌస్ అంటే.. రెండు లివింగ్ యూనిట్లు ఒకదానికొకటి జతచేయబడిన ఒక రకమైన నివాస గృహం. ఈ గృహం రెండు అంతస్తులను కలిగి ఉంటుంది. అందులో ఒకటి గ్రౌండ్ ఫ్లోర్‌గా, మరొకటి మొదటి అంతస్తుగా ఉంటుంది. డ్యూప్లెక్స్ ఇంట్లో ఒక వంటగదితో పాటు ఒకే భోజనాల గది ఉంటుంది. ఇల్లు అడ్డంగా లేదా నిలువుగా రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. డ్యూప్లెక్స్ హౌస్ అంతస్తులు మెట్ల ద్వారా అనుసంధానించడి ఉంటుంది. ఈ గృహం పెద్ద కుటుంబాలకు బాగా అనుకూలంగా ఉంటుంది.
డ్యూప్లెక్స్ ఇళ్ళు ఎన్ని రకాలు
How many types of duplex houses: డిజైన్, ప్లాన్‌లను బట్టి స్థూలంగా మూడు రకాల డ్యూప్లెక్స్ హౌస్‌లు ఉంటాయి.
- స్టాండర్డ్ డ్యూప్లెక్స్ హౌస్
- గ్రౌండ్ డ్యూప్లెక్స్ హౌస్
- తక్కువ ఎత్తులో ఉండే డ్యూప్లెక్స్ హౌస్
డ్యూప్లెక్స్ హౌస్ ప్రయోజనాలు..
Advantages of duplex house: డ్యూప్లెక్స్ ఇంట్లో నివసించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.. అప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ రెండు అంశాలను క్షుణంగా పరిశీలిస్తే..
- డ్యూప్లెక్స్ ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తి వివిధ రకాల పన్ను ప్రయోజనాలను పొందుతాడు.
- ఇంటి యజమాని ఒక వైపు తాను నివసించడానికి, మిగిలిన సగం అద్దెకు ఇవ్వడానికి అనువుగా ఉంటుంది.
- దీంతో ఇల్లు కూడా అదనపు ఆదాయ వనరుగా మారుతుంది.
- ఇంటి యజమాని, అద్దెదారులు ఇద్దరికీ పలు రకాల సౌకర్యాలను పొందడం సులభంగా ఉంటుంది.
- డ్యూప్లెక్స్ హౌస్ వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. దీనిని కార్యాలయంగా కూడా ఉపయోగించవచ్చు.
- రెండు అంతస్తులలో ఒకటి ఆఫీసు కోసం మరొకటి వసతి కోసం ఉపయోగించవచ్చు.
- డ్యూప్లెక్స్ ఇల్లు సాధారణంగా చాలా విశాలంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి.
- ఉమ్మడి కుటుంబానికి డ్యూప్లెక్స్ ఇల్లు అనువుగా ఉంటుంది.
ఫ్లాట్ అంటే ఏమిటి..?
What is flat?: ఒక సగటు ఉద్యోగి ఆర్థికంగా కాస్త కుదురుకున్నాక సర్వ సాధారణంగా ఓ ఇల్లు కొనాలని ఆశపడుతాడు. అయితే.. అది ఇండిపెండెంట్ ఇల్లా, ఫ్లాటా? అన్నది వారివారి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా నిర్ణయించుకోవాలి. ఫ్లాట్ అనేది అపార్ట్‌మెంట్ లేదా బహుళ అంతస్తుల ఇంటిలో ఉండే ఓ హౌసింగ్ యూనిట్ భాగం. ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నప్పుడు లేదా కొనుగోలు చేసినప్పుడు కొన్ని సౌకర్యాల గురించి తప్పనిసరిగా ఆలోచించాలి. అందులో పచ్చని తోట, స్విమ్మింగ్ పూల్, పిల్లలకు ప్లే గ్రౌండ్ వంటి సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. ఒక ఫ్లాట్‌లో సాధారణంగా బెడ్‌రూమ్‌లతో పాటు ప్రధాన బెడ్‌రూమ్ ఉంటుంది. ఇందులో వంటగదితో పాటు ఒకటి లేదా రెండు వాష్‌రూమ్‌లు ఉంటాయి. ఇది ఒకే అంతస్థుల వసతి. ఇందులో ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే ఉంటాయి.
ఫ్లాట్‌లో వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాలు..
Uses Flats and Disadvantages : ఫ్లాట్‌లో నివసించడం వల్ల కొన్ని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. అంతే విధంగా అప్రయోజనాలు కూడా ఉన్నాయి.
- ఫ్లాట్ల స్థానం సాధారణంగా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది.
- అవి వ్యాపార సంస్థలకు, మార్కెట్‌లకు చాలా దగ్గరగా ఉంటాయి.
- చాలా చోట్ల ఫ్లాట్లు ఓ కేంద్రంగా ఉంటాయి.
- ఫ్లాట్‌లో ఉన్నవారికి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లడానికి సులభంగా ఉంటుంది.
- అందుకు రవాణాపై ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు.
- డ్యూప్లెక్స్ కొనుగోలు ఖర్చుతో పోలిస్తే, ఫ్లాట్ కొనుగోలు ఖర్చు చాలా తక్కువ.
- ఫ్లాట్‌లో ఉంటే గోప్యత లోపిస్తుంది.
- ఫ్లాట్ అనేది అనేక అంతస్తులు, బ్లాకులను కలిగి ఉండే అపార్ట్మెంట్‌లో భాగం.
- వందలాది మంది నివాసముంటారు.
- ఒక ఫ్లాట్‌ను సొంత ఇంటితో పోల్చితే చిన్నవిగా ఉంటాయి.
- చాలా వస్తువులు ఒకే ఫ్లాట్‌లో ఉంచడం కష్టంగా ఉంటుంది.